రచన: స్వరాజ్య నాగరాజారావు

అమ్మపైనే ఎప్పుడూ కవితలు రాస్తూ ఉంటారు
మరేమీ పని లేదా మీకు? అంటూ …..వారు కామెంట్ పెట్టేరు.
మీకు అమ్మ లేదా? మీకు అమ్మ చేదా?
మీరు అమ్మ కాదా? అని అడగాలనే ఆలోచన అప్పుడు నాకుతట్టింది
అలా నేను అడగ్గానే …..
బదులివ్వలేని ఆమె నిస్సహాయత మౌనాన్ని దాల్చినట్టుంది,
బహుశా ఆమె మనసులోనే రెండు కన్నీటి చుక్కలను రాల్చినట్టుంది.
ఆలోచిస్తే ….అసలు అమ్మకంటే వేరేలోకం ఏముంది?
అమ్మను మరువటంకంటే వేరేశోకం ఏముంది?
ఎందుకంటే….అమ్మ తనకంటినీరుతో మన లాలపోసింది,
అమ్మ ఆనందభాష్పాలతో మనగొంతు తడిపింది,
తన చనుబాలతో మనప్రాణం నిలిపింది,
తన కంటిరెప్పలతో మనకు రక్షణనిచ్చింది,
తన ప్రేమ పలుకులతో శిక్షణనిచ్చింది,
తనసుఖాలను మనసౌకర్యాలకోసం త్యాగంచేసింది,
తనఆలోచనలను మన అభివృద్ధికోసం పదునుపెట్టింది.
మనంతప్ప రెండోలోకం ఎరుగని అమ్మకు,
శోకంతప్ప ఏమీఇవ్వలేని మనం,
కనీసం అమ్మని,ఆమె ప్రేమని
తరుచూ తలుచుకుంటూ ఉంటేనైనా,
కరువైనశాంతి కరుణిస్తుందేమో అని
మీకెప్పుడూ అనిపించలేదా?
ఒకవేళ అలా అనిపిస్తే అది తప్పుకాదేమో?
అమ్మని ఇలా పొగడుకోవటం గొప్ప కాదేమో?

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *