రచన: పారనంది శాంతకుమారి

ఆర్జన పేరుతొ అభ్యంతరాలనన్నిటినీ వర్జించి,
అంతులేని సంపాదనను అక్రమ దారులలో ఆర్జించి,
భర్తతో జీవించాల్సిన ఘట్టాలనన్నిటినీ
పరాయివాడితో తెరపై నటిస్తూ ,తెర వెనుక జీవిస్తూన్న
ఎందరో నటులు.
పవిత్రత అనే పదాన్ని పక్కన పడేసి,
మానాన్ని,అభిమానాన్ని కూడా
ఎవరికీ అనుమానం రాకుండా తాకట్టు పెట్టేసి,
ధనాన్ని సంపాదించటంలోనే దృష్టినంతటిని పెట్టి,
నీతి,నియమాలను పక్కకు నెట్టి,
అయ్యారు విటులు.
ముందు భోగాలను ఆహ్వానిస్తూ,
తరువాత రోగాలను అనుభవిస్తూ,
తనచుట్టూ దోచుకొనే వారే తప్ప
తనకై దాచేవారే లేరనే నిజాన్ని తెలుసుకోలేక,
జీవితమంతా ఇలా దారి తప్పి ప్రవర్తించి
చివరికి ఆసరాయే లేకుండా, ఏ ఆశలు లేకుండా
ఒంటరి బ్రతుకును గడపలేక
కోరుకున్న వెంటనే మరణాన్ని పొందలేక పోతున్న
వారివెంట పడుతూ యమభటులు.

By Editor

One thought on “అయ్యో పాపం!”

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *