April 25, 2024

కరోనాలో మంచి

రచన: కళ్యాణి కోడూరు

ఏమండీ మన ఫ్లోర్లో 108  పార్వతి గారికి కరోనా వచ్చిందట… చాలా ఆదుర్దాగా అరుస్తూ ఆయాసపడుతూ వచ్చింది శ్రీలక్ష్మి. ఎందుకు అంత ఖంగారు నీకు అంటూ కళ్ళు నులుము కుంటూలేచి వచ్చాడు సత్యానందం. నెమ్మదిగా ముఖం కడుక్కుని వచ్చి శ్రీలక్ష్మి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ ..ఊ..ఇప్పుడు చెప్పు..108 లో వుంటున్న పార్వతి గారికి కరోనా వచ్చిందని తెలిసిందా? మరిఇప్పుడు ఎలా వుంది ఆవిడకు ?ప్రశ్న పూర్తి కాకుండానే…ఆ..ఏముంది..చెప్పడానికీ..ఆవిడఇక్కడ..ఆయన మద్రాసులో,పిల్లలు ఇద్దరూ బయట విదేశాలలో. పెద్దపిల్ల స్కాట్లాండ్, చిన్నపిల్లఅమెరికాట. ఆయనకు కబురు చేసారట. మరి రావటానికి…కరోనా రోజులాయె..బార్డర్లు దాటుకొనరావటం తేలిక కాదు కదా…అంది. అయ్యో అలాగా…మరి ఒకసారి ఆవిడను పలకరించి ఏమైనకావాలేమో కనుక్కోపోయావా లక్ష్మీ..అన్నాడు సత్యానందం.

ఒక్కసారి ప్రక్కలో బాంబు పేలినట్లు ఉలిక్కి పడింది శ్రీలక్ష్మి. నాతో అంటే అన్నారు కానీ ఇంకెవరితోఅనకండి బాబు కరోనా వచ్చిన వాళ్ళ దగ్గిరిక వెళ్ళమని..అంటూ విస విసా అక్కడనుంచ లేచి వెళ్లింది .

అరే..ఈ మనిషికి ఎలా అవగాహన కలిగించాలను కుంటూ ఆలోచనలో పడ్డాడు సత్యానందం. తమ పిల్లలు కూడా దూరంగాన వున్నారు మరి..ఇదే పరిస్తితి తమకు ఎదురైతేనో…పిల్లలు వచ్చే అవకాశాలు తక్కువ.

టివి చూద్దామని అనుకున్నా..మనసు ఒప్పక..మేల్లిగా లేచి ..బల్ల మీద పెట్టిన డబ్బా నుంచి ఒక మాస్కుతీసుకుని మొహానికి తగిలించుకొని, చేతికి సానిటైజర్ రాసుకొని తలుపు దగ్గరగా వేసి108 వైపుఅడుగులు వేసాడు. అప్పుడే మెట్లు దిగుతున్న 508 లో వుండే లోకనాథం ఏమండి..అటు వెళ్లకండి108 లో ఆవిడకు కరోనా…అన్నాడు. అవునటండీ..పాపం ఆవిడ ఒక్కరే వున్నారటగదా..ఏమైనసహయంకావాలేమోఅడుగుదామనుకున్నానండీ…ఆ మాట వినగానే ఆయన నాకు అర్జంటు పనివుందండీ అంటూ గబగబా మెట్లు దిగి పరుగెత్తాడు…

ఏమైనా ఆవిడ పరిస్తితి ఏమిటి కనుక్కోవాలి అని మనసులో అనుకుంటూ ఆవిడ ఇంటి కాలింగ్బెల్కొట్టాడు.

