March 28, 2024

గిలకమ్మ కతలు – నడిసెల్లేదారి

రచన: కన్నెగంటి అనసూయ భుజానున్న సంచిని మొయ్యలేక మొయ్యలేక మోత్తా..పరిగెత్తుకుంటా వచ్చేసేడు శీను బళ్ళోంచి. సందలడే యేల సరోజ్ని బయటే అరుగు మీద కూకుని సేట్లో పోసి తెచ్చుకున్న బియ్యంలో మట్టిబెడ్డలుంటే ఏరతందేవో..ఎవరా వగురుత్తున్నారని తలెత్తి సూసేతలికి శీను.. దాంతో.. “ ఏటా పరిగెత్తుకొత్తం? ఏం కొంపలంటుకుపోతన్నయ్యనీ..! గొప్పదగిలి ఎక్కడన్నా పడితేనో..” అంటా ఇసుక్కుంది..కొడుకెనక్కే సూత్తా.. శీనగాడా మాటలెయ్యీ లెక్కసెయ్యనట్టు.. ఎంత పరిగెత్తుకొచ్చేడో అంతిసురుగానూ పుస్తకాల సంచి అరుగుమీదడేసి..ఆళ్ళమ్మ దగ్గరకంటా వచ్చేసి రాస్కున్నిలబడి.. “ అమ్మా..మరే…మరి అక్క…” […]

నవరాత్రులలో రాత్రికే ప్రాదాన్యము.

రచన: సంధ్యా యల్లాప్రగడ “సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥” సంవత్సరములో వచ్చే నవరాత్రులలో శరన్నవరాత్రులు ముఖ్యమైనవి. శరత్నఋతువులో అశ్వీజమాసపు శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకూ వచ్చే ఈ నవరాత్రులు పావనమైనవి, పరమ ప్రశస్తమైనవి. సనాతన ధర్మములో వచ్చే పండుగలలో అత్యంత ఆహ్లాదకరమైన పండుగ ఈ నవరాత్రులతో కూడిన దసరా. వాతావరణములో వేడి, చలి లేని సమశీతల ఉష్ణోగతలతో వుండి ప్రకృతి కూడా రాగరంజితమై వుంటుంది ఈ సమయములో. […]

అమ్మమ్మ – 18

రచన: గిరిజ పీసపాటి డాక్టర్ రాజేశ్వరమ్మ గారి దగ్గర నుండి ఇంటికి వచ్చిన అమ్మమ్మ ఆలోచనలో పడిపోయింది. ‘తనమీద ఉన్న అభిమానం కొద్దీ రాజేశ్వరమ్మ గారు తనని హైదరాబాదు తీసుకెళ్తానన్నా అక్కడికెళ్లగానే ఆవిడకు తన విషయం ఏ గుర్తుంటుంది? ఒకవేళ ఉన్నా ఇది తెలిసిన ఊరు, ఎరిగిన మనుషులు కనుక పని ఇప్పించగలిగారు కానీ అక్కడ ఆవిడ తనకి పని ఎలా ఇప్పించగలరు? ఒకవేళ ఇప్పించినా ఆ మహానగరంలో ముక్కు మొహం తెలియని మనుషుల మధ్య ఒంటరిగా […]

మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head చిన్న గడ్డిపువ్వు కాని, కాగితం పువ్వు కాని, గులాబీ అయినా, బుల్లి మల్లియ అయినా, లిల్లీ అయినా, కార్నేషన్స్ అయినా పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటూనే తమ అందాలతో అందరికీ ఆనందాన్నిస్తాయి. కొన్ని అలంకరణకు వెళితే, కొన్ని తరుణుల వేణిలో వయ్యారంగా కూర్చుంటాయి, కొన్ని దేవుడి కొలువుకు వెళితే మరి కొన్ని అంతిమ ప్రయాణంలో తళుక్కుమంటాయి. అలంకరణ అయినా, ఆరాధన అయినా, అంతిమయాత్ర అయినా ప్రతీ పువ్వు […]

చంద్రోదయం – 8

రచన: మన్నెం శారద గంగాధరంగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ముఖంలో కండరాలు బిగుసుకున్న తీరులోనే ఆయనెంత కోపంలో వున్నది అర్ధమవుతుంది. ఆయన పక్కన ఆయన సతీమణి శాంతమ్మగారు ఆందోళనగా నిలబడి చూస్తున్నారు. శేఖర్ తల వంచుక్కూర్చున్నాడు. సారధి గుమ్మానికి జేరబడి నిలబడ్డాడు. అతనికి జంకుగా వుంది. ఒక విధంగా యిలాంటి వాతావరణం కల్పించింది తనే. “అంటే నీ నిర్ణయం మారదంటావు?” గంగాధరంగారు మరోసారి అడిగేరు. “ఇందులో మార్చుకొవాల్సింది ఏముంది డాడీ?” శేఖర్ నెమ్మదిగా అన్నా, స్థిరంగా వున్నాయా […]

రాజీపడిన బంధం – 7

రచన: ఉమాభారతి ఎంతసేపు పడుకొన్నానో! కళ్ళు తెరిచి చూస్తే, టైమ్ సాయంత్రం ఆరు గంటలయ్యింది. వొళ్ళు తెలియకుండా నిద్రపోయానన్నమాట. ఈ పాటికి సందీప్ స్నేహితులంతా ఇళ్ళకి వెళ్లిపోయుంటారు. లేచి చన్నీళ్ళతో మొహం కడుక్కొని గది నుండి బయటకి వస్తుంటే, సందీప్ కేకలు వినబడుతున్నాయి. చీర సరిచేసుకొని అటుగా వెళుతుంటే సందీప్ అరుపులు, ఏడుపు మరింత బిగ్గరగా వినిపించాయి. “జానకీ, వెళ్లి అమ్మని తీసుకురావే” అంటున్నారు అత్తయ్య. “ఏరా శ్యాం, ఇందాకటి వరకు బాబుతో అక్కడే ఉన్నావుగా! వాడే […]

ద్వారకా తిరుమల

రచన: శ్యామసుందర రావు కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వరునికి తెలుగునాట ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలోఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నది పారివాహిక ప్రదేశాలలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయలు ఉన్నాయి వాటిలో స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి “ద్వారక తిరుమల” అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభి ముఖుడై […]

కంభంపాటి కథలు – పర్ఫెక్ట్

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఈ ఆదివారం మా వకుళ వాళ్ళ గృహప్రవేశం.. ముందే చెబుతున్నాను మనిద్దరం వెళదాం ‘ అని మావారితో అంటే, ‘నాకూ రావాలనే ఉంది.. అసలే ఆమె నీకున్న ఒకే ఒక ఫ్రెండు కదా.. కానీ.. ఈ వీకెండ్ ఆఫీస్ వర్కు.. ఇంట్లోంచి పని చెయ్యక తప్పదు ‘అన్నారాయన ‘ఏదైనా ఫంక్షన్ కి నేనొక్కదాన్నే వెళ్ళడం నాకు ఇష్టం లేదు ‘ ముభావంగా అన్నాను ‘నిన్నొక్కదాన్నీ పంపడం నాకూ ఇష్టం లేదు.. పోనీ.. ఏ […]

కనిపించని వేరు

రచన: శ్రీనూ వాసా రమేష్ హైదరాబాద్ వచ్చి ఉద్యోగంలో చేరాడో లేదో.. పెళ్ళి పెళ్ళి అంటూ వెంటపడ్డారు వాళ్ళ నాన్నగారు. ఇంకా ఇరవై ఆరే.. హనీమూన్ కి వెళ్లడానికి కూడా డబ్బులు వెనకేసుకోలేదు అంటే.. “ఆ.. నేనే పంపిస్తాలే, ఏ తిరుపతో అన్నవరమో… ఒక ఫొటో పోస్ట్ చేసాను చూడు. వచ్చేవారం అమ్మాయి తండ్రి వాళ్ళ బావమరిదిని తీసుకుని వస్తున్నాడు నిన్ను చూడటానికి” అని ఫోను పెట్టేసారు రామారావు గారు. మొబైల్ ఫోన్లు ఈమైల్స్ లేని రోజులవి. […]

పోలుద్దామా మరి?

రచన: మణి గోవిందరాజుల దిగ్భ్రాంతిగా నిల్చుండిపోయింది నందిని..తలుపు విసురుగా వేసి వెళ్ళిన ప్రభు వేపే చూస్తూ. ఎప్పటిలాగే చిన్నగా మొదలయిన గొడవ పెద్దదయింది. అసలు జరుగుతున్నదేమిటో కూడా అర్థం కావడం లేదు. తనకే ఎందుకిలా అవుతుంది? అందరిళ్ళల్లో ఇలానే ఉంటుందా? వంట బాగా రాకపోతే అదో పెద్ద డిస్క్వాలిఫికేషనా? ఇంత చిన్న విషయానికి కూడా అంత పెద్ద గొడవ జరుగుతుందా? ఇహ ముందు ప్రేమికులు ఆ విషయాన్ని రూఢీగా తెలుసుకుని మరీ ప్రేమించాలి.తాను కూడా చాలా హాస్యకథలు […]