April 19, 2024

వంటలేనా? కాసిని నవ్వులు కూడానూ

సమీక్ష: వారణాసి నాగలక్ష్మి ‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కబుర్లు’ అంటూ సంధ్య యల్లాప్రగడ గారు కబుర్లనీ వంటల్నీ కలిపి కదంబ మాలలా అందించిన పుస్తకం చదువుతుంటే పెళ్లి పందిట్లో విందు భోజనం ఆరగిస్తున్నట్టనిపించింది. మధ్యమధ్యలో ఆమె విసిరిన చెణుకులు వేడి వేడి పుణుకుల్లా కరకరలాడాయి. పుట్టింట్లో మడీ దడీ వల్ల- పెళ్లై వెళ్లేదాకా ఏ వంటా రానిస్థితి నుంచి, ఎన్నో రకాల వంటలు నేర్చుకోవడమే కాక తేలిగ్గా చేసుకోగలిగేలా, వెంటనే చేసి చూడాలనిపించేలా చవులూరించే […]

అచంచల విశ్వాసము, ప్రయత్నము, దైవము. – దైవంతో నా అనుభవాలు

సమీక్ష: కూర చిదంబరం ఒకనాడు రామకృష్ణ పరమహంసగారిని ఒక సందర్శకుడు అడిగాడట. “అయ్యా! మీరు భగవంతుడిని చూసారా?” అని. అందులకాయన జవాబిస్తూ, ” చూసాను. నేను నిన్ను ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నానో, అంత స్పష్టంగా చూడగలుగుతాను” అన్నాడట. భగవంతుడు తన యెడ అచంచల విశ్వాసము, పట్టుదల కలవారికి నాడూ, నేడూ తన ఉనికిని చాటుతూనే ఉన్నాడు. సైన్సుకు అందని, ఎన్నో అద్భుతాలు చూపుతూనే ఉన్నాడు. అట్లాంటి అద్భుతాలను, అనుభవాలను వెంకట వినోద్ పరిమి అనే ఈ గ్రంధకర్తకు […]

చెరగని బాల్యపు పద చిహ్నాలివి

సమీక్ష: క్రాంతి శివరాత్రి పుట్టినూరు కన్నతల్లితో సమానమంటారు. పుట్టినూరును వదిలేసిన జీవితం తెగిన గాలిపటమైపోతుందంటారు. ఊరు మారినవాడి పేరూ, గీరు అన్నీ మారిపోతాయంటారు. ఇవన్నీ ఏమో గానీ, ‘సొంతూరి’ పేరు వినగానే మాత్రం ఓ కెరటమేదో మనసుని చల్లగా తాకుతుంది. అది, వెంటనే మన మధురమైన బాల్యాన్ని గుర్తుకు తెప్పిస్తుంది. మన మీద ఏ బరువులు మోపని ఆ చిన్నతనాన్ని తలచుకొని ఆనందపడేలా చేస్తుంది. ఒకప్పటి ఇరుకు ఇల్లే గానీ, కడు పేదరికం తో బతికిన రోజులే […]

విదేశ విహార యాత్రలు నాతో చేద్దాం రండి … మలేషియా

రచన: నాగలక్ష్మి కర్రా ఇవాళ పినాంగ్ వాతావరణం యెలా వుంటుందో తెలుసుకుందాం . ఈ ద్వీపంలో ప్రతీ రోజు సాయంత్రం వాన పడుతుందంటే ఆశ్చర్యం కదూ కాని ఇది నిజం. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33డిగ్రీలు కన్నా ఎక్కువకి చేరుకోవు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలకు తక్కువకావు. రోజూ వాన పడడం వల్ల పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పినాంగ్ లో తప్పకుండా తినవలసిన పండ్లు చిన్న అరటిపండ్లు, ఇవి చాలా రుచిగా వుంటాయి. రంబుతాన్ ( […]

గరుడ పురాణం

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు అష్టాదశ (18) మహా పురాణాల్లో గరుడ పురాణము ఒకటి. దీనికి గరుడ పురాణాము అని పేరు రావటానికి కారణము ఇది పక్షులకు రాజు అయిన గరుడుడికి శ్రీ మహావిష్ణువుకు జరిగిన సంభాషణ,ఈ గరుడ పురాణములో 19000 శ్లోకాలు ఉంటాయి.దీనిని సాత్విక పురాణాముగా వర్ణిస్తారు. ఈ పురాణము శ్రీ మహావిష్ణువు అవతారాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా భూమి పుట్టుక భౌగోళిక స్వరూపాలను భూమి మీద సృష్టి మొదలైన అంశాలను వివరిస్తుంది. ఈ పురాణములో […]

తపస్సు – మట్టి భూమి

రచన: రామా చంద్రమౌళి అతను అప్పుడు పోస్ట్‌ గ్రాడ్యుఏట్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ‘ రివర్స్‌ ఇంజినీరింగ్‌ ’ టాపిక్‌ బోధిస్తున్నాడు మట్టిలోనుండి ‘ ప్లాస్టిక్‌ ’ అనే విష పదార్థాన్ని తయారుచేసి మళ్ళీ ‘ ప్లాస్టిక్‌ ’ ను మట్టిగా మార్చలేకపోవడం గురించీ చెబుతున్నాడు మనిషి తన రూపంలో మార్పు చెందకుండానే మృగంగా మారగల మార్మిక విద్యను ఎలా నేర్చుకున్నాడో గాని మళ్ళీ మనిషిగా రూపొందలేని నిస్సహాయత గురించి కూడా చెబుతున్నాడు – అప్పుడు .. ఆ […]

ఆహా! ఏమి రుచి… సరదాగా కాసేపు

రచన : శుభశ్రీ అశ్విన్ పాకశాస్త్రంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు…మన మగువలందరూ వంటగదిలోకి ఒక్కసారి పరకాయప్రవేశం చేశారంటే ఇక వేరే చెప్పాలా!! వాళ్ళు చేసే వంటల ఘుమఘుమలు ఆ వీధి వీధంతా ఘుమాయించాల్సిందే!! అటువంటి ఒక పాకశాస్త్ర నిపుణురాలు తన గురించి తను సరదాగా పాడుకుంటున్న ఒక పాట.. పేరడీ పాట : ఆహా ఏమి రుచి!! @ ఎగిరే పావురమా సినిమా ఆహా ఏమి రుచి అనరా మైమరచి…. నేనే గరిట […]

మనిషి లోని మహర్షి.

రచన – మోహన మణికంఠ ఉరిటి(మణి) మనిషి దాగనీయకుమా నీలో ఉన్న మహర్షిని.. రంగుల ప్రపంచాన్ని చూస్తూ, నీలో ఉన్న రారాజుని నిద్రలోనే ఉంచితివి. ఆనందం కోసం పరిగెడుతూ నీ ఆత్మారాముడిని ఆదమరిచితివి ప్రేమికుల ప్రేమకోసం పరితపించే నీవు, నిన్ను నీవూ ఏనాడైన ప్రేమించుకున్నావా? పురాణతిహాసాల్లో వర్ణించిన వారితో పోల్చితే, నీలో ఉన్నవాడు రాముని కంటే ఆజానుబాహుడు, కృష్ణుడి కంటే కొంటె వాడు, బుద్ధుడి అంతటి సిద్ధుడు, అల్లాకి అనుచరుడు, ఏసు, ఈశ్వరయ్యలంత కారుణ్యుడు. నిన్ను నీవూ […]

జ్ఞాపకాలు

రచన: చౌటపల్లి. నీరజ చంద్రన్ వేదించే మదికి నివేదించే నివేదనలు జ్ఞాపకాలు గడచిన కాలానికి మిగిలే గురుతులు జ్ఞాపకాలు వాడని సుమాల సుగంధపు పరిమళాలు జ్ఞాపకాలు గతాన్ని గుర్తుచేస్తూ వాస్తవంలో వర్తమానాలు జ్ఞాపకాలు కలతల ‘కల’వరానికి స్వాంతనిచ్చే ‘స్వ’గతాలు జ్ఞాపకాలు వేకువ పిలుపులో తొలిపొద్దు సంతకాలు జ్ఞాపకాలు అమృతాన్ని వర్షించే అక్షరలక్షల కన్నియలు జ్ఞాపకాలు నవ్వుల సంతకాల వెన్నెల తుణీరాలు జ్ఞాపకాలు చెలిమితో చేరిన వెన్నెల్లో ఆడపిల్లలు జ్ఞాపకాలు తరగని నిధుల పెన్నిధి