April 19, 2024

మాలిక పత్రిక నవంబర్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రికను ఆదరిస్తున్న రచయితలు, పాఠక మిత్రులకు ముంధుగా హృదయపూర్వక ధన్యవాదాలు .. దీపాల పండగ దీపావళి శుభాకాంక్షలు…. మాలిక పత్రిక ఎల్లప్పుడూ కొత్త రచయితలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది అని మీకు తెలిసిందే. ప్రతీ నెల కొత్త రచయితలు తమ కథలు, కవితలు పంపిస్తున్నారు. చాలా సంతోషం. మీ రచనలు ప్రతీ నెల 15 తారీఖు వరకు మాకు పంపించాలి. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com […]

రాజీపడిన బంధం – 8

రచన: ఉమాభారతి “చెప్పానుగా, సందీప్ ని చూసుకోడానికే నాకు సమయం చాలదు. వారానికో మారు ఇక్కడ స్థానిక పశు సంరక్షణ సంస్థ పని కూడా చూస్తాను. మొత్తానికి అలిసిపోయాను. అదీగాక, మా ఆయనతో నాకు పెద్దగా సఖ్యత కూడా లేదులే. నేనిప్పుడున్న పరిస్థితిలో మరో బిడ్డ అంటే, నాకు ఆసక్తిగా లేదు. అంతకంటే విషయమేమీ లేదు” అన్నాను. చిత్రకి సమాధానం సంతృప్తికరంగానే ఇచ్చాననిపించింది. “బిడ్డని వద్దనుకున్నంత మాత్రాన నీ చింతలు, బాధ్యతలు పోవు. పైగా ఆ బిడ్డే […]

చంద్రోదయం – 9

రచన: మన్నెం శారద చేతి గడియారంలోకి చూసేడు. అయిదున్నరవుతోంది. తూర్పు తెల్లబడుతోంది. పక్షులు రొదచేస్తూ గూళ్లు వదలి వినీలాకాశంలోకి ఎగురుతున్నాయి. తెల్లవార్లూ అంతులేని ఆలోచనలతో, గతంలోని జ్ఞాపకాలతో నిద్ర కరువైంది. ఏదో నీరసం! కళ్ళలో అలసట! కళ్లు మూతలు పడుతున్నాయి. చలగాలికి కాస్త శరీరం వొణుకుతోంది. అయినా అతను లేవలేదు. గుమ్మంలో స్వాతి నిలబడి వుండటాన్ని అతను గమనించాడు. కానీ చూడనట్టుగా ఊరుకున్నాడు. “మమ్మీ” నానీ పిలుస్తున్నాడు స్వాతిని. “ఊ” మాటలు సారధికి వినబడుతున్నాయి. “అంకుల్ నిద్రపోతున్నారా”? […]

కంభంపాటి కథలు – ప్రయాణం

రచన: కంభంపాటి రవీంద్ర భ్రమరకి ఒకటే భయంగా ఉంది .. ఊరంతా కరోనా అట .. ఊరంతా ఏమిటీ ..రాష్టం , దేశం ప్రపంచం .. అంతా కరోనా ! తనుండే కాకినాడలో అయితే జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు … బయటకి వెళ్ళాలన్నా .. ఇంట్లోకి ఎవరినన్నా రానివ్వాలన్నా చాలా భయంగా ఉంది ! పని పిల్లని, పేపర్ వాడిని మానిపించేసింది.. అపార్ట్మెంట్ లో ఇరుగు, పొరుగు ఎవరి తలుపులు వారు మూసుక్కూచున్నారు.. మనిషన్న వాడి మొహాన […]

భవ( బాల) సాగరాలు

రచన: గిరిజారాణి కలవల ” సుధీర్! బబ్లూ ఇంకా ఇంటికి రాలేదు! స్కూల్ వదిలి చాలా సేపయింది. వచ్చి ఫ్రెష్ అయి ఐఐటి కోచింగ్ క్లాస్ కి వెళ్ళాలి. టైమయిపోతోంది” అంటూ నీలిమ కంగారుగా భర్త కి ఫోన్ చేసింది. ఆఫీసులో తలమునకలయే పనిలో కూరుకునిపోయి ఉన్న సుధీర్ కి, నీలిమ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో చిర్రెత్తిపోయాడు. అసలే , తను చేసిన ఫైల్ లో తప్పులు తడకలు ఉన్నాయని, సాయంత్రం ఎంత […]

ఎగిసే కెరటం నవలపై పత్ర సమర్పణ

వంగూరి ఫౌండేషన్, అమెరికా మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం, తిరుపతి వారు నిర్వహించిన “21వ శతాబ్దపు స్త్రీల నవలలు” పై అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనానికి ఎంపికయిన మాలిక రచన “ఎగిసే కెరటం” . స్వీయరచన పై పత్ర సమర్పణ_ శ్రీసత్య గౌతమి ప్రస్తుత సంఘమునందలి ఆచార వ్యవహారాలను గమనిస్తూ, అందలి లోటుపాట్లను సవరిస్తూ, సంస్కరణ పూర్వకమైన చక్కని భవిష్యత్తును చూపాలనే ఉద్దేశ్యంతో నేను చేసిన ప్రయత్నం ఈ నవలారచన ‘ఎగిసేకెరటం’. ఈ ఎగిసేకెరటం నవలలోని […]

తామసి – 2

రచన: మాలతి దేచిరాజు లైబ్రరీ లో తనకి కావాల్సిన పుస్తకం కోసం వెతుకుతున్నాడు గాంధి.ఎంతకీ అది దొరకటం లేదు.దాదాపు లైబ్రరీ అంతా వెతికాడు.విసుగొచ్చి వెనుతిరిగాడు.చాలా రోజులైంది పేపర్ పై పెన్ను పెట్టి కొత్త నవల రాద్దామంటే ఏమీ ఇన్స్పిరేషన్ రావడం లేదు.పోనీ ఏవైనా పుస్తకాలు చదివితే అందులో ఏదో ఒక పాత్రని పట్టుకుని కథ అల్లుకోవచ్చు అన్నది అతని ఉద్దేశం.అలా రాసిన నవలలు కూడా ఉన్నాయి. అవి డబ్బైతే తెచ్చి పెడతాయి గాని అతనికి సంతృప్తిని ఇవ్వవు.అతనికి […]

అమ్మమ్మ – 19

రచన: గిరిజ పీసపాటి అమ్మమ్మ, డా పురుషోత్తంగారు మాట్లాడుకుంటూ ఉండగానే కారు పురుషోత్తం గారి ఇంటికి చేరింది. ఆయన నేరుగా ఇంట్లోకి వెళిపోయినా, అమ్మమ్మ మాత్రం బయట కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని ఒకసారి లలితా పరమేశ్వకి మనసులోనే నమస్కరించుకుని, లోపలికి అడుగు పెట్టింది. రాజేశ్వరమ్మ గారు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించి, కాఫీ తెమ్మని వంట మనిషికి పురమాయించారు. కానీ అమ్మమ్మ ఆవిడను వారించి, స్నానం, జపం పూర్తి కానిదే తాగనని చెప్పి నేరుగా పెరట్లోకి […]

మనసుకు ఉద్దీపనగా నిలిచిన రచనా చికిత్స

సమీక్ష: సి. ఉమాదేవి డా. లక్ష్మీ రాఘవగారు మన సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు తన కథలద్వారా పరిష్కారమందించే ప్రయత్నం చేయడం ముదావహం. జీవితం వడ్డించిన విస్తరికాదు. ఎన్నో సమస్యలు మిళితమై మనసును పట్టి కుదుపుతాయి. కాని వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే మనిషి తన ఉనికిని స్థిరంగా నిలుపుకో గలుగుతాడు. ఈ నేపథ్యంలో రచయిత్రి మనకందించిన కథలు మనలో ఆలోచనాబీజానికి మొగ్గ తొడుగుతాయి. ఇక మనం కథాబాటలోకి అడుగిడదాం. పుస్తకానికి శీర్షికగా నిలిచిన కథ మనసుకు చికిత్స. […]

విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

రచన: కర్రా నాగలక్ష్మి మలేషియ, ఈ మధ్య కాలంలో బలమైన ఆర్ధిక దేశంగా రూపుదిద్దుకుంటున్న దేశం, మంచి పర్యాటక దేశంగా కూడా రూపు దిద్దు కుంటోంది. మలేషియ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది. అయినా ఇక్కడ హిందూ బౌద్ద మతాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చేరు. పదమూడు రాష్టాలు, దక్షిణ చైనా సముద్రం వల్ల రెండు ద్వీపాలుగా విభజింపబడ్డ ఈ దేశం లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. ఈ సంచిక నుంచి మీకు మలేషియాలోని ప్రదేశాలను, ఒకటొకటిగా […]