April 24, 2024

మనిషి లోని మహర్షి.

రచన – మోహన మణికంఠ ఉరిటి(మణి)

మనిషి దాగనీయకుమా
నీలో ఉన్న మహర్షిని..
రంగుల ప్రపంచాన్ని చూస్తూ,
నీలో ఉన్న రారాజుని నిద్రలోనే ఉంచితివి.

ఆనందం కోసం పరిగెడుతూ
నీ ఆత్మారాముడిని ఆదమరిచితివి
ప్రేమికుల ప్రేమకోసం పరితపించే నీవు,
నిన్ను నీవూ ఏనాడైన ప్రేమించుకున్నావా?

పురాణతిహాసాల్లో వర్ణించిన వారితో పోల్చితే,
నీలో ఉన్నవాడు రాముని కంటే ఆజానుబాహుడు,
కృష్ణుడి కంటే కొంటె వాడు, బుద్ధుడి అంతటి సిద్ధుడు,
అల్లాకి అనుచరుడు, ఏసు, ఈశ్వరయ్యలంత కారుణ్యుడు.

నిన్ను నీవూ ఎరిగిననాడు,
నీ మాటలు తెనేపలుకులు,
నీ నవ్వులు హరివిల్లు లు,
నీ అడుగులు ఆదర్శబాటలు.

నీవాడు విశ్వాన్ని చుట్టి రాగలడు,
విశ్వానికి నిన్ను పరిచయం చేయగలడు.
నిన్ను నీవు ప్రేమించి చూడు,
నీ జీవితపు విజేతవి, జగజ్జేతవి నీవే..

1 thought on “మనిషి లోని మహర్షి.

Leave a Reply to మాలిక పత్రిక జనవరి 2021 సంచికు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *