April 25, 2024

అదండీ సంగతి

రచన: గిరిజరాణి కలవల “ఇదిగో, ఇప్పుడే చెపుతున్నా! నా వంతు గుత్తొంకాయ్ కూరమ్మాయ్… ఇంకెవరూ పోటీకి రాకండి.. మెంతికారం పెట్టి.. లేలేత మువ్వొంకాయలు.. అలవోకగా.. అలాఅలా నూనెలో తేలాడుతూ చేసాననుకో… ఒకొక్క వంకాయీ ముచిక దగ్గర పట్టుకుని ‘ కచక్’ అని కొరికితే… బెత్తెడు దూరమే.. ఏదీ… ఆ స్వర్గానికి… మీ అందరికీ తెలిసిందేగా.. నా వంకాయ కూర రుచి ” అంటూ వనభోజనాల వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజ్ పెట్టింది వంకాయల వనజాక్షి. “సరే.. వంకాయ […]

శంకరం పెళ్లి

రచన: జీడిగుంట నరసింహ మూర్తి శంకరానికి వారం రోజుల్లో పెళ్లవుతుందనగా గోదావరికి వరదలోచ్చాయి. గోదావరికి గండి పడి నీళ్ళు ఉదృతంగా ఇళ్ళల్లోకి వచ్చేసాయి. మళ్ళీ ఆర్నేల్లవరకు సరైన పెళ్లి ముహూర్తాలు లేవని శంకరం కాబోయే మామగారు వరద కాదు ప్రళయం వచ్చి పడినా పెళ్లి చేసెయ్యాలని నిర్ణయించేసాడు. శంకరానిది ఒక ప్రైవేటు కంపనీలో ఉద్యోగం. “ పెళ్ళికి నాలుగు రోజులు సరిపోవా ?” అన్నాడు లీవ్ లెటర్ ను కోపంగా చూస్తూ శంకం బాస్. అతని బాసుకు […]

వెన్నెల విరిసిన నవ్వులు

రచన: కాదంబరి కుసుమాంబ డజను ఆశల తర్వాత ఎట్లాగో పొత్తిళ్ళలో నిలిచిన పసికూన … ఆడపిల్ల అవడంతో ముక్కు చిట్లించారు. పేరు పెట్టడం, నామకరణ మహోత్సాహాదుల తలపులకు చోటు లేకుండా పోయింది. చంటిది దోగాడుతూ వచ్చి, తినుబండారాల వైపు ఆశగా చూసింది, “ఇదిగో అప్పచ్చీ!” అంటూ ఇచ్చిన అప్పచ్చితో పాటు ఆ పొరుగింటి నాపసాని పలికిన పదమే పిల్లదానికి పేరుగా స్థిరం ఐ కూర్చుంది. ఫలితం అందరూ “అప్పచ్చీ!” అని పిలిస్తే పలికేది. ఇంకేముంది, పల్లెలో అప్పచ్చి […]

అత్తమ్మ

రచన: డా.మీరా సుబ్రహ్మణ్యం స్టాఫ్ రూంలో అదరి ముఖాలు ఏదో తెలియని ఆనందంతో వెలిగి పోతున్నాయి. కారణం ఆరోజు ఒకటో తారీఖు. మధ్యాన్నం రెండు గంటలకల్లా ఆఫీస్ సూపెరింటెండెంట్ గారు ట్రెజరీ నుండి డబ్బు సంచీలో వేసుకుని వచ్చేసారని కబురు అందరికీ తెలిసిపోయింది. “మనం కూడా వెళ్ళి జీతం తెచ్చుకుంటే ఒక పనైపోతుంది”. ఉత్సాహంగా అంది సరళ. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆ పెళ్ళికాని పాతికేళ్ళ అమ్మాయికి జీతం అందిన రోజే సరదాగా షాపింగ్ చేసి చీరలు […]

తెలివైన యువకుడు

రచన: మోహనరావు మంత్రిప్రగడ. పిల్లలు అరుగు మీద కూర్చోని కధలు చెప్పుకొంటున్నారు. ఇంతలో రాముడు మావయ్య వచ్చాడు.” ఏం చేస్తున్నార్రా పిల్లలు” అని అడిగాడు. “కధలు చెప్పుకొంటున్నాం మావయ్యి” అని అందరు ముక్త కఠంతో అరిచారు. “అలాంటి పిచ్చి కధలు కాదురా నేనో మంచి కధ చేపుతాను వినండి” అని అరుగుమీద కూర్చొన్నాడు ఆయన. “చెప్పు మావయ్యా” అని పిల్లలు అందరు దగ్గరగా చేరారు. “సరే వినండి పూర్వం అలకాపురం అనే రాజ్యం ఉండేది దాన్నీ చంద్రుడు […]

ఇంటింటి కథ

రచన: MRVS మూర్తి “అబ్బా, నెమ్మదిగా తీసుకెళ్ళవచ్చు గదా! ఈ విసిరెయ్యడమేమిటి? తల తిరిగి పోతోంది” ఆవేదనగా ఓ గొంతు. “అయ్యో, నీ స్పీడ్ తగలెయ్య. పెద్దరాయి గుచ్చుకుందిరా. ఎన్నాళ్ళకు తగ్గుతుందో ఏమిటో? “బాధగా మరో గొంతు. “ఒరేయ్, నీ చేతులు పడిపోయాయేమిటిరా, కాళ్ళతో తన్నుతున్నావ్? నీ వాళ్ళనయితే ప్రేమగా చేతుల్తో ఎత్తుకుని ముద్దాడుతావ్. మా గురించి అడిగేవాళ్ళు ఎవరూ లేరనేగా నీ ధైర్యం. మాకూ ఓ రోజు వస్తుందిరా. అప్పుడు చెబుతాం, నీ సంగతి? “ఉక్రోషంతో […]

బామ్మకి ఇచ్చిన మాట

రచన: ప్రభావతి పూసపాటి “అమ్మ! తలనొప్పిగా వుంది, కొంచెం సేపు పడుకొంటాను”.. అంటూ విసురుగా క్రికెట్ బాట్ పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు వాసు. ఈ రోజు మ్యాచ్ వుంది సాయంత్రం వరకు రాను అన్న కొడుకు గంటకే ఇలా వచ్చేయటం కలవరపరిచింది. కాఫీ కలుపుకొని వాడి గదిలోకి వెళ్ళాను.. పడుకోకుండా అసహనంగా కదులుతున్నాడు. పక్కన కూర్చొని “ఏమైంది నాన్న ? ఎందుకు డిస్టర్బెడగా వున్నావు ?” అని లాలనగా అడిగాను.. అంతా ఆ ప్రవీణ్ గాడి వల్లేనమ్మ, […]

కంభంపాటి కథలు – పోస్టు

రచన: కంభంపాటి రవీంద్ర పద్మకి భలే చిరాగ్గా ఉంది. ఉదయాన్నే తన ఫ్రెండు వసుధ ఫోన్జేసి, ‘ఏమిటే.. నిన్న నీ పుట్టిన్రోజా?.. ఏదో అనాధాశ్రమంకి వెళ్ళి సెలెబ్రేట్ చేసుకున్నారటగా..ఫేస్బుక్ లో చూసేను.. ఎనీవే…. నువ్వు సూపెరేహే.. ఆఁ అన్నట్టు చెప్పడం మర్చిపోయేను.. లేటుగానైనా లేటెస్టుగా చెప్పేస్తున్నాను.. హ్యాపీ బర్త్డే ‘ అని ఫోనెట్టేసింది. అసలు తనకి చిన్నప్పటినుంచీ పెద్దగా పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకునే అలవాటు లేదు కానీ తన భర్త కిరణ్..’మన పెళ్ళయ్యేక ఇది నీ మొదటి […]

జీవిత లక్ష్యం

G.S.S. కళ్యాణి ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్నాతకోత్సవం జరుగుతోంది. వినోదిని, గిరిజలకు సమానమైన మార్కులు వచ్చి, ఆ ఏడు నిర్వహించిన పెద్ద పరీక్షల్లో ఇద్దరూ ప్రధమ స్థానంలో నిలిచారు. వారిని స్టేజి పైకి ఆహ్వానించి బంగారు పతకాలతో సత్కరించారు విశ్వవిద్యాలయం యాజమాన్యంవారు. ఆ తర్వాత, విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ తోపాటు కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిధులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు ఇచ్చారు. కార్యక్రమం చివర్లో వినోదిని, గిరిజలను మళ్ళీ స్టేజి పైకి పిలిచి వారి జీవిత లక్ష్యాల […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 55

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య కీర్తన: పల్లవి: పాపపుణ్యముల రూపము దేహ మిది దీని- దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు ॥పల్లవి॥ చ.1 అతిశయంబైన దేహభిమానము దీర గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు మతిలోనిదేహభిమానంబు విడుచుటకు రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు ॥పాప॥ చ.2 సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగాని అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు ॥పాప॥ (రాగం: పాడి; సం: 1- 28 – రాగిరేకు –4-8) విశ్లేషణ: పల్లవి: పాపపుణ్యముల రూపము […]