కాసేపటికి మూలుగుతూ మనిషి వస్తున్న చప్పుడైంది. కటికీ లోంచి తొంగి చూసింది ఆవిడ…ఎవరుఅంటూ నీరసంగా..నేను ఈ ఫ్లోర్ లోనే 101 లో వుంటానండీ. నా పేరు సత్యనాధం. మీకు ఒంట్లోబాగలేదనీ, ఒంటరిగా వున్నారనీ తెలిసింది…మీకేమయినా సహాయంకావాలా..అని అడిగాడు. ఇద్దరూమొహానికి మాస్కు వేసుకున్నారేమో..మాటలు సరిగ్గా వినపడినట్లు లేదు. సరే మళ్లీ బిగ్గరగామీకేమయినా కావాలా అని అడిగాడు.  పరవాలేదండీ జ్వరం తక్కువగానే వుంది..మీకు వీలయితే  ఒకఆక్సిమీటరు పంపగలరా అని అడిగింది. అలాగే తప్పకుండా, మీకు ఏఅవసరం వున్నా మాకుచెప్పండి..పంపిస్తాము. భయపడకండి. మందులు వేసుకోండి , ఫోన్ చెయ్యండి అని చెప్పి, చిన్నగాఅపార్టుమెంట్ ప్రెసిడెంట్ గారి దగ్గరకువెళ్ళాడు. ఆయనకు ఆవిడ పరిస్తితివివరించి ఆవిడ భర్తవచ్చేవరకూ ఆవిడకుకావలసినవన్నీ అందేలా చూద్దామనీ, రోజుకు రెండు మూడు సార్లు ప్రతిఒక్కళ్ళూఫోన్ చేసి ధైర్యం చెప్పవలసిన అవసరంవుందనీ…అలాగే మొత్తం బిల్డింగ్ అంతా సానిటైజ్చేయంచాలనీ..అందుకు కావలసిన ఏర్పాట్లు చేయటానిక కి ఆయనకు తోడుగావుండి పూర్తి చేసేసరికి

మధ్యాహ్నం అయిపోయింది. మెల్లగా యింట్లోక అడుగు పెట్టేసరికి కాఫీ తెచ్చేలోపు ఎక్కడికిమాయమయ్యారూ? అంటూ ఎదురు వచ్చింది శ్రీ లక్ష్మి…ఇప్పుడు కాఫీ వద్దులే ఏకంగా భోజనం చేస్తానుఅంటూ స్నానానికి వెళ్ళాడు.

స్నానంచేసి వచ్చేసరికి వేడిగా భోజనం వడ్డించింది. మంచి గుత్తివంకాయ కూర మజ్జిగ పులుసు  చాలాబాగున్నాయి అని మెచ్చుకుంటూ తృప్తి గా తింటుడంగా మెల్లిగ గోముగా అడిగింది శ్రీలక్ష్మి..ఏమండీ ఈదసరాలలో అమ్మవారి పేరు చెప్పుకుని ఎర్ర అంచు ఆకుపచ్చచీర కట్టుకుంటే మంచిదని మన పై ఫ్లోర్లోవుండే మీనాక్షమ్మగారు చెప్పిందండీ..నేను కొనుక్కోనా? కొద్దిగ పొలమారింది సత్యనాధానికి.

లాక్డవునులో బయటకు వెళ్ళే పని లేదు. ఈ ప్రాణాంతకపు రోజుల్లో ఈ మూఢనమ్మకాలొకటి. అవి ఎవరిమట్టుకు వాళ్ళు వాళ్ళకే పరిమితం చేసుకోకుండా ప్రచార మొకటి…మనసులోనే విసుగు పడ్డాడు. స్వతహాగ శ్రీలక్ష్మిది మంచిమనసే…పల్లెటూరులో అమ్ముమ్మ దగ్గర పెరిగింది. కొంచెం తనమాటనెగ్గాలన్నపట్టుదల , కొంచెం తొందరపాటును…మళ్లీ ఓపికగా నచ్చచెబుతే అర్ధం చేసుకుంటుంది. చెబుదాంచెప్పాలి అని మనసులో అనుకుని ..పైకి సరే చూద్దాంలే ఇంకా టైమువుందిగా అన్నాడు.

రుచిగా వున్నాయన కొంచెం ఎక్కువే తిన్నట్లున్నాడు..భుక్తాయాసంగా మత్తుగా నిద్రవచ్చింది..లాక్డవునులో ఇదొ కొత్త అలవాటు అవుతున్నది..మళ్లీ ఆఫీసులు తెరిచాక కష్టం. రేపటినుంచీజాగ్రత్తగా వుండాలి అనుకుంటూనే నిద్రపోయాడు. లేచేసరికి సాయంత్రం కావస్తుంది..తన పిల్లలూదూరంగా అమెరికాలోని వున్నారు. వాళ్ళూ లాకడౌన్ లోనే యింటినుంచి పనులు చేసుకుంటున్నారు. ఎలావున్నారో…వాళ్ళకు పగలు మనకు రాత్రి ..వాళ్ళు మళ్లీ పనులు ప్రారంభించేలోపు ఒకసారిపలుకరిస్తూ వుంటారు…ఈ మధ్య అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసి పది రోజుల పైనే అయింది. పిల్లలతోఇంటినుంచి పని అంటే ఇంకా కష్టం, పాపం అందరూ అవస్థలు పడుతున్నారు.శ్రీలక్ష్మీ పిల్లలేమయినాఫోన్ చేసారా..నాకు నిద్ర పట్టేసింది అంటూ బయటకు వచ్చాడు…శ్రీలక్ష్మి ఒక్కసారిగ బావురుమంది.

చాలా కంగారు పడ్డాడు సత్యానందం..ఏమయింది..ఏడవక..ఏమయిందో చెప్పు ముందు అన్నాడుభయం భయంగా…వెక్కుతూ వెక్కుతూ మన అమ్మాయికి పెద్ద ఆపద తప్పిందండీ..అయ్యో …ఎందుకోపది రోజులనుంచీ తన దగ్గర్నుంచ ఫోన్ రాలేదనుకున్నాను..ఎలా వున్నారు..ఏమందిట అని అడిగాడునీరసంగా..

ఇరవై ోరోజుల క్రితమ పని మీద బయటకు వెళ్ళారట. తరువాత ఏడెనిమిది రోజులకు అల్లుడు గారికిబాగా జలుబు కొద్దిగ జ్వరం మొదలయిందట. ఎందుకైన మంచిదని తను వేరే గదిలో తలుపు వేసుకోనిబాగా దూరంగా నే వన్నారుట. కానీ ఐదు రోజుల తరువాత జ్వరంతో పాటు ఆక్సిజను తగ్గి శ్వాసతీసుకోవడమ కష్టంగా అని పించి స్నేహితులకు ఫోన్ చేసారట. స్నేహితులు వెంటనే ఆసుపత్రికి ఫోన్చేసి అంబులెన్స్ పలిపించి ఈయనను ఆసుపత్రికి పంపారుట. అంతేకాదు అమ్మాయి పిల్లలు దేనికిఇబ్బంది పడకుండా , భయపడకుండా తోడుగ వుండి ..చూసుకున్నారుట. వాళ్ళు అలా తోడుగ వుండకపోతుంటే పిల్ల ఒకర్తి ఎంత బాధ పడివుండేది, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం మనం..భగవంతుడువాళ్ళను చల్లగా చూడాలని ప్రార్ధిస్తాను..అంది ఎంతో కదిలిపోతూ…

చేసావా మరి..వాళ్ళు మా కెందుకు అని తలుపు వేసుకుంటే పిల్ల ఎంత కష్ట పడేదో ఆలోచించు..

ఎప్పుడైన ఎక్కడైన ఒకరికొకరం తోడుగ సహాయపడడం చాలా అవసరం. ప్రత్యేకంగా ఇలాంటివిపత్తులు వచ్చినపుడు. నువ్వు ఏ చీర కట్టుకుని ఎంత పూజ చేసావని కాదు కాదు భగవంతుడుచూసేది…సాటిమనిషి పట్ల నీ ప్రవర్తన ఎలావుందనేదే ముఖ్యం. మానవుడు సంఘజీవి..నలుగురుతోకలసి మెలసి…నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవాలి…అందుకుఒకరికొకరు తోడుగ వుండాలి.

ఎప్పుడు భగవంతుడు తానే స్వయంగా నాలుగు చేతులు కిరీటాలతో కాలండర్ బొమ్మలాగా రాడుసహాయం చెయ్యడానికి..ఎవరినో పంపుతాడు..మార్గం చూపిస్తాడు.. అర్ధం అయిందాశ్రీలక్ష్మీమేడం…వెళ్ళు ముందు మొఖం కడుక్కుని..నాకు కాస్త కాఫీ ఇవ్వు.

శ్రీలక్ష్మి కూడా మొహమాటంగా నవ్వుతేచ్చుకుని అర్ధం అయింది మాష్టారు..ఇంకేమీ వివరంగాచెప్పక్కరలేదు. మీకు కాఫీ ఇచ్చి , త్వరగా వంటచేసి వేడి చారు అన్నం ఆ పార్వతమ్మగారికి ఇచ్చివస్తానుఅంది హుషారుగా. సరే సరే..అన్నింటికీ మరీ ఆవేశ పడకు. తప్పకుండ ఇచ్చిరా..కానీ జాగ్రత్తలుమర్చిపోక. మాస్కు కట్టుకో. సానటైజర్ తీసుకో..ఆవిడ ఇంటి బెల్ కొట్టు. ముందుగా ఫోన్ చేసి చెప్పు. తలుపు బయట పెట్టి దూరంగా నిలబడు. ఆవిడ తీసుకున్నాక ను వ్వు వచ్చేయమని జాగ్రత్తలుచెప్పాడు సత్యనందం.

అమ్మయ్య..శ్రీలక్ష్మికి కనువిప్పు కలిగింది…ముచ్చటగా చీర అడిగిందిగా కొందామని అనుకున్నాడు. సరేతనపనులు చేసుకుని వచ్చే లోపు ఆన్ లైను షాపుల్లో చూద్దామని కంప్యూటర్ తెరిచాడు. ఇంతలో కాఫీతీసుకుని వచ్చింది శ్రీలక్ష్మి. ఏమిటి చేస్తున్నారు  అంటూ..అదే నువ్వు చీర అన్నానురా చూస్తున్నాఅన్నాడు. వద్దండీ.ఆ డబ్బు మన రెండో ఫ్లోర్ లో వున్న శేఖర్ పనులు లేక వసతి లేక కాలినడకనవూర్లు వెళుతున్న కూలీ జనాలకు భోజనం, కాళ్లకు చెప్పులు..ఇంకా అవసరమైన సామానులు వాళ్ళస్నేహితులతో కలసి ఏర్పాటు చేస్తున్నాడట. అతనికి ఇవ్వండి ఆ డబ్బేదో..

సత్యానందం మనసులో అనుకున్నాడు…కరోనా …నీవు మాకు మా హద్దులుచూపించడమేకాదు…మానవత్వాన్ని నిద్ర లేపుతున్నావు. మనుష్యులమధ్య సహకారం , సయోధ్యఅవసరమని నిరూపించావు…తప్పులు చేసాము చాలా…ఇంక దయచేసి నిష్క్రమించు అనిమనసులోనే ప్రార్ధించాడు.

 

 

1 thought on “కరోనాలో మంచి

  1. ఎవరకైనా తనదాకా వస్తేకాని మానవత్వం
    మేలుకోదని ఈ కధ ఋజువు చేసింది. మంచి సృజనాత్మకతతోకూడినకధ. మంచి సమాచారం (మెసేజి) ప్రజలకు తెలియచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *