April 25, 2024

గజల్

రచన: సంధ్య ch

అభిలాషను అందుకునే కవితేమో దొరకలేదు

ఎద బాసను పంచుకునే చెలిమేమో మనకు లేదు

రాలుతున్న ఆశచినుకు కురిసి కురిసి వరదాయెను

నావలేక ఈదలేక కనుకేమో కునుకు లేదు

రాదారులు నీ దారని జ్ఞాపకాల్ని చూపుతుంటె

మౌనంలో మునిగినట్టి మదికేమో పలుకు లేదు

మెరిసె వెండి కాంతులన్ని మబ్బులకే పంచెనేమొ

చందమామ సగం మిగిలి రేయేమో వెలుగలేదు

పిల్లగాలి మెల్లగాను అల్లుకున్న తీగలలో

తెల్లనైన మల్లె లేక అలకేమో చెరగలేదు

ఎంత కఠిన మనసో అది ఎందుకనో మారనిదీ

కాంక్ష తీరు దారిలేక బ్రతుకేమో మెరవలేదు

వాలుతున్న “సంధ్య”లలో మందారం పడమరలో

విరాజిల్లె నీవులేక దివికేమో శోభ లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *