March 19, 2024

ప్రేరణ

రచన: లలితా వర్మ “అక్కడ సీటుంది కూర్చోండి.” తన వెనకగా వినబడిన చిరపరిచితమైన కంఠస్వరం తల వెనక్కి తిప్పేలాచేసింది. వెనుదిరిగిన వాసంతి తన వెనకాల నిలబడిన వ్యక్తిని చూసి సంభ్రమానికి గురైంది. అప్రయత్నంగా ఆమె పెదవులు వుచ్చరించిన పేరు “ప్రభాకర్.” కదులుతున్న బస్ లో ఒకచేత్తో పాపని యెత్తుకుని, మరో భుజానికి బరువైన హాండ్ బాగ్ వేలాడుతుండగా డ్రైవర్ వెనకాలవున్న రాడ్ ని ఆనుకుని నిలబడిన వాసంతికి అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా వుంది. సందేహిస్తూ […]

అమ్మమ్మ – 17

రచన: గిరిజ పీసపాటి ఆ రోజు పెద్దవాళ్ళు బలవంతం చేస్తే తిన్న మూడు ఉండలే తప్ప మళ్ళీ ఆ కాయం తిననే లేదు నాగ. అత్తగారు తన చేతిలో తినమని వేసిన మూడు ఉండలూ పనిలో ఉన్నానని సాకు చెప్పి, పక్కన పెట్టి, తరువాత రహస్యంగా చిన్న చేతిలో పెట్టేసేది. చిన్న కూడా ఎలాగూ పెద్దవాళ్ళు అడిగితే ఇవ్వరని మహదానందంగా ఆ కాయపుండలను తినేసేది. నాగకు పసి పిల్లను సాకే వయసు లేకపోవడంతో పాప బాధ్యత అంతా […]

మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

రచన: గిరిజరాణి కలవల “మండోదరరావు మూర్ఖత్వం “ “మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట.. చస్తున్నా మీతో.. “ పెనం మీద అట్టు తిరగేస్తూ అంది రావణి. “ఏంటోయ్! ఇప్పుడు నేనేం చేసానూ? నామీద ఎగురుతున్నావు”అన్నాడు మండోదరరావు. “ఏం చేయలేదు అని అనండి… ఏం చేసినా, ఏం చెప్పినా రెట్టమతమే మీరు. ఫలానాది తీసుకురండి అని ప్రత్యేకంగా చెపితే, అది తప్ప మిగతావన్నీ తెస్తారు. తేవద్దు అని ఏదైనా చెపితే అదే విపరీతంగా తెచ్చి పడేస్తారు. అయోమయం […]

గిలకమ్మ కతలు – పుచ్చు రేగ్గొట్టిన …పిచ్చిగ్గొట్తం..!

రచన: కన్నెగంటి అనసూయ అయ్యేల కిష్ణాస్టమి. సరోజ్ని ఆల్లింటికి కూతంత అయిదారిళ్లవతల…దేవుణ్ణెట్టేరేవో..సందలడేకొద్దీ.. ఏ పిల్లోడి మొఖం చూస్నా.. ..ఉట్టికొడతం ఇంకెప్పుడానే ఉబలాటవే కనిపిత్తుంటే..ఈధరుగు మీద కూకుని..ఆల్లనే గమనిత్తా మాట్తాడుకుంట్నారు..సరోజ్నీ, సేసారత్నం, సత్తెమ్మా, మూలింటి ముప్పరాజోళ్ల కోడలూ.. సందులో ఎంకాయమ్మా..అందరూను. అయ్యాల మొదలెట్టి..ఇగ ఏడ్రోజుల పాటు సందడే సందడి.. ..మూడేళ్ల కిందట…తొమ్మిది, పదో తరగతి సదివే పిల్లలంతా యధాలాపంగా .సేద్దారనుకున్న కిష్ణాస్టమి కాత్తా..పెద్దోళ్ళు కూడా కలిసొచ్చి తోసినోళ్లకి తోసినంతా సందాలేసేరేవో..మూడేళ్ళు తిరిగే తలికి అదో పెద్ద పండగలాగయిపోయింది… తొలేడాది..కొబ్బరాకుల్తో […]

చంద్రోదయం – 7

రచన: మన్నెం శారద “నాకు నీ పెళ్ళి చూడాలని వుందిరా. పెళ్లికొడుకు వేషంలో నువ్వు చాలా బాగుంటావు. నా కోరిక తమాషాగా అనిపిస్తోంది కదూ!” “బావుంది. నీ సరదా కొసం ఎవర్ని బడితే వాళ్లని కట్టుకోమంటావేం ఖర్మ” “అలా ఎందుకంటాను? నచ్చితేనే” “అంటే ఏదో సంబంధం తెచ్చేవన్నమాట.”అన్నాడు సారధి శేఖర్‌ని పరీక్షగా చూస్తూ. “ఓ విధంగా అంతేననుకో. కాని కథంతా విని ఆలోహ్చించి నీ నిర్ణయం తెలియబరచు” సారధి మాట్లాడలేదు. శేఖర్ కూడా కాస్సేపు మౌనంగా కూర్చుని […]

కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యతనొసగిన కథలు – ఔను .. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సమీక్ష: సి. ఉమాదేవి   గౌతమి సత్యశ్రీ సాహిత్యానికి సమయాన్ని కేటాయించి తన వృత్తిధర్మాన్ని నెరవేరుస్తూనే ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు శీర్షికతో కథాసంపుటిని తీసుకుని రావడం ముదావహం. పదహారు కథలున్న ఈ కథాసంపుటిలో ప్రతి కథకు సమాజంలో జరిగే సంఘటనలే నేపథ్యం. మంచి చెడుల విశ్లేషణలో కథలలోని పాత్రలు పలికే పలుకులు అందరినీ ఆలోచింపచేస్తాయి. ఆమెలాగా ఎందరో కథ ప్రకృతి నేర్పిన పాఠమే. లక్ష్మమ్మ భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయినా భీరువై దుఃఖపడక తను కూర్చున్న చెట్టునీడే […]

కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

రచన: రవీంద్ర కంభంపాటి చిన్నప్పటి నుంచీ మా కాశీ అత్తయ్యకి నవలల పిచ్చి. ఈ నవల ఆ నవల అని కాదు.. తెలుగు నవల కనిపిస్తే చాలు.. చదవకుండా వదిలిపెట్టేది కాదు! కాశీ అత్తయ్య అంటే ఆవిడేదో కాశీలో ఉంటుందని కాదు.. ఆవిడ పేరు కాశీ అన్నపూర్ణ.. మా తాతగారు ఆవిణ్ణి కాశీ అని పిలిచేవాడట.. దాంతో అదే పేరు ఆవిడ తరం వాళ్ళకీ, మా తరం వాళ్ళకీ ఖాయమైపోయింది. ఆవిడకి పుస్తకాల మీదున్న ఇంట్రెస్టు చూసి, […]

రాజకీయ చదరంగం

రచన: గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం బ్రజరాజపురం ఒక మున్సిపాలిటీ. ఆ ఊళ్ళో ఒక జూనియర్ కాలేజీ, రెండు సెకండరీ స్కూళ్ళు, ఒకటి ప్రభుత్వంది, మరొకటి ప్రైవేటుది ఉన్నాయి. ప్రభుత్వంది ఒక ఆసుపత్రి ఉంది. అందులో డాక్టరు ఉంటే మందులుండవు, మందులుంటే డాక్టరుండడు. ఊరు శివార్లలో ఒకే ప్రాంగణంలో శివాలయం, ఆంజనేయ ఆలయం ఉన్నాయి. రెండింటికి పూజారి ఒక్కడే. శేషాచారి. బ్రజరాజపురంలో అందరికి తెలిసిన వ్యక్తి సత్యానందం. ఊరంతా అతనిని సత్తిబాబు గారు అంటారు. సత్తిబాబు మునిసిపాలిటీ […]

తామసి – 1

రచన: మాలతి దేచిరాజు సూర్యోదయమైన కొన్ని గంటలకి, సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఒక విల్లా… “జగమంత కుటుంబం నాదీ… ఏకాకి జీవితం నాదీ!” అంటూ మోగుతోంది రింగ్ టోను.. దుప్పటిలో నుంచి చేయి బయట పెట్టి ఫోన్ అందుకున్నాడు గౌతమ్. “హలో.. ” అప్పుడే నిద్రలో నుంచి లేవడంతో బొంగురుగా ఉంది అతని గొంతు. “హలో నేను…”అమ్మాయి స్వరం ఆ స్వరం వినగానే అతని నాడీ వ్యవస్థ అప్రమత్తమైంది. ఉదయాన్నే చెవిలో అమృతం పోసినట్టు ఉందా […]

మబ్బు తెరలు

రచన: ప్రభావతి పూసపాటి “శ్యామల వాళ్ళ అబ్బాయ్ కి ఈ సంబంధం కూడా కుదరలేదుట” సీట్లో కూర్చుంటూ చెప్పింది కస్తూరి. శ్యామల, కస్తూరి నేను ఇదే ఆఫీస్ లో పదియేళ్ళుగా కలిసి పని చేస్తున్నాము. కోలీగ్స్ కన్నా మంచి స్నేహితుల్లా కలిసి ఉంటాము. ‘శ్యామల పిచ్చిగానీ ఈ రోజుల్లో అబ్బాయ్ నచ్చడమే పెద్ద విషయం అనుకొంటుంటే, రాబోయే అమ్మాయి ఆడపడుచుతో కూడా సఖ్యంగా ఉంటేనే సంబంధం కుదుర్చుకుంటాం అని శ్యామల అనడం నాకే విడ్డురంగా అనిపిస్తోంది “అని […]