April 25, 2024

సహవాసిని

రచన: కావ్య రాము నీలవేణి. . . . నీలవేణి. . . . కాస్త టీ పెట్టు మా మిత్రులు వస్తున్నారు. . . . అలా సరదాగా మిర్చి చేసి పెట్టు. వాళ్ళకి నువ్వు చేసినవి అంటే మహా ఇష్టం. . . అని అంటున్న భర్తతో అవునండి నేను చేసినవన్ని అందరికి నచ్చుతాయి. . . కానీ మీకు మాత్రం నేనంటే పట్టే ఉండదు. . . . నెల రోజుల నుండి […]

మూడు సాకులు

రచన: ప్రభావతి పూసపాటి “అయ్యా!ఈ ఆశీర్వచనంతో మీ అన్నగారి కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి అయినట్లే ” అని పార్వతీశం ముగ్గురు కొడుకుల తలల మీద అక్షింతలు వేసి, శేషగిరి గారు ఇచ్చిన సంభవనాతీసుకొని శాస్త్రిగారు వెళ్లిపోయారు. గేట్ వరకు సాగనంపడానికి వచ్చిన శేషగిరి వీధి అరుగు మీద చతికిలపడిపోయారు . అన్న గారితో గడిచిన కాలంఅంతా సినిమా రీలులా మదిలోమెదిలింది . పార్వతీశం, శేషగిరి పేరుకి అన్నదమ్ములే ఐన ఒకే ప్రాణం గాపెరిగారు. ఇద్దరికీ ఆరు నెలల […]

టాన్యా! ఐ లవ్ యు

డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కారు మెల్బొర్న్ పట్టణం దాటి జీలాంగ్ అనే ఊరి మీద రయ్యిమని దూసుకు పోతోంది. అల్లుడు కారు నడుపుతుంటే పక్కన కూర్చుని బాక్ సీట్ డ్రైవింగ్ చేస్తోంది నా కూతురు. ‘ కాస్త స్పీడ్ తగ్గించు, జాగ్రత్త రెడ్ లైట్ వస్తోంది, పదినిముషాల్లో లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ‘అంటూ. ఆస్ట్రేలియా అనగానే ముందుగా స్ఫురించేది సిడ్నీ, మెల్బొర్న్ పట్టణాల పేర్లే. మెల్బొర్న్ డౌన్ టౌన్ కి వెడితే తప్ప హడావిడీ, జనం కనబడరు. […]

పొద్దు పొడుపు

రచన: రత్నశ్రీ వఠెం “కౌసల్యా సుప్రజా రామా” ఫోన్ లో అలారం రింగ్ టోన్ మోగేసరికి గాఢనిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను. “మరో పొద్దు మొదలయింది దేవుడా!, నా జీవితానికి మలిపొద్దు ఎప్పుడవుతుందో??” అనుకుంటూ మంచం దిగాను. మంచం మీద నా మొగుడు గురక పెడ్తూ పడుకుని ఉన్నాడు…. అర్ధరాత్రి దాకా బార్ల వెంట దార్ల వెంట తిరిగి బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతాడు… దేనికైనా పెట్టి పుట్టాలి మరి. నాకు మాత్రం తెల్లవారి నాలుగు గంటలకల్లా […]

పూలమ్మాయి

రచన: లక్ష్మీ పద్మజ సెల్‌ఫోన్‌ రింగ్‌కు మెలకువ వచ్చింది లలితకి. నెంబర్‌ చూసి వెంటనే లేచి కూచుంది. “లలితా నిద్ర లేచావా” అరిచినట్టు అంది మాలినీ దేవి. అయ్యో లేచాను మేడమ్‌ నేనే చేద్దామనుకుంటున్నాను అంది సంజాయిషీగా లలిత. “ఆ పర్లేదు నీ అకౌంట్‌లో నలభై వేలు వేశాను చూస్కున్నావు కదా. ఎంతవరకు వచ్చింది నా శారీ సంగతి” అంది మాలినీ దేవి. అదే చూస్తున్నాను మీ రంగుకు, అందానికి తగ్గది వెతుకుతున్నాను… రోజూ అదే పని […]

హాస్యపు విరిజల్లు నవ్వుల నజరానా

సమీక్ష: సి. ఉమాదేవి మనిషి జీవితంలో హాస్యం ఒక ఉద్దీపనగా భావించవచ్చు. హాస్యంలేని మనుగడ ఉప్పులేని కూరలా రుచించదు. ఇరవై ఆరుమంది రచయితలు, రచయిత్రులు హాస్యాన్ని తమదైన శైలిలో తమ రచనలలో పొందుపరచి మనకు ఆనందాలహరివిల్లునందించారు. ఇక కథలలోకి అడుగిడితే కథలన్నీ విభిన్న హాస్యసంఘటనలతో మిళితమై మనలో చిరునవ్వులు పూయిస్తాయి. వంగూరి చిట్టెన్ రాజు కథ మనల్ని అలరించడమే కాదు మనకు అమెరికా వాహనయోగం కథలో కారు కష్టాలను కళ్లకు కట్టినట్లు హాస్యస్ఫోరకంగా వివరించడం ఆకట్టుకుంటుంది. మణివడ్లమాని […]

ఉదయించాలనే….

రచన: చందలూరి నారాయణరావు     చెప్పడానికి ఏమి లేదన్నప్పుడే చెప్పుకొనేది ఏదో ఉన్నట్లే…   రెండు కళ్ళల్లో అలలను కట్టేసి సాగరాన్ని మోస్తున్నట్లే…   కోత పెడుతున్న జ్ఞాపకం గుండెల్లో  ఘోషిస్తున్నట్లే..   మౌనం ముసుగులో కలలను పోగుచేస్తున్నట్లే…   విరిగిన ఆలోచనకు వ్రేలాడే నిరాశకు ఒంటరిగా వేదనకు గురివుతున్నట్లే…   రాత్రిని చిట్లగొట్టి చీకటిని వెళ్ళగొట్టిన్నట్లే.   పగటిని తవ్వుతో వెలుగును వెతుకుతున్నట్లే   ఎక్కడో దూరంగా చుక్కలతో నిరంతరం సంభాషిస్తూన్నట్లే…   ఎక్కడో […]