సమీక్ష: కూర చిదంబరం

ఒకనాడు రామకృష్ణ పరమహంసగారిని ఒక సందర్శకుడు అడిగాడట. “అయ్యా! మీరు భగవంతుడిని చూసారా?” అని. అందులకాయన జవాబిస్తూ, ” చూసాను. నేను నిన్ను ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నానో, అంత స్పష్టంగా చూడగలుగుతాను” అన్నాడట.
భగవంతుడు తన యెడ అచంచల విశ్వాసము, పట్టుదల కలవారికి నాడూ, నేడూ తన ఉనికిని చాటుతూనే ఉన్నాడు. సైన్సుకు అందని, ఎన్నో అద్భుతాలు చూపుతూనే ఉన్నాడు. అట్లాంటి అద్భుతాలను, అనుభవాలను వెంకట వినోద్ పరిమి అనే ఈ గ్రంధకర్తకు చూపాడు. వాటిలో ముఖ్యమైన 34 అనుభవాలను వెంకట వినోద్ మనతో పంచుకుంటున్నాడు. భగవంతుడు ఈ రచయిత కలల్లో తరచుగా కనబడుతూ, రాబోయే మంచీ చెడుల గురించి హెచ్చరికలు ఇవ్వటం, మరియు వాటిని ఈ రచయిత ఎలా నిబ్బరంతో ఎదుర్కొన్నదీ వివరించారు. క్రితం క్షణం వరకు సమస్యలు కారుమేఘాలై క్రమ్ముకుని అగమ్యగోచరమైన సందర్భాల్లో, అవి ఎలా దూదిపింజల్లా పారిపోయాయో వివరిస్తాడు. భారతదేశపు గుళ్ళూ గోపురాల మీద, వాటి నిర్వహణ, ఆచారవ్యవహారాల మీద ఈ రచయితకు గొప్ప అవగాహన ఉంది. (ఉదా: తిరుమలలో విశేష పూజలు, చిదంబరం ఆలయ నిర్మాణ విశేషాలు). 32వ అధ్యాయంలో, పరమాత్ముని దర్శించటం అంటే ఏమిటో, ఎలా సాధ్యపడుతుందో అన్న విషయ వివరణ మనసుకు హత్తుకుపోతుంది. “చేస్తున్న పనిలో లీనమైతే భగవంతుని దర్శించినట్లే” “Work Is Workship ” అన్న ఇంగ్లీషు కొటేషన్ గుర్తుకు తెస్తుంది.
ఆస్తికులకు ఒక గొప్ప అనుభూతిని ప్రసాదించే సంకలనం ఇది. వెంకట వినోద్ పరిమి అనుభవాలను యం. రమేష్‌కుమార్ అనే సాహితీవేత్త అక్షరీకరించి మనకందిస్తున్న ఉద్గంధ్రం. భగవంతుని యెడ విశ్వామున్న ఏ మతావలంబకులైనా, చదివి ఆనందించగలుగుతారు.

దైవంతో నా అనుభవాలు ఆధ్యాత్మిక వ్యాసాలు
రచన: వెంకట వినోద్ పరిమి
ప్రతులకు: జ్యోతివలబొజు . 8096310140

By Editor

One thought on “అచంచల విశ్వాసము, ప్రయత్నము, దైవము. – దైవంతో నా అనుభవాలు”

Leave a Reply to మాలిక పత్రిక జనవరి 2021 సంచికు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *