April 24, 2024

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు భృగుమహర్షి శాపము వలన దేవాలయాలు ఉండవు. ఉన్న దేవాలయాలు కూడా శివలింగాకృతిలో ఉంటాయి. అటువంటి దేవాలయాలు బ్రహ్మ, శివుడు పేర్లను కలిపి ఉంటాయి. అందుచేతనే శివుడిని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మను తలచుకుంటాము, అటువంటి దేవాలయాలలో గుంటూరు జిల్లా లోని చేబ్రోలు గ్రామములో వెలసిన చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయము చాలా ముఖ్యమైనది. ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంటాద్రి నాయుడు గారు 200 ఏళ్ల క్రితము అంటే […]

స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల

రచన: సి. ఉమాదేవి పోలంరాజు శారదగారు జగమెరిగిన రచయిత్రి. ఆంధ్రభూమిలో ప్రచురింపబడిన నవల బంగారు కంచం. ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో రచింపబడిన నవల. నేటి పరిస్థితులకు భిన్నంగా ఒకనాటి హద్దులు, సామెతలు కొడుకునైనా, కోడలినైనా కట్టడి చేసే విధంగా అత్తలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వల్లెవేయడం పరిపాటి. ఈ నవల వాటి పరిణామాలను బహిర్గతపరచింది. ఒకనాటి ఉమ్మడి కుటుంబాలలో పెద్దలమాటే శిరోధార్యం. వారి మాటలను అతిక్రమిస్తే నలుగిరిలో చిన్నబోవడమేకాక కఠినమైన శిక్షలకు కూడా గురవుతారు. తరాలు మారాయి. కాని […]

తపస్సు – పిల్లల ఆటస్థలం

రచన: రామా చంద్రమౌళి చెట్టుకింద సిమెంట్‌ బెంచీపై కూర్చోబోతున్నా రివ్వున పరుగెత్తుకొచ్చింది బంతి కాళ్ళలోకి జివ్వున సముద్రం ఉరికిచ్చి .. పట్టుకుంటూండగా వచ్చాడు వాడు పరుగెత్తుకుని ముఖంనిండా వెలుగు .. కళ్ళలో ఆకాశం బంతిని అందించగానే .. తుఫానై వెళ్ళిపోయాడు – పిల్లలు ఆడుతూనే ఉన్నారు పదిమంది దాకా ఆట ఒక్కటే .. మనుషులే వేర్వేరు వెనక్కి బెంచీ అంచుపై చేతులను విప్పి చాపి కళ్ళు మూసుకుంటే పొద్దంతా, కొద్దిసేపు పులినై, మరికొద్దిసేపు పిల్లినై అప్పుడప్పుడు చెక్కుకున్న […]

జానపదబ్రహ్మ బి.విఠలాచార్య

రచన: శారదాప్రసాద్ ‘జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌ ని బ్రహ్మాండంగా మెచ్చుకున్నాం! వాళ్లకు హైటెక్ కెమెరాలు, అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!మిలియన్ డాలర్ల డబ్బులున్నాయి ! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఆయన దగ్గర ఉందల్లా ఓ మిఛెల్ కెమెరా,మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు మాత్రమే ! వీటితోనే వెండితెరపై పరకాయ ప్రవేశాలు… గుర్రపు స్వారీలు… కత్తి ఫైటింగులు… వింత పక్షులు, జంతువులు… పుర్రెలు, అస్థిపంజరాలు… సృష్టించాడు. బి.విఠలాచార్య ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 49

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య మనకు జ్ఞానయజ్ఞం అంటే ఏమిటో దాని స్వరూపం ఎలా ఉంటుందో భగవద్గీతలోని శ్లోక రహస్యాలను మనకీ కీర్తనలో అందిస్తున్నాడు. సుఖ-దుఃఖాలను ఒకేలా పరిగణిస్తూ, కేవలం ఒక యజ్ఞం లాగా భగవంతుని ప్రీతి కోసం తమ కర్మలను ఆచరించేవారిని గూర్చి చెప్తున్నాడు.. యజ్ఞం అనేది చాలా విధాలుగా ఉంటుంది, అందులో చాలా రకాలు చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు, కర్తలు […]

గానం.. సంగీతం…

రచన: భాస్కర ఇందుప్రియ పదము పదము వాక్యమవును స్వరము పదము పిలుపు అవును సమర్పణతో ప్రార్థనవును రాగముతో గానమవును మనసులోని భావం తెలిపే మార్గమిదే విప్లవాన్ని నలుదిశలా రగిలించిన అగ్ని ఇదే పసిపిల్లల నిదురబుచ్చు మంత్రమిదే పరమాత్ముడు మోక్షమిచ్చు జ్ఞానమిదే ఇదే ఇదే ఏంటది?… నువు పాడే పాటది … దాని విలువ ఎంతటిది .. వెల కట్టలేని సంపదది.. జననమనేదొక రాగం మరణమనే మరో రాగం ఈ రెండిటి నడుమ సృష్టి పలికేదే నీ జీవనరాగం […]

నీ కోసమై ఎదురు చూసే మా అన్నదాతను కరుణించూ

రచన: మౌనిక స్వాగతం…. సుస్వాగతము…. ఓ వరుణదేవ నీవు తడిచినా…! నీరు అందిస్తావు…. నీడవై వెంటే ఉండి నడిపిస్తావు… నిరంకుశంగా నీ దీవెనలు అందిస్తావు… వచ్చావా నీవూ నీ జగతిలోకి… వచ్చావా నీవూ నీ పుడమిలోకి… వచ్చావా నీవూ నీ ఆవనిలోకి… అరవిచ్చిన ఆనందంతో చినుకులు అడుగులై తాకుతుంటే….. మోము మకరిందుస్తుంది…. మది పులకరిస్తుంది… మనసు పరవసిస్తుంది… ఆ చినుకు జల్లుల హరివిల్లులలో పసితనం పరవళ్ళు తీస్తుంది… ఆ చినుకు జల్లుల వాసంతంలో ధరణి తెచ్చే మకరందం […]