రచన: చౌటపల్లి. నీరజ చంద్రన్

వేదించే మదికి
నివేదించే నివేదనలు
జ్ఞాపకాలు
గడచిన కాలానికి
మిగిలే గురుతులు
జ్ఞాపకాలు
వాడని సుమాల
సుగంధపు పరిమళాలు
జ్ఞాపకాలు
గతాన్ని గుర్తుచేస్తూ
వాస్తవంలో వర్తమానాలు
జ్ఞాపకాలు
కలతల ‘కల’వరానికి
స్వాంతనిచ్చే ‘స్వ’గతాలు
జ్ఞాపకాలు
వేకువ పిలుపులో
తొలిపొద్దు సంతకాలు
జ్ఞాపకాలు
అమృతాన్ని వర్షించే
అక్షరలక్షల కన్నియలు
జ్ఞాపకాలు
నవ్వుల సంతకాల
వెన్నెల తుణీరాలు
జ్ఞాపకాలు
చెలిమితో చేరిన
వెన్నెల్లో ఆడపిల్లలు
జ్ఞాపకాలు
తరగని నిధుల
పెన్నిధి భాండాగారాలు
జ్ఞాపకాలు
భావాలకు అందని
మనసు ముచ్చట్లు
జ్ఞాపకాలు
అటుఇటు వెరసి
జన్మజన్మల అనుబంధాలు
జ్ఞాపకాలు…..!!

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *