రచన : శుభశ్రీ అశ్విన్

పాకశాస్త్రంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు…మన మగువలందరూ వంటగదిలోకి ఒక్కసారి పరకాయప్రవేశం చేశారంటే ఇక వేరే చెప్పాలా!! వాళ్ళు చేసే వంటల ఘుమఘుమలు ఆ వీధి వీధంతా ఘుమాయించాల్సిందే!!
అటువంటి ఒక పాకశాస్త్ర నిపుణురాలు తన గురించి తను సరదాగా పాడుకుంటున్న ఒక పాట..

పేరడీ పాట : ఆహా ఏమి రుచి!!
@ ఎగిరే పావురమా సినిమా

ఆహా ఏమి రుచి అనరా మైమరచి….
నేనే గరిట పడితే అదరహో అంటారుగా!!!…
మీకేం కావాలో నాతో చెప్పండి…
నే చేసి పెడతాగా వంటలన్నీ చక-చక-చక-చక-చక-చక….

ఆహా ఏమి రుచి అనరా మైమరచి…
నేనే గరిట పడితే అదరహో అంటారుగా!!!

నేతిబీరకాయలతో చెట్నీ చేసేదా!!
గుత్తివంకాయలతో వేపుడు చేసేదా!??
ఆలూ కట్ చేసి ఫ్రెంచ్-ఫ్రైస్ చేసేదా??
మష్రూమ్స్ తోటి నేను మంచూరియ చేసేదా…
ఒకటా రెండా మరీ!!!ఎన్నో వెరైటీలే చేస్తాగా!!!

ఆహా ఏమి రుచి అనరా మైమరచి…
నేనే గరిట పడితే అదరహో అంటారుగా!!

బీట్-రూట్ తో నేను రసమే పెట్టేయనా!!??
మపదా….
గుమ్మడికాయతోటి హల్వా చేసేదా?!!!!
చామదుంప ఫ్రై చేసి రసమే పెడితే మీరు..
మళ్ళీ ఇంకోసారి…అని అడిగేస్తారు…
ఇంకా చెప్పాలా!! పాకశాస్తృంలో నా ఘనతలనే!!??

ఆహా ఏమి రుచి అనరా మైమరచి…
నేనే గరిట పడితే అదరహో అంటారూగా….
నాకు రాని వంటంటూ ఏదీ లేదండి..
ఒక్కసారి తిని చూస్తే ఆహా! ఓహో! అని మీరే అంటారుగా….

మిమ్మల్నందరినీ నవ్వించడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాను..
ధన్యవాదాలు!!

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *