– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

క్విట్ ఇండియా ఉద్యమంతో జాతిని ఏకం చేసి
ఆంగ్లేయపాలకుల గుండెల్లో దడపుట్టించినవాడు
అలుపెరుగని పోరాటానికి అసలైన స్ఫూర్తి గాంధీజీ

స్వాతంత్ర్యసమరంలో ఆయుధాలనేవి పట్టకుండానే
అహింసాయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టినవాడు
సామాన్యులలో అసామాన్యుడిగా జీవించింది గాంధీజీ

సత్యాగ్రహ మహోద్యమంతోనే సమరశంఖం పూరించి
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాండీవం
భరతజాతిని ఏకంచేసి విజయం సాధించింది గాంధీజీ

పరిష్కార మార్గాలకై వినూత్నపంథాను ఎంచుకునే
పోరాటాలెన్నింటికో నాందీవాచకమై నిలిచినవాడు
ఆధునిక శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి గాంధీజీ

మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బ్రిటీష్ పాలకులను
ఆఖరిపోరాటంవరకు అలుపెరుగకుండా ఢీకొన్నడు
పోరాటస్ఫూర్తిని సడలనివ్వని దీక్షాదక్షుడు గాంధీజీ

స్వాతంత్ర్య పోరాటకాంక్షను పల్లపల్లెకు విస్తరింపజేసి
జాతిజనుల గుండెల్లో దేశభక్తిబీజాలను నాటినవాడు
తెల్లదొరల పాలన పీచమణిచి ఉరేసినవాడు గాంధీజీ

By Editor

One thought on “గాంధీ మొగ్గలు”

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *