March 28, 2024

కాలాన్ని ఓడించే నీ జ్ఞాపకాలు

రచన: సునీత పేరిచర్ల ఎప్పటిలానే నిద్రలేచి‌ ఆఫీస్ కి రెడి అవుదామని లేచి కూర్చుంటే పొద్దుపొద్దున్నే వానా గట్టిగానే పడుతుంది.. ఆ నిద్ర కళ్ళతోనే ఉన్నట్టుండి సడెన్ గా నువ్ గుర్తొచ్చావు ఇంతకుముందు రోజులు ఎలాఉండేవి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించుకుంటుంటేనే నిద్రమత్తు ఒక్కసారిగా వదిలింది ఆ రోజుల్లో‌ ఇద్దరిలో ఎవరు ముందు లేస్తే వారు మిగిలిన వాళ్లని‌ నిద్ర లేపేవాళ్ళము ఇద్దరికీ ఇష్టమైన ఫుడ్ ఎదైనా కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేస్కునేవాళ్ళం ఒకరి డైరీ […]

కాళోజీ మొగ్గలు

రచన: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ తెలంగాణ మాటలను తూటాలుగా పేలుస్తూ అవినీతిపై అక్షరాయుధాలను సంధించినవాడు అధర్మంపై న్యాయపోరాటం చేసినవాడు కాళోజీ కవితలతో నిరంతరం అక్షరయుద్ధం చేస్తూనే ప్రజలను కవితాశక్తితో చైతన్యవంతం చేసినవాడు నడుస్తున్న చరిత్రకు సాక్షీభూతం కాళోజీ నా గొడవ అణిచివేతలను అన్యాయాలను సదా నిరసించి సామాజిక మార్పుకోసం పాటుపడినవాడు సమాజ ప్రగతికోరిన అభ్యుదయవాది కాళోజీ సామాన్యుల ఆక్రందనలకు తిరుగులేని గొంతుకై ఆపన్నహస్తంలా వారిని ఆలింగనం చేసుకున్నవాడు సామాన్యప్రజలకు ఉద్యమగొంతుకైనవాడు కాళోజీ నిజాం వ్యతిరేక పోరాటంలో ముందుకు […]

ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

రచన: చందలూరి నారాయణరావు ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు? నిజమే…. ఎవరికీ గుర్తుకు రాలేడు. మరిచాను అన్నది మనసులో ఉన్నా బుద్ధికి మాత్రము దరిదాపులలో లేదు. ఎదురుపడ్డా పలకరించే తీరికలేని బతుకుల్లో ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు? మనిషి ఆకాశమంత ఎత్తులో ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని కనిపించని యుద్ధంలో అలసి సొలసి పోతుంటే… ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు? రాత్రి నిదుర పోకుండా పగటిని కదలకుండా నిశబ్దం కాపలా కాసే విపత్తు వేళలో అనునిత్యం నిఘాతో నియమ […]

గిలకమ్మ కతలు – “అనేసుకుంటేనే ..అయిపోద్దా..ఏటి..!”

రచన: కన్నెగంటి అనసూయ     “..నువ్వేవనుకోనంటే నీ సెవ్లో ఓ..మాటేద్దావని…కాతంత పెందళాడే వచ్చేసేనే కోడలా..ఇట్టవున్నా లేపోయినా మనసులో.. ఓమూల  పడేసుంచు..ఎంతుకయినా మంచిది..ఏవమ్టావ్?” గుసగుసలుగా  నీల్లు నవిలింది  రావయ్యమ్మ..సరోజ్ని  భుజమ్మీద సెయ్యేసి సుతిమెత్తగా..ముందుకు తోత్తా.. ఎనభయ్యో నెంబరు నూల్తో నేసేరేవో..గెంజెట్టి ఇస్త్రీ సేసిన కాతేరు సంఘవోళ్ళ నేతసీర అక్కడక్కడా గెంజి మరకలు కనిపిత్తన్నా పెళపెళలాడ్తందేవో..దగ్గిరికంటా నొక్కుకుని మరీమడతేసిన ఎడంకాల్తో అణిసిపెట్టి…కుడికాలు మోకాల్నానుత్తా..గెడ్డన్కి సెయ్యాన్చి కూచ్చుని సరోజ్నీనే ఎగాదిగా సూత్తంది రావయ్యమ్మ ఆమాటొదిలేసి…ఏవంటదో సూద్దారని. .. అప్పుడుదాకా ఇరుగూపొరుగోల్లు […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 50

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది అన్నమయ్య సంస్కృత సంకీర్తన. శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారమెత్తినపుడు, కురుక్షేత్ర యుద్ధానంతరం అశ్వద్ధామ దుర్యోధనునికి ఇచ్చిన మాట మేరకు ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా […]

మాలిక పత్రిక ఆగస్టు 2020 సంచికకు స్వాగతం…

Jyothivalaboju Chief Editor and Content Head రచయితలకు, పాఠక మిత్రులకు సాదర ఆహ్వానము. నమస్కారములు. కరోనా, లాక్ డౌన్ అని మనమంతా ఇంట్లోనే ఉన్నా, ప్రకృతి ఊరుకుంటుందా. తనపని తాను చేసుకుంటూంది. వేసవి ఎండలు, మామిడి, మల్లెలు అయిపోయి వానాకాలం మొదలైంది. చినుకులు, అప్పుడప్పుడు కుంభవృష్టితో నగరాలు, పల్లెలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. వ్యవసాయం పనులు కూడా మొదలయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు తగు జాగ్రత్తలతో వెళ్లి వస్తున్నారు. చాలామంది ఇంటినుండే పని చేస్తున్నారు. మంచిదే.. తగు జాగ్రత్తలతో […]