June 24, 2024

ఆదిగురువు

రచన: డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం “ఇదిగో విశాలా మాట” రాధమ్మ పిలుపు విని విసుగ్గా ముఖం చిట్లించి ఆమె దగ్గరకు వచ్చింది రెండో కోడలు విశాల. “చక్రపొంగలిలో పచ్చ కర్పూరం వేయడం మరచి పోవద్దని వంటాయనకు చెప్పు. ” గుర్తు చేసిందామె. ” వాళ్ళకు తెలియదా ఏమిటి? మనం ప్రత్యేకం చెప్పాలా? ” అనేసి పట్టు చీర రెప రెప లాడించుకుంటూ వెళ్ళిపోయింది విశాల. ఆమె చేతికి వున్న అరడజను బంగారు గాజులు మట్టి గాజులతో కలిసి […]

తపస్సు – అప్పుడప్పుడు.. కొన్ని

రచన: రామా చంద్రమౌళి ఆమె ఒక కూలీ కొత్తలో.. అతను ఆమె అందమైన ముఖాన్ని ఫోటో తీశాడు బాగుంది.. జీవాన్ని నింపుకుని.. నిర్మంగా కాని ఆ ఫోటో అతనికి నచ్చలేదు మరోసారి ఆమె ఒక రోడ్దుపనిలో నిమగ్నమై ఉండగా ఫోటో తీశాడు చాలా బాగుంది కాని అతనికి అదీ నచ్చలేదు అందులో ఆమె దేహముంది.. కాని వర్చస్సు లేదు మళ్ళీ ఒకసారి ఆమె నడచి వెళ్ళిపోతూండగా కేవం ఆమె వెనుక భాగాన్ని ఫోటో తీశాడు నచ్చిందది అతనికి […]

యాత్రామాలిక – శృంగేరి

రచన: నాగలక్ష్మి కర్రా శృంగేరి అంటే తెలీని హిందువు వుండడనే నా అభిప్రాయం , వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ వే జ్ఞాపకం వస్తుంది , మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా , పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయివుంటారు. ఆది శంకరాచార్యులవారు స్థాపించిన శారదాపీఠం కూడా ఇక్కడే వుందనీ మనకు తెలుసు. మిగతా వివరాలు ఇవాళ తెలుసుకుందాం. శృంగేరీ కర్నాటకలోని ‘ చికమగళూరు ‘ జిల్లాలో పడమటి కనుమలలో ‘ తుంగ’ […]

దండోపాయం

రచన: వి ఎస్ శాస్త్రి ఆకెళ్ళ సుబ్బారావు, ఇరవై రెండేళ్ల జీవితంలో సింగల్ బెడ్ నుండి డబల్ బెడ్ కి మారిన కొత్త రోజులు. ప్రక్కన మల్లెపూల సువాసనలు. పదిహేను రోజులుగా అలవాటు పడిన సహవాసం. రెండు రోజుల వ్యాపార ప్రయాణం తరువాత, నిద్రాదేవత గాఢ పరిశ్వంగం. అర్ధరాత్రి తలుపు చప్పుడు. పాపం ఎంత సేపటి నుండి కొడుతున్నారో, కొండచిలువలా చుట్టుకున్న పావనిని విడిపించుకుని సుబ్బారావు మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు. ఇంత అర్ధరాత్రి వచ్ఛేదెవరు. […]

మామ్మగారి వంటామె

రచన: రమా శాండిల్య “ఓరి ఓరి ఓరి. . . . ఓ చడీలేదు, చప్పుడూలేదు అజా, ఆనవాలూ మచ్చుక్కి లేవు. . చుంచుమొహంది. . హేంత పనిచేసింది నంగానాచి మొహంది. . . ” హాల్లోని చెక్క ఉయ్యాలలో కూర్చుని గీత చదువుకుంటున్న రంగనాధం తాతగారితో వంటమ్మాయి ‘లక్షుమమ్మ’ గురించి గొంతు తగ్గించి గుసగుసగా చెప్పింది సీతమామ్మా. . . “మరే! శుద్ధ చలితేలు వాటం. . . దీని దుంప తెగ, చేతివాటం చూపించడంలో […]

సహారా

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మీ. ” కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే.ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్” స్నానం చేసి తడి తలను భజం మీది తువ్వాలతో తుడుచుకుంటూ వెంకటేశ్వర సుప్రభాతం పాడుతూ దేవుడి గదిలోకి వచ్చిన శంకరానికి పెద్ద పెద్ద ఇత్తడి కుందులలో దీపాలు వెలుగుతూ స్వాగతించాయి. దేవుడి ప టాలు నిండా పువ్వుల దండలు ఇత్తడి సింహాసనంలో దేవుడి విగ్రహాలనిండా ఎర్రని మందారాలు పసుపు తెలుపు నంది వర్ధనాలు పొగడ పూల […]

జరత్కారుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు జరత్కారుడు హిందూ పురాణాలలో ప్రస్తావించబడ్డ ప్రకారము ఒక గొప్ప ముని. ఈయన ప్రస్తావన మహాభారతము, దేవి భాగవత పురాణము, బ్రహ్మ వైవర్త పురాణాలలో ఆస్తికుని ప్రస్తావన వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే నాగజాతిని జనమేయజేయ యజ్ఞము నుండి కాపాడినది ఆస్తికుడే ఆ ఆస్తికుని తండ్రియే జరత్కాకారుడు ఆస్తికుని కధ మహా భారతము లోని ఆదిపర్వంలో వివరించబడింది. జరత్కారుడు నాగ దేవత అయిన మానస(వాసుకి చెల్లెలు అయిన జరత్కారి) భర్త. జరత్కారుడు యాయవారపు(ఇంటింటికి తిరిగి […]

అతి పెద్ద పాద‌ముద్ర కొంద‌రికి హ‌నుమంతుడు, మ‌రికొంద‌రికి జాంబ‌వంతుడు… ఇంత‌కీ య‌తి ఉందా?

రచన: మూర్తి ధాతరం భారతీయ సైనికులు ఆ మ‌ధ్య హిమాల‌యాల్లో భారీ మంచు మనిషి అడుగుల్ని గుర్తించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఇండియన్‌ ఆర్మీ ట్వీట్‌ చేసింది. హిమాలయాల మంచుపై యతి అడుగులు ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది. భార‌తీయ‌ పురాణాల ప్రకారం యతి అనేది ఒక‌ భారీ మంచు మనిషి. నేపాల్‌, టిబెట్‌, భారత్‌తో పాటు సైబీరియాలోని మంచు ప్రాంతాల్లో అతిభారీ పాదాలు కలిగిన రాకాసి జీవులు ఉన్నట్లు కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 51

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుని దివ్యమయిన రథాన్ని అన్నమయ్య అభివర్ణిస్తున్నాడు. వినండి. కీర్తన: పల్లవి: దేవదేవోత్తముని తిరుతేరు దేవతలు గొలువఁగా తిరుతేరు ॥పల్లవి॥ చ.1. తిరువీధులేగీని తిరుతేరు తిరుపుగొన్నట్లాను తిరుతేరు తెరలించె దనుజులఁ దిరుతేరు తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు ॥దేవ॥ చ.2. ధిక్కిరించీ మోతలఁ దిరుతేరు దిక్కరికుంభా లదరఁ దిరుతేరు తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు తెక్కులఁబ్రతాపించీఁ దిరుతేరు ॥దేవ॥ చ.3. తీరిచెఁ గలకలెల్లఁ దిరుతేరు ధీర గరుడవాహపుఁ దిరుతేరు చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని – తీరున […]