రచన:కుసుమ.ఉప్పలపాటి.

గజల్:

రాగసుధల రసికులనూ అలరించే రారాజు!
పాడటమే జీవంగా భావించే మహరాజు!

తెనుగు భాష మాధుర్యం ఔపోసన పట్టాడె!
పలుకు తల్లి వరమల్లే జనియించే రసరాజు!

స్తోత్రాలతొ దేవతలకు స్వరార్చనే చేసాడు!
సామవేద ఘనాపాటి తరియించే గానరాజు!

గుండెగొంతు భాషతోన దేశమంత వినిపించె!
వీనులున్న ప్రతివారిని మురిపించే రాగరాజు!

నవరసాలు నావేనని విర్రవీగు గంధర్వుడు!
సినిమాలకు కాసులనూ కురిపించే ధనరాజు!

నీలిమబ్బు, గాలితెరలు వినిపించుగ నీపాట!
సుస్థిరమై హృదయాలలొ జీవించే వలరాజు!

అశృతర్పణ వీడికోలు అందుకొనుము ఓబాలు!
పాటవున్న కాలమంత జీవించే యశరాజు!

By Editor

One thought on “వీడికోలు!”

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *