గజల్

రచన: ఇరువింటి వెంకటేశ్వర శర్మ

నీది, నాది, ఒకే గాథ ముగిసిపోదు ఏన్నటికీ
చీకటి వెలుగుల పయనం విసిగిపోదు ఎన్నటికీ

ఇరుమనసుల ప్రమాణాల శాసనమే పెళ్ళంటే
తొలిచూపుల దృశ్యకవిత చెదిరిపోదు ఎన్నటికీ

సతిపతులే అక్షయమౌ అనుపమాన ప్రేమజంట
వలపునెంత పంచుకున్న అలసిపోదు ఎన్నటికీ

ఒడిదుడుకుల అలలమీద గమనమేగ సంసారం
ఎదురీదక మునుముందుకు సాగిపోదు ఎన్నటికీ

ఇల్లూ,ఇల్లాలు,సుతులు అందమైన బంధాలూ
ముడులువడిన సూత్రమిదీ వీడిపోదు ఎన్నటికీ

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *