August 11, 2022

రైతు మొగ్గలు

రచన: – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

దేశానికి వెన్నెముక అన్నదాత అంటున్నప్పుడల్లా
రైతన్నల మదిలో రాచపుండులా అనిపిస్తుంటుంది
అప్పులఊబిలో కూరుకుపోయిన ఎండమావి అన్నదాత

రైతు నాగళ్ళతో పొలాన్ని దున్నుతున్నప్పుడల్లా
తన ఆకలిని ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటడు
అన్నాన్ని పండించే అసలైన అన్నదాత రైతన్న

యుద్ధవాతావరణంలా తుఫానుమేఘాలు కమ్మినా
ఎప్పుడూ ఆశనిరాశలతోనే జీవనాన్ని సాగిస్తుంటడు
కలలా బతుకీడుస్తున్న రైతన్న కన్నీటిసముద్రం

కరువురక్కసి రైతన్నలను పీడించి తరుముతుంటే
బతుకుపై ఆశలు మిణుకుమిణుకుమంటూనే ఉంటవి
ప్రతి అన్నం మెతుకు మీద రైతన్న బతుకుచిత్రం

అప్పులోళ్ళు బ్యాంకులోళ్ళు వెంటబడి వేధిస్తుంటే ఉరికొయ్యలను ముద్దాడే బక్కచిక్కిన ప్రాణాలు
ఉసురుతీస్తున్న నిరుపేద రైతన్నల అప్పులభయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *