April 26, 2024

నేర్పరి

రచన: జి.వి.ఎల్ నరసింహం   సుందరమ్మ ఉండేది, అక్కయ్యపాలెం. ఆవిడ భర్త రాజేశ్వరరావు, తాసీల్దారు చేస్తుండేవాడు. నడి వయసులో ఏక్సిడెంటులో పోయేడు. వారి ఏకైక సంతానం, రఘురాం. సుందరమ్మకు ఓ చెల్లెలు ఉంది. పేరు జానకి. భర్త మోహనరావుతో, ఆమె సీతమ్మపేటలో ఉంటుంది. సంతానం కలుగలేదు. అక్కచెల్లెళ్ళిద్దరకు, ఒకరిపై ఒకరికి వల్లమాలిన అభిమానం. జానకి, రఘురాముని స్వంత కొడుకులా ప్రేమిస్తుంది. రఘురాం కూడా పిన్నిని స్వంత తల్లిలాగే గౌరవిస్తాడు. సుందరమ్మ అన్న అర్జునరావు, లాయరు. గాజువాకలో ఉంటాడు. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 53

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తన అధ్యాత్మికమైన మేలుకొలుపు కీర్తన అయినప్పటికి అన్నమయ్య శృంగార రసాన్ని కూడా మేళవించి రచించిన అందమైన హరిమేలుకొలుపు. కీర్తన: పల్లవి: మేదిని జీవులఁ గావ మేలుకోవయ్యా నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥పల్లవి॥ చ.1 తగుగోపికల కన్నుఁదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥మేదిని॥ చ.2 ఘనదురితపు నల్లఁగలువలు వికసించె మినుకు శశివర్ణుఁడ మేలుకోవయ్యా పనివడి వేదాలనే […]

రామేశ్వర ఆలయం

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు . పరమేశ్వరునికి ఉన్న 12 జ్యోతిర్లింగాలలో దక్షిణాదిన ఉన్న రామేశ్వరము లోని ఆలయము ఒకటి ఈ దేవాలయము రామేశ్వర ద్వీపములో ఉంది ఇక్కడి ప్రధాన దేవాలయము రామనాధ స్వామి ఆలయము ఈ దేవాలయాన్ని నిత్యము వేలాది మంది భక్తులు దాని పవిత్రత మరియు నిర్మాణ సౌందర్యం కోసం దర్శించుకుంటారు ఈ ఆలయం మూడు ముఖ్యమైన భారతీయ మత విభాగాలలో పవిత్ర తీర్థయాత్రగా పరిగణించబడుతుంది.ఆ మత విభాగాలు శైవ మతం (శివుడిని ఆరాధించేవారు) […]

నాడు-నేడు

రచన: సాహితి నేడు నటన ఒక అవసరం లౌక్యం ఒక అందం స్వార్ధం ఒక కళ వంచన ఒక వల నాడు మాట ఒక ధర్మం నిజం ఒక న్యాయం నిజాయతీ ఒక గౌరవం మనిషి ఒక వరం నేడు చదువు ఒక సుఖం డబ్బు ఒక లక్ష్యం మనిషి ఒక వస్తువు మనసు ఒక బొమ్మ నాడు విద్య ఒక విలువ సొమ్ము ఒక కష్టం మనిషి ఒక భంధం మనసు ఒక ప్రాణం * […]

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !

రచన. పోలయ్య శ్రీరస్తు ! శుభమస్తు ! సుఖశాంతులు ప్రాప్తిరస్తు ! అని సిరిసంపదలను భోగభాగ్యాలను సుఖసంతోషాలను శాంతిసౌభాగ్యాలను అష్టైశ్వర్యాలనొసగేటి కోరిన కోరికలన్నీ తీర్చేటి ఆశలన్నీ కలలన్నీనెరవేర్చేటీ అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ ! మీ “అనుగ్రహం” కోసం మీ “విగ్రహం” ముందర “పెట్టెదం” దీపధూప నైవేద్యాలు “కొట్టెదం” కోటి కొబ్బరికాయలు “చేసెదం”చేతులు జోడించి శిరస్సులు వొంచి మీకు సాష్టాంగ నమస్కారాలు ! “పెట్టెదం”వేయి పొర్లుదండాలు ! అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ ! […]

మన్నించవే హృదయమా

రచన: ఆశ రెక్కలు విప్పిన కోరికేదో కోరింది నా హృదయం చకోరి పక్షివలే విహరించాలని ఆశ పడుతుంది! బరువెక్కిన ఎక్కిళ్ళ వేదనను వదలి అంతరంగంలో దాగిన ఛాయా చిత్రాల అనవాళ్లను విడిచి మర్మంతో కూడిన మెత్తటి మనసు చెలిమిలో ఇమడలేక తా ననుకునే స్వేచ్చా జీవితంలో తన ఉనికిని తానుగా నిలుపుకోవాలని నా మస్తిష్కం నుండి విడుదల కోరుతుంది నా హృదయం. బదులు చెప్పని నిశ్శబ్దంగా నేనుంటే నా ప్రతిబింబం నిగ్గదీస్తుంది అసలు నీకు హృదయం అంటూ […]