July 7, 2022

అంతా మన మంచికే – ప్రమదాక్షరి గొలుసు నవల వీడియో సమీక్ష

సమీక్ష- శ్రీసత్య గౌతమి ముప్ఫైనాలుగు మంది రచయిత్రులు కలిసి వ్రాసిన పెద్ద గొలుసు నవల “అంతా మన మంచికే”. ఈ నవల నేటి సామాజిక పోకడలకు అద్ధం పడుతోంది.ఈ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భౌతికంగానో లేదా మానసికంగానో అమెరికా గాన్ కన్ ఫ్యూజుడు దేశీ (ఎజిసిడి) ల (America Gone Confused Desi, AGCD) గోల. చిన్న చిన్న ఆర్ధిక సమస్యలతో పాటూ, ఇటు పూర్తిగా భారత వివాహపద్ధతులకూ తలవంచకా, అటూ పూర్తిగా […]

లోతైన ఆలోచనల కథలు … అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.

సమీక్ష: లక్ష్మీ రాధిక “ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు”.. చాలా చక్కని ముఖచిత్రంతో, చూడగానే చదవేందుకు ఉవ్విళ్ళూరించేట్టు చేసిందీ కథల పుస్తకం. వృత్తిరీత్యా శాస్త్రవేత్త అయ్యుండి కూడా చక్కని పుస్తకాలు పఠనం చేస్తూ, దానికి తగిన విశ్లేషణలు జోడించడమే కాక మంచి కథలు, కవిత్వాన్ని రాయడం ఇష్టపడతారు.. సత్య గౌతమిగారు. నిజ జీవితాన్ని ఎంతో దగ్గరగా చూసి రాసినట్టు ఒక్క కథ చదవగానే స్పష్టమైపోతుంది. ప్రతి కథా ఒకటికొకటి చాలా విభిన్నంగా ఉంటూ ఏకబిగిన చదివించేట్టు చేస్తాయి. అమెరికాలో ఉంటూ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 52

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో భయంకరమైన కలియుగము నందు మనకు సరియైన మార్గమును ఘనులు, గొప్పదైవము అయిన శ్రీ రామానుజాచార్యులవారు చూపించారు. ఆ త్రోవలో నడచి ముక్తిని పొందండి అంటున్నాడు అన్నమయ్య. కీర్తన: పల్లవి: గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి యీతఁడే చూపె ఘనగురుదైవము ॥పల్లవి॥ చ.1. యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి- మీతనివల్లనే కంటి మీతిరుమణి యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర- మీతఁడే రామానుజులు యిహపరదైవము ॥గతు॥ చ.2. వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు చలిమి […]

తపస్సు – సహచరి

రచన: రామా చంద్రమౌళి అకస్మాత్తుగా ఆమెను ‘ ఐ సి యూ ’ కు తీసుకు వెళ్ళారు ఆమెకు భర్తా, ఇద్దరు పిల్లలూ ఉన్నారు కాని వాళ్ళు చాలా బిజీ ఎక్కువరోజులు ఆమె వెంట వాళ్ళుండరు వాళ్ళు ఖండాంతరవాసులు .. వస్తూ పోతూంటారు అప్పుడప్పుడు కొందరంతే., అందరూ ఉండీ ఎవరూ లేనివారు అన్నీ ఉండీ ఏమీ లేనివారు బయటికి ‘ పూర్తిగా ’ ఉన్నట్టనిపిస్తూ లోపల పూర్తిగా డొల్లై జీవిస్తున్నవారు – ఆమె ఆ ఉదయమే వాకిట్లో […]

గాంధీ మొగ్గలు

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ క్విట్ ఇండియా ఉద్యమంతో జాతిని ఏకం చేసి ఆంగ్లేయపాలకుల గుండెల్లో దడపుట్టించినవాడు అలుపెరుగని పోరాటానికి అసలైన స్ఫూర్తి గాంధీజీ స్వాతంత్ర్యసమరంలో ఆయుధాలనేవి పట్టకుండానే అహింసాయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టినవాడు సామాన్యులలో అసామాన్యుడిగా జీవించింది గాంధీజీ సత్యాగ్రహ మహోద్యమంతోనే సమరశంఖం పూరించి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాండీవం భరతజాతిని ఏకంచేసి విజయం సాధించింది గాంధీజీ పరిష్కార మార్గాలకై వినూత్నపంథాను ఎంచుకునే పోరాటాలెన్నింటికో నాందీవాచకమై నిలిచినవాడు ఆధునిక శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి గాంధీజీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో […]

ఒకే గాథ…

గజల్ రచన: ఇరువింటి వెంకటేశ్వర శర్మ నీది, నాది, ఒకే గాథ ముగిసిపోదు ఏన్నటికీ చీకటి వెలుగుల పయనం విసిగిపోదు ఎన్నటికీ ఇరుమనసుల ప్రమాణాల శాసనమే పెళ్ళంటే తొలిచూపుల దృశ్యకవిత చెదిరిపోదు ఎన్నటికీ సతిపతులే అక్షయమౌ అనుపమాన ప్రేమజంట వలపునెంత పంచుకున్న అలసిపోదు ఎన్నటికీ ఒడిదుడుకుల అలలమీద గమనమేగ సంసారం ఎదురీదక మునుముందుకు సాగిపోదు ఎన్నటికీ ఇల్లూ,ఇల్లాలు,సుతులు అందమైన బంధాలూ ముడులువడిన సూత్రమిదీ వీడిపోదు ఎన్నటికీ

వీడికోలు!

రచన:కుసుమ.ఉప్పలపాటి. గజల్: రాగసుధల రసికులనూ అలరించే రారాజు! పాడటమే జీవంగా భావించే మహరాజు! తెనుగు భాష మాధుర్యం ఔపోసన పట్టాడె! పలుకు తల్లి వరమల్లే జనియించే రసరాజు! స్తోత్రాలతొ దేవతలకు స్వరార్చనే చేసాడు! సామవేద ఘనాపాటి తరియించే గానరాజు! గుండెగొంతు భాషతోన దేశమంత వినిపించె! వీనులున్న ప్రతివారిని మురిపించే రాగరాజు! నవరసాలు నావేనని విర్రవీగు గంధర్వుడు! సినిమాలకు కాసులనూ కురిపించే ధనరాజు! నీలిమబ్బు, గాలితెరలు వినిపించుగ నీపాట! సుస్థిరమై హృదయాలలొ జీవించే వలరాజు! అశృతర్పణ వీడికోలు అందుకొనుము […]

ఉదయ కిరణాలు…

రచన: రమా జగన్నాధ్ భానుడు ముచ్చట తో మూసి మూసి గా మూలల నుండి చిగురు కొమ్మలను ఛేదించుకుంటూ రాతి గోడలను ఎదురుకుంటూ రావాల ? వద్ద అనుకుని రాయసంగా చూసినా తప్పలేక తళుకుల మెరపూలతో రాకలు ! మొదటి కిరణ కాంతి నా కనుబొమ్మలు పై తాకే వేళలో నా శయన వాహనం పై నిద్రావస్తా నుండి మెలుకువ తో మొదలు ! నా నాసిక రంధ్రాలకి ఘుమ ఘుమ లాడే ఘాటైన తేనీటి తేటలో […]