May 26, 2024

గరుడ పురాణం

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

అష్టాదశ (18) మహా పురాణాల్లో గరుడ పురాణము ఒకటి. దీనికి గరుడ పురాణాము అని పేరు రావటానికి కారణము ఇది పక్షులకు రాజు అయిన గరుడుడికి శ్రీ మహావిష్ణువుకు జరిగిన సంభాషణ,ఈ గరుడ పురాణములో 19000 శ్లోకాలు ఉంటాయి.దీనిని సాత్విక పురాణాముగా వర్ణిస్తారు. ఈ పురాణము శ్రీ మహావిష్ణువు అవతారాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా భూమి పుట్టుక భౌగోళిక స్వరూపాలను భూమి మీద సృష్టి మొదలైన అంశాలను వివరిస్తుంది.
ఈ పురాణములో తెలియజేసిన ముఖ్య అంశాలలో జీవి శరీరాన్ని విడిచిన ఆత్మప్రయాణము ఈ పురాణము మొత్తము గరుడుడికి శ్రీ మహావిష్ణువుకు జరిగిన అమోఘమైన సంభాషణ ద్వారా మనిషి జీవితము యొక్క అర్ధాన్ని వివరిస్తుంది. గరుడ పురాణము ఒక్కటే మరణానంతరము జీవియొక్క స్థితి అంటే ఆత్మ యొక్క ప్రయాణమును వివరించే పవిత్ర గ్రంధము ఈ గ్రంధములో మరణము మరణము అనంతరము దశ, మళ్లి పుట్టుక వంటి అంశాలు వివరింపబడతాయి.హిందూ ధర్మాన్ని అనుసరించి 16 సంస్కారాలలో ఆఖరుది అంత్యేషి సంస్కారము. ఇది అంత్యక్రియలు ఆ తరువాత జరిగే కార్యక్రమాలకు సంబంధించినది ఈ పురాణము యమలోకం వివిధ రకాల నరకలోకాల గురించి వివరిస్తుంది. కర్మ మరియు మోక్ష సిద్ధాంతాన్ని అనుసరించి ఆత్మ తన ప్రయాణములో తన జీవితకాలంలో అంటే భూమి మీద తానూ చేసిన కర్మలకు అనుగుణముగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.
హిందూ ధర్మాన్ని అనుసరించే కుటుంబాలలో మనిషి చనిపోయిన నాటినుంచి 13వ రోజు అంటే కర్మకాండలు పూర్తి అయేవరకు గరుడ పురాణాన్ని చదువుతారు ఇది ఒక ఆచారంగా హిందూ కుటుంబాలలో ఉంటుంది అంటే మిగతారోజులలో చదవకూడదు అన్ననియమము ఏది లేదు, కానీ చనిపోయినాక ఆ ఇంట్లో గరుడ పురాణము చదవటం శ్రేయస్కరము అని పెద్దలు చెపుతారు. తల్లిదండ్రులు చనిపోయిన సందర్భములో గరుడ పురాణము వింటే చనిపోయిన వారికి ముక్తి లభిస్తుంది చనిపోయిన వారి బంధువులు దుఃఖాన్ని మరచి చనిపోయినవారి మోక్ష ప్రాప్తికి ప్రార్ధిస్తారు.చేసిన పాపాలకు యమలోకములో అనుభవించాల్సిన శిక్షలను తెలుసుకుంటారు కాబట్టి బ్రతికి ఉన్నవారు అటువంటి పాప కర్మల జోలికి పోకుండా సత్కర్మలను చేస్తూ జీవిస్తారు అని పెద్దల భావన.
గరుడ పురాణము ప్రధానముగా వైష్ణవ సంప్రాదాయానికి చెందిన సాహితి సంపద ముఖ్యముగా శ్రీ మహావిష్ణువు మిగిలిన దేవతలను పొగిడిన శ్లోకాలు సంస్కృతములో రచించబడ్డాయి. ఈ పురాణము అతి ప్రాచీనమైనది అంటే ఇంచుమించు మొదటి మిలీనియంలో కంపోజ్ చేయబడింది అని నమ్మకము. ఆ తరువాత కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయని భక్తులు నమ్ముతారు. మూల గ్రంధములో 16,000 శ్లోకాలు చాఫ్టర్లుగా విభజింపబడి ఉన్నాయి. ప్రస్తుతము ఉన్న మూలప్రతిలో 8000 శ్లోకాలు మాత్రమే మిగిలినాయి వీటిని పూర్వ కాండ, ఉత్తరకాండ అనే రెండు భాగాలుగా చేశారు. పూర్వకాండను మళ్ళా 229 భాగాలుగా విభజించారు. కానీ కొన్ని వెర్షన్స్ లో 240 నుండి 243 భాగాలుగాఉన్నట్లు చెపుతారు. ఉత్తర కాండ 34 నుండి 49 భాగాలుగాఉన్నట్లు తెలుస్తుంది. ఉత్తరకాండనే ప్రేతఖండ లేదా ప్రేతకల్ప అని కూడా అంటారు.
ఈ చాఫ్టర్లు రకరకాల టాపిక్స్ కు సంబంధించినవి. ఈ టాపిక్స్ పౌరాణికం, దేవతలా మధ్యగల సంబంధము, మంచి చెడుల మధ్య వ్యత్యాసము హిందూ మతములో ఉన్న వివిధ తత్వశాస్త్రలు,యోగా సిద్ధాంతాలు, స్వర్గము నరకము ల గురించిన సిద్ధాంతాలు వాటితోపాటు కర్మ మరియు పునర్జన్మ ఇలా అనేక రకాల విషయాలను తెలియజేస్తాయి జాతి రాళ్ళ క్వాలిటీని పరీక్షించే విధానాలు కూడా ప్రస్తావించబడ్డాయి.వ్యాధులకు ఉపయోగించే మూలికలు మొక్కల గురించి కూడా వివరణ ఇవ్వబడ్డది. హిందూ పంచాంగము, దానికి ఆధారమైన అంశాలు. గ్రహాలు నక్షత్రాలు వాటి గమనము కూడా వివరించబడింది. అలాగే వాస్తు శాస్త్రము కూడా వివరించ బడింది రాజకీయాలలో రాజు ధర్మాలు విధులు, తెలియజేస్తుంది.యోగాను సాధన చేస్తూ వ్యక్తిగతముగా జ్ఞానాన్ని పెంచుకొనే విధానాలను వివరిస్తుంది.ఈ విధముగా ఈ గ్రంధము వేరు వేరు సంఖ్యలలో భాగాలుగా వివరింపబడింది కొన్ని గరుడ పురాణ ప్రతులను సౌపర్ణ పురాణము (భాగవత పురాణములో ఈ ప్రస్తావన ఉంది)అని కూడా పిలుస్తారు.వాయు పురాణములో వైనతేయ పురాణముగా చెప్పబడింది.పూర్వఖండము జీవము జీవితమూ వంటి అంశాలకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వబడింది.మిగిలిన ప్రేతఖండములో మరణానంతరము దహనము మొదలైన క్రియలకు సంబంధించిన విషయాల వివరణ ఉంది.19 వ శతాబ్దము 20 శతాబ్దము మొదట్లో గరుడపురాణ సరొద్దర అనే పేరుతో ప్రచురింపబడి ఎర్నెస్ట్ వుడ్,ఎస్ వి సుబ్రమణ్యం లు ఇంగ్లిష్ లో తర్జుమా చేసి ప్రచురించారు.కానీ ఇది గరుడపురాణము కాదు లూడో రోచర్ కలుగజేసిన అయోమయము వలన దీనినే గరుడపురాణము అని అనుకున్నారు. మొదటిసారిగా మన్మనాధ్ దత్ అనే అయన 20 వ శతాబ్దము ఆరంభములోఅనువాద ప్రతులను
ప్రచురించాడు.గరుడు (శ్రీ మహావిష్ణువు వాహనము అయిన పక్షి రాజు గరుక్మంతుడు) శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్న విషయాలను కశ్యప మహా మునికి చెప్పగా ఆ ముని నైమిశారణ్యములో ఇతర మునులకు వ్యాసునికి చెప్పగా గరుడ పురాణము పేరుతో ప్రజాబాహుళ్యములోకి వచ్చింది.
గరుడ పురాణములో వివరింపబడిన దానిని బట్టి విశ్వ నిర్మాణ శాస్త్రము శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వారి కలయిక వల్ల మొత్తము విశ్వము సృషించబడింది అని గరుడ పురాణము చెబుతుంది. విష్ణువు మార్పు లేని యదార్ధము అంటే బ్రహ్మము అయితే లక్ష్మి దేవి మారుతూ ఉండే యదార్ధము అంటే మాయ గరుడ పురాణము శైవము,శక్తి,స్మార్త సంప్రదాయాలను కూడా వివరిస్తుంది అంతేకాకుండా గరుడపురాణములోని పూర్వ ఖండ 47 వ అధ్యాయములో హిందూ దేవాలయాల నిర్మాణము గురించి అనుసరించవలసిన పద్దతుల గురించి తెలియజేస్తుంది. గరుడ పురాణములో జాతి రత్నాలను గుర్తించే విధముకూడా తెలియజేయబడింది ప్రస్తుతము జెమాలాజి పేరుతొ ఈ శాస్త్రము ప్రసిద్ధి చెందింది. గరుడ పురాణము లోని పూర్వ ఖండము 93 వ అధ్యాయములో యాజ్ఞవల్క్య మహాముని ధర్మశాస్త్ర నియమాలను వివరిస్తాడు. వేదాలలో వివరింప బద్ద జ్ఞానాన్ని క్లుప్తముగా వివరిస్తాడు ధర్మ బద్దముగా డబ్బును ఎలా సంపాదించాలి వంటి అంశాలను వివరిస్తాడు. దానధర్మాలను కూడ వివరిస్తాడు.ఈ అధ్యయములోనే సత్ప్రవర్తన, అహింస వంటి ధర్మాల ప్రాధాన్యతను వివరిస్తుంది.
ఈ గ్రంధములో వేరు వేరు వర్ణాల వారు ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలో చెపుతుంది. అందుచేతనే వేదాధ్యయనము చేసే బ్రాహ్మణులు జంతువులను చంపటం తినటం చేయకూడదని చెపుతుంది.ఉపనయనము చిన్నవయస్సులోనే చేయాలని కూడా చెపుతుంది ఇతర వర్ణాలవారికి తినే ఆహారము విషయములో ఉపనయనము వంటి విషయములో ఖచ్చితమైన నియమాలు ఏమి లేవు 108 వ అధ్యాయములో నీతి చర సిద్ధాంతాలు వివరింపబడ్డాయి అంటే ముఖ్యముగా ఇతరులతో ఏవిధముగా ప్రవర్తించాలో చెపుతుంది. మంచి స్నేహితులు సుఖాలు, జ్ఞానము సంపాదించే మార్గాలు లేనప్పుడు అటువంటి ప్రదేశాన్నివదిలివేయాలి అని చెపుతుంది. నిజాయితీగా బ్రతికే పురుషులను ఉత్తములుగా పేర్కొంటారు వారు వారి భార్యలపట్ల నిజాయితీగా ఉంటూ ధర్మబద్ధముగా సంపాదిస్తూ దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. గరుడపురాణములోని నీతిశాస్త్రములో నీతివంతమైన పాలన గురించి వివరింపబడింది. పూర్వకాండలోని 111 అధ్యమునుండి మంచి రాజు మంచి ప్రభుత్వమూ యొక్కక్ లక్షణాలను వివరిస్తారు పరిపాలన ఎప్పుడు ధర్మమూ న్యాయము సత్యము అనే ధర్మాలపైనా ఆధారపడి ఉండాలి అని చెపుతుంది. రాజు దేశాన్ని శత్రురాజులు దండయాత్రలనుండి కాపాడుతూ ప్రజలు భరించగలిగినత వరకే పన్నులు విధిస్తు పరిపాలన చేయాలి అని చెపుతుంది. ఆ విధముగా మంచి పరిపాలన ఆ రాజ్యము యొక్కఅభివృద్ధికి తోడ్పడుతుంది.
గరుడపురాణములో పూర్వకాండలోని ధన్వంతరి సంహితకు సంబంధించినవి అంటే ఆయుర్వేద వైద్యానికి సంబంధించినవి. వీటిలోని రోగనిర్ధారణకు సంబంధించి రోగాల లక్షణాలు మొదలైనవి వివరింపబడ్డాయి ఈ గ్రంధములో వ్యవసాయ ఉత్పత్తులు మూలికలు వాటి ఆరోగ్య ఉపయోగాలు కూడా వివరింపబడ్డాయి. పూర్వకాండలో దాదాపు 450 మొక్కల సంస్కృతము పేర్లు ఉన్నాయి.
గరుడ పురాణమంలోని 226 వ అధ్యాయము పశువులకు సంబంధించిన రోగాలు వాటి వైద్యము లను వివరిస్తుంది. ముఖ్యముగా అశ్వములకు సంబంధించినవి.పశువుల వైద్యానికి సంబంధించిన 42 రెండు మూలికల ప్రస్తావన కూడా ఉంది. పూర్వకాండలోని చివరి పది అధ్యయాలు యోగాకు నిర్దేశింపబడ్డాయి. కొన్ని సందర్భాలలో ఈ భాగాలను బ్రహ్మ గీత అంటారు ఈ భాగములోనే దత్తాత్రేయుని ప్రస్తావన ఉంటుంది ఈ అధ్యాయల లోనే వివిధ రకాల ఆసనాల గురించి వివరిస్తారు మెడిటేషన్, సమాధి ఆత్మజ్ఞానము మొదలైన వాటిని చేరటానికి యోగా చాలా అవసరము.మెడిటేషన్ నుంచి సగుణ నిర్గుణ లకు మారాలి. అంటే నిరాకారుడైన శ్రీ మహావిష్ణువును చేరటానికి ఒక గురువు ద్వారా సాధనచేయాలి అని చెపుతుంది.ప్రేతకాండలోని భాగాలు చావు చావు తరువాతి అంశాలను తెలియజేస్తాయి ఈ
భాగములోని శ్లోకాలు మొదలైనవి బహుశా అంత్యక్రియల సందర్భముగా ఉపయోగించేవి చనిపోయిన శిశువు అబితే రెండేళ్లు పూర్తికాని వారిని దహనము చేయకుండా పూడ్చిపెడతారు. వారికి ఇతర శ్రాద్ధ లేదా ఉదక క్రియలు అవసరము లేదు అని గరుడపురాణము చెపుతుంది. అట్టివారు రెండు సంవత్సరాలు పూర్తిచేసినాక వారి బంధువులు స్మశానానికి అంత్యక్రియలు నిర్వహించాలి. ఆ సందర్భముగా యమసూక్తాన్ని చదువుతారు.ఈ విధముగా గరుడపురాణము అనేక అంశాలను వివరిస్తుంది ముక్తి మార్గానికి దారి చూపుతుంది ఇది కేవలము ఎవరైనా చనిపోయిన సందర్భాలలో మాత్రమే వినే లేదా చదివే పురాణము కాదు అనేక మానవుని నైతిక ప్రవర్తన వంటి అంశాలను వివరించే శాస్త్రము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *