రచన: గోటేటి కాశీ విశ్వేశ్వరరావు

 

“ఏమిటీ ! డాక్టర్ గారూ మీరు చెబుతున్నది వింటే ఆశ్చర్యంగా ఉందే ” అంటూ గెడ్డం మీద చెయ్యేసుకుంది తాయారు.

” ఈ మూర్చ రోగిని (కోడలు శ్రీలేఖ ను) చూపిస్తూ మాకు అంటగట్టి వాళ్ళ చేతులు దులుపుకొన్నారు అంటూ వియ్యాల వారిని దుయ్యబడుతుంటే

“ఉష్ ! ఇది ICU ఇక్కడ గట్టిగా మాట్లాడకండి రోగి ఉంది నిశ్శబ్దం పాటించాలి”

“నాకు ఇప్పటికీ నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు”

“ఈ ! రోగిష్టిది , గొడ్రాలు నిష్టూరంగా ఇంకా ఏదో అనబోతుండగా. . . ”

“ముందు బయటకు నడవండి” అంటూ తనూ తన కన్సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. వెనుకనే అతనిని అనుసరిస్తూ తాయారూ వెళ్ళింది.

“మీరు మీ కోడలు శ్రీలేఖను రోజూ ఇలాగే నానా మాటలతో వేధిస్తారా?

“అబ్బే లేదండీ” అది మా ఇంటి మహాలక్ష్మి. .  మావాడికి సరియైన జోడి అనే పెళ్ళి జరిపించాము”

“మీరు పెళ్ళి నిశ్చితార్థానికి ముందు అటు ఏడు తరాలు విచారించు కోవాలి తెలుసుకదా ? నేను మీ కుటుంబ డాక్టరును కనుక చనువు వలన అడుగుతున్నాను”

“అయ్యెరామా ! పెళ్ళికి ముందు బాగానే ఉంది . అయ్యాకనే ఈ మూర్చల రోగం దాపురించింది”

“మీరు ఎంతసేపూ మీ కోడలు ను ఆడిపోస్తారు కానీ. . . లోపం ఎవరిదో ఎప్పుడైనా విచారించారా”

“శ్రీలేఖ కి ఈ హిస్టీరియా రావడానికి కారణం . . . మీరే . . . మీరే”

“డాక్టర్ మాటకి నిర్ఘాంతపోయి . . నేనా. . .  కారణం?

“అవును ముమ్మాటికీ మీరూ,  మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళూ పదేపదే గొడ్రాలూ గొడ్రాలూ అంటూంటే ఆమె మనస్సు గాయపడి అది “హిస్టీరియాగా”మారి మానసిక వేదనతో మూర్చ రోగిగా మారింది”

“ఆరు నెలల క్రితం మీ అబ్బాయి, కోడలూ నా దెగ్గరకు వచ్చి పిల్లలు పుట్టక పోవడానికి కారణం ఎవరిలో లోపం ఉందో తెలుసుకోవాలని టెస్టులకు చేయించు కొన్నారు. . . చెప్పడం ఆపడంతో”

“నాకు తెలుసునండీ !ఈ దేబ్యం మొహం దానిలోనే లోపం ఉందనుకొంటా ?”

“నేనింకా చెప్పాల్సింది పూర్తి చేయలేదు ఇంతలోనే మీరు నిర్ధారణకు రావడంతనే మీరు మీ కోడలును ఎంత మానసికంగా వేధిస్తున్నారో తేటతెల్లం మవుతోంది”

“మీ కోడలు సంస్కారవంతురాలు,  గుణవంతురాలు కనుక మీ పై  గృహహింస కేసు పెట్టలేదు. తను మానసికంగా కృంగి పోతూ ఇలా అనారోగ్యం పాలైంది”

“డాక్టర్ గారూ నా వలన ఇంత అనర్ధం జరిగిందా! నేను పాపిష్టురాలను , ఇంత అయినా నా కోడలు ఎప్పుడూ పల్లెత్తు మాటా అనలేదు”

“డాక్టర్ తాను చెప్పవలసినది కొనసాగిస్తూ. టెస్టుల్లో ఎవరిలో లోపం ముందో తెలుసునా . . . మీ అబ్బాయి లోనే, ఈ విషయం తెలిసిన మీ కోడలు నన్ను కోరింది ఒకటే ‘విషయం వింటే’మీరు కృంగిపోతారు అని చెప్పి చెప్పవద్దని ఒట్టేయించుకొంది”

“లోపం తన భర్తలో ఉన్నా. . . నెపం తన మీద వేసుకొంది. దాని ఫలితంగా మీ దృష్టిలో ఆమె గొడ్రాలుగా మిగిలిపోయి , మీ మాటలతో గాయపడి,  మానసిక వేదనతో హిస్టీరియా తెచ్చుకొంది”

“టెస్టుల తర్వాత నా ట్రీట్మెంట్ తీసుకోవడం వలన మీ కోడలు గర్భం దాల్చింది. ”

“ఏదీ !ఆ మాట మరొక్కసారి చెప్పండి. ఎంత సంతోషంగా ఉందో.  అయితే నా నట్టింట త్వరలో పసిపాప పారాడుతుందన్న మాట. . . ఈ విషయం బాగానే ఉంది. . కానీ దీనికి ఈ మూర్చ రోగం నయమవుతుందా అని సంశయంగా ఉంది”అంది తాయారు.

“ఇప్పుడు ఆ భయం ఏంలేదు. . . తన కడుపు పండిన విషయం తెలవగానే ‘హిస్టీరియా”తగ్గి మామూలు మనిషిగా మారుతుంది దానికి నేను గ్యారంటీ. ”

“డాక్టర్ గారూ మీ నోట్లో చెక్కర పోయ్యా. . . అంటూ లేచి మా కోడలు బంగారం నేనే దానిని అనవసరంగా ఆడిపోస్తూ సమస్యకు కారణమయ్యా.  ఇక నుండి ఇలాంటి తప్పు పొరపాటున కూడా చేయను అంటూ లెంపలేసుకొని నేను మా కోడల్ని చూడవచ్చా?”  అంటోంది.

ఇంతలో నర్సు వచ్చి “సార్.  తొమ్మిదో రూములో ఉన్న ఉన్న పేషెంట్ కి స్ప్రుహ వచ్చిందని”చెప్పింది.

నర్సు మాటలు విన్న వాళ్ళిద్దరూ గబగబా రూమ్ లోకెళ్ళారు.

డాక్టర్.  పేషెంట్ ను పరీక్షించి.  “ఏమ్మా ఎలా ఉంది”.

ఇంతలో శ్రీకర్ రావడం , “ఎలావున్నావు లేఖా “అంటూ ప్రేమగా పలకరించాడు.

“చూడండి లేఖా. . శ్రీకర్ లూ మీ ప్రయత్నాలు ఫలించాయి, ఇంకో ఆరునెలల్లో మీ ఇంటిలో పసివాళ్ళ కేరింతలు రాబోతున్నాయి”

నీరసంగా ఉన్న లేఖా, శ్రీకర్, తాయారమ్మ లో మొహాల్లో ఆనందం వెల్లు విరిసింది.

 

సమాప్తం.

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *