April 20, 2024

ఉదయ కిరణాలు…

రచన: రమా జగన్నాధ్

భానుడు ముచ్చట తో
మూసి మూసి గా
మూలల నుండి
చిగురు కొమ్మలను
ఛేదించుకుంటూ
రాతి గోడలను
ఎదురుకుంటూ
రావాల ? వద్ద అనుకుని
రాయసంగా చూసినా
తప్పలేక తళుకుల
మెరపూలతో రాకలు !

మొదటి కిరణ కాంతి
నా కనుబొమ్మలు పై
తాకే వేళలో
నా శయన వాహనం పై
నిద్రావస్తా నుండి
మెలుకువ తో మొదలు !
నా నాసిక రంధ్రాలకి
ఘుమ ఘుమ లాడే
ఘాటైన తేనీటి తేటలో
ఉప్పొంగే ఊరుకులలో
కనిపించే నా సతీమణి
సోపాన సోయగాలు !

సుప్రభాత శబ్దవాళి కి
సమాంతరంగా కొనసాగే
పొరుగింటి పొరక కట్టల
రాగల పల్లవిలు !

జూచి జూచి సంచులతో
శుభోదయ సంచారనికి బోయిన
శోభన సోకులతో కనువిందుగా
కనిపించే కోలాహలలు !

చిలిపి పలుకుల పిట్టల ధ్వనులు
కు కు లాడుతూ కోయాల కూతలు
కూర గాయల గానవళి
నారిమణుల నోము పూజల
నామ మంత్రాలతో, నారాయణుడి
ఆలయాల అర్చకుల అభివాదన
ఆశీర్వచనలు !

భావి పవురుల
బరువు భరాల బాధ్యత తో కూడిన
బాట లో బయిలుదేరు బడుల
వాహనా శబ్ధాలు !

ఉద్యాన వనములో ఊసులతో
ముసలి తాతల వాదోపవాదాలు
సమాచార సమహారాలే కాదు
ఎదుగు పోదుగులకు
ఎత్తు గడల వార్తా పత్రిక
విషయాలపై చర్చలు
రాజనాయితీక,రాయభార ,
ఆర్థిక అవశేష విశ్లేషేణలు !

ముచ్చటించి ముచ్చటించి
మందాన్ని మయ మరిచి
శీరోస్నానం గావించి
శంకర నాధునికి శిరశవహించి
కార్యనవేషణలో సన్నద్ధమయే
యాత్రలో స్వాగత శుభ పరిణామాలే
నా ఉదయ కిరణాలు ……………..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *