May 31, 2023

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 50

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది అన్నమయ్య సంస్కృత సంకీర్తన. శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారమెత్తినపుడు, కురుక్షేత్ర యుద్ధానంతరం అశ్వద్ధామ దుర్యోధనునికి ఇచ్చిన మాట మేరకు ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా […]