July 7, 2022

ఋణం

రచన: దొడ్డపనేని అఖిలాండేశ్వరి “గుల్లూ ఏం డిసైడ్ చేసావ్? తోడు నీడవై జీవితాంతం నాతో కలిసి నడుస్తావనే ఆశ నెరవేరుతుందను కొంటున్నా, మరి నీతీర్పు ఏవిటో!” ఉత్సుకత నిండిన స్వరంతో ప్రశ్నించాడు కృష్ణవంశీ. కృష్ణవంశీ మోకాలుమీద తన గడ్డం ఆన్చుకుని కూర్చుని అతని మొహంలోకి తదేకంగా చూస్తున్న గుల్షాద్ కళ్ళల్లో నీళ్ళు చిప్పిలి ముత్యాల సరాలయ్యాయి చెంపలమీద. తన చేత్తో బుగ్గల మీది కన్నీటిని తుడుస్తూ ” ఛ!ఛ! కన్నీళ్ళెందుకు నీకు యిష్టమైతే అవునను లేదంటే లేదు, […]

కానుక

రచన: ప్రభావతి పూసపాటి “లంచ్ అయ్యిందా?” అంటూ చొరవగా తలుపు తీసుకొని రాఘవరావు గారి రూమ్ లోకి ప్రవేశించారు ప్రకాష్ రావు. రాఘవరావుగారు కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు. ప్రకాశరావు ,  రాఘవరావు ఇద్దరు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు . ఒకే గవర్నమెంట్ ఆఫీస్ లో చాలా కాలంగా కలిసి పని చేస్తున్నారు. రాఘవరావు గారు చాలా కష్టపడి , నిజాయతి తో పని చేసి ప్రమోషన్స్ తో త్వర త్వరగా పైకి  వచ్చి పెద్ద […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 54

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   ఈ కీర్తన అధ్యాత్మికమైన హరి కీర్తన. అన్నమయ్య సకల దేవతా మూర్తులలో శ్రీవేంకటేశుడినే దర్శిస్తాడు. ఆయన రాముడైనా, కృష్ణుడైనా, నరసింహుడైనా మరే అవతారమైనా సరే! ఈ కీర్తనలో ద్వాపరయుగ కృష్ణుని స్తుతిస్తూ, మంచి హాస్య చమత్కారంతో ఆయన లీలలు వర్ణిస్తూ తాను పులకరించి శ్రోతలను అలరింపజేస్తున్నాడు. మీరూ చూడండి. ఆ లీలామానుషధారి విశేషాలు వినండి.   కీర్తన: పల్లవి: కోరుదు నామది ననిశము గుణాధరు నిర్గుణుఁ గృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారు                                […]

నాన్న అడుగుజాడలే పరమావధి

సమీక్ష: సి. ఉమాదేవి   మొవ్వ రామకృష్ణగారు రచించిన శత కవితా సంకలనం నాన్న అడుగుజాడల్లో ప్రతి కవితలో కవి మనసు పారదర్శకంగా కనిపిస్తుంది.  వారి వెన్నుతట్టి ప్రోత్సాహాన్నందించిన రామా చంద్రమౌళిగారు,  సౌభాగ్యగారు, నందినీ సిధారెడ్డిగారు, లంకా శివరామకృష్ణగారు,  ప్రచురించిన జగన్నాథశర్మగారికి వారు అర్పించిన అక్షరాంజలి మనసును సంతోషంతో నింపుతుంది. తల్లిప్రేమ ఎన్నటికి మరువలేము. అయితే తండ్రి మనపట్ల చూపే అనురాగంలో బాధ్యాతయుతమైన ప్రేమ వెలకట్టలేనిది. ఈ సమాజంలో మనం తలెత్తుకు తిరగాలంటే నాన్న అడుగుజాడల్లో నడవాల్సిందే […]

ప్రేమ సంస్థానం .. మధూలిక

సమీక్ష: శ్రీ సత్యగౌతమి   ప్రియుని ధ్యానంలో అంతర్ముఖురాలైన ప్రేయసి మధూలిక ‘నేనంటూ కదులుతున్నప్పుడు నీ అడుగులనే అనుసరిస్తున్నట్లూ నాలో మౌనం తెరవేసినప్పుడు నీ ధ్యాసలో ఎద రమిస్తున్నట్లు’ …. ఈ నాలుగు వాక్యాల్లో అంతర్లీనంగా అథ్భుతంగా మధూలిక తన ప్రణయ కోరికను ఆవిష్కరించింది .   అంతేకాదు, ‘చిరుముద్దుతో రెప్పల కదలికలు అలలలైనప్పుడు మనమో దీవికి వలసపోయినట్లు ….   ప్రియునితో దీవి ప్రాంతాన అచటి సముద్రతీరపు అలలలో మమేకమైన మధూలిక, ‘తన కనురెప్పలపై ప్రియుని […]

కవి పరిచయం – అనురాధ బండి

రచన: లక్ష్మీ రాధిక కదులుతున్నట్టు కనపడని కృష్ణవేణిలా ఆమె కవిత్వం ఒక నది. సరిగ్గా చూస్తే వెన్నెల్లో వీణానాదంలా, వెండిమబ్బు దూదిపింజెలా,నిస్పక్షపాతపు కవితలా, బంగారు కలల నుంచీ వాస్తవపు విడ్డూరాల దాకా విస్తరించి ఉంటుంది. తన కవనంలో.. కమ్ముకునే కలతలూ, నిరాశా నిట్టూర్పు గేయాలూ, అంతులేని ఆలోచనా స్రవంతిలూ, పునర్వేచన చేసేలా దీప్తివంతమై ఉంటాయి. ఆ పదాలు గుండెల్లో గెంతులేసే అలల సవ్వళ్ళలా ఉలిక్కిపెడుతుంటాయి. తనే మరి..మన అనురాధ బండి. ముఖపుస్తక నేస్తంగా తన కవనాల సాక్షిగా […]

గురువులు కృపాచార్యుడు, ద్రోణుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మహా భారతములోని ముఖ్యమైన పాత్రలు కౌరవులకు, పాండవులకు విద్యలు నేర్పిన గురువులు కురుక్షేత్ర యుద్దములో సైన్యాన్ని నడిపించిన అతిరధ మహారధులు భీష్ముని తదనంతరము కౌరవ సైన్యానికి నాయకత్వము వహించినవాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడు గురువులలో అగ్రగణ్యుడు అందుచేతనే ప్రభుత్వము వారు కూడా ఆటలకు శిక్షణ ఇచ్చే విశిష్టమైన కోచ్ లకు ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. వీరువురు గురించి క్లుప్తముగా తెలుసుకుందాము. కృపాచార్యుడు బ్రహ్మ నాల్గవ అవతారము. ఈయన శతానంద మహర్షి […]

మలేషియ విహారయాత్రలు ( పెనాంగ్)

రచన: నాగలక్ష్మీ కర్రా ఈ సంచికలో “పెనాంగ్” లో కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. పెనాంగ్ కి దగ్గర గా చాలా చిన్న చిన్న అంటే మహ అయితే ఓ ఎకరం విస్తీర్ణం ఉన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. కొన్నిటికి పేర్లు ఉన్నాయి, పేరులేని ద్వీపాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రతీ నెలా వచ్చే ఆటూపోట్లకి మునిగి తేలుతూ ఉంటాయి. మా నివాసానికి ఎదురుగా అలాంటి ద్వీపం ఉండేది. ఓ నాలుగు వృక్షాలు చిన్న ఇల్లు ఉండేవి, […]

తపస్సు – సహచరి

రచన: రామా చంద్రమౌళి అకస్మాత్తుగా ఆమెను ‘ ఐ సి యూ ’ కు తీసుకు వెళ్ళారు ఆమెకు భర్తా, ఇద్దరు పిల్లలూ ఉన్నారు కాని వాళ్ళు చాలా బిజీ ఎక్కువరోజులు ఆమె వెంట వాళ్ళుండరు వాళ్ళు ఖండాంతరవాసులు .. వస్తూ పోతూంటారు అప్పుడప్పుడు కొందరంతే., అందరూ ఉండీ ఎవరూ లేనివారు అన్నీ ఉండీ ఏమీ లేనివారు బయటికి ‘ పూర్తిగా ’ ఉన్నట్టనిపిస్తూ లోపల పూర్తిగా డొల్లై జీవిస్తున్నవారు – ఆమె ఆ ఉదయమే వాకిట్లో […]

నేను నిత్యాన్వేషిని!

రచన: వసంతరావు నాగులవంచ గుళ్ళు గోపురాలు దండిగా దర్శించాను మసీదులు చర్చ్ లలో ప్రార్థనలు చేశాను తీర్థ యాత్రలు చేసి తిప్పలెన్నో పడ్డాను నాకు దేవుడెక్కడా మచ్చుకు కన్పించలేదు! నోములు వ్రతాలు చాన్నాళ్ళుగా ఆచరించాను ముడుపులెన్నో కట్టి మొక్కు చెల్లించాను నిలువు దోపిడీ యిచ్చి నిండా మునిగాను దేవుడెందుకో నాకు కన్పించనేలేదు! గుట్టలు పుట్టలు పిచ్చిగా వెదికాను కొండ గుహల్లోకి అత్యాశగా తొంగిచూశాను హిమాలయాలలో మౌనంగా ధ్యానం చేశాను మరెందుకో దైవం జాడ నాకు తెలియనేలేదు! గురువులు […]