June 19, 2024

దీపపు వ్యక్తిత్వం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. దీపపు దివ్యవ్యక్తిత్వం కొడిగడుతోంది దీపం దైవపుఒడి చేరుతోంది,పాపం. వేకువతో సమానంగా వెలుగులను పంచాలనే ప్రయత్నంలోనే ప్రతిక్షణం జీవించి, చీకటితెరలను తన శాయశక్తులా తెంచివేయాలనే తాపత్రయాన్నిశ్వాసించిన ఈదీపం, పాపం,తన చివరిక్షణాలను ఎదుర్కొంటోంది. చీకటితెరలు తనని కప్పేస్తున్నా, వెలుగురేఖలు తననివీడి వెళిపోతున్నా, ధైన్యం లేకుండానే వెలుగుతోంది, నిర్వికారంగానే మలుగుతోంది. తన ఆఖరిశ్వాసను కూడా వెలుగును పంచుతూనే వదులుతోంది. తనను వెలిగించిన వారికి కృతజ్ఞతను అలా తెలుపుకుంటోంది. తను పోతేనేం? మరోదీపం వెలిగించబడుతుందని తెలుసు, తను […]

కాలంపై నా కలం.

రచన: మణి కాలమా ! ఓ గమనమా!! అలసట, ఆకలి ఎరుగని, వార్దక్యం లేని ఓ సొగసరి, వివిధ ప్రమాణాలు ఉన్నా, నీ ప్రయాణంలో ఏ మార్పూ ఉండదు. విశ్వ విజేతలను అలఓకగా ఓడించగల ధీశాలి, తారతమ్యభేదాలు, భేషజాలు తెలియని భాగ్యశీలి. ప్రవాహ ఝరీ వేగాన్ని ఆవలీలగా జేయించగల నీవు, కాంతి వేగాన్ని సైతం క్షణిక లో కమ్మేయ్యగలవు జననానికి నీవు, మరణానికి నీవు, జీవన స్రవంతికి నీవు చరిత్రకు సాక్షి నీవు, భవిష్యత్తుకు భరోసా నీవు […]

జీవిత గమనం

రచన: చందు కె శేఖర్ నిదుర పోదామంటే నిదుర రాదాయే తెల్లవారిందంటే టెన్షన్ మొదలాయే వ్యాయామానికి వేళ సరిపోదాయే పూజకు సమయంలేక దండమాయే ఆఫిసుకి ఉరుకులు పరుగులాయే ఎంత పరుగెడినా ఆఫీసుకి లేటాయే లేటుకి కాటు శాలరీ కట్ ఆయే ఎంత పని చేసినా గుర్తింపు లేదాయే పనికి తగ్గ ప్రతిఫలం లేదాయే మన పని చాలక ఇతరుల పని కూడాయే సాయంత్రం ఆరైనా పని తెగదాయే ఆరు ఎనిమిదాయె, తొమ్మిదాయే మల్లి ఉరుకులు పరుగులతో ఇంటికి […]

నిశా సుందరి ….. నా ప్రియ సఖి ….

రచన: భావన పాంచజన్య నీడైనా నన్ను వీడిపోతుంది కానీ… నా ఈ ప్రియ సఖి నన్ను ఎన్నటికీ వీడిపోదు.. వీడిపోలేదు డస్సిన మేనికి శీతల వింజామరలతో ఒడిన సేద దీర్చేను ఈ నిశా మాత …. ప్రియుని రాకకై చుక్కల చీర కట్టి చలి వెన్నెల తడిసి విరహాగ్నితో నిరీక్షించే విరహిణి ఈ ఇందుకాంత శశాంకుని తన వాలుజడన తురిమి వయ్యారామొలికించు ఈ చంద్ర కాంత చుక్కల హారాలు గళసీమ కైసేయు సింగారాల బంగారి ఈ తారాభూషిణి […]

మేటి ఆచారం

రచన: ఎ.బి.వి. నాగేశ్వరరావు దురాచారాల దురాగతాలు, సాంప్రదాయాల సంకెళ్ళు, కట్టుబాట్లు, వివక్షలు, ఆంక్షలు, అణచివేతలు, – వెరసి… యుగాలుగ నియంత్రిస్తున్నాయి నాతిని- ఒడిదుడుకుల ఒడిలో, సర్దుబాటు ధోరణిలో- పసి ప్రాయము నుండి పాడె ఎక్కేదాకా… మజిలి మజిలిలుగ, మూగ జీవిగ, పరాధీనమున … నిరంతరం, జీవితాంతం, జీవచ్ఛవంగా బ్రతుకీడ్చమని ! అభిరుచులు, ఆకాంక్షలు … అతివకు సొంతము, వ్యక్తిగతము- ఉండవు, ఉండకూడదని !! అందుకే, మరి అందుకే- నాడూ, నేడూ… యుగాలుగ, నిజానికి మూగదే మగువ – […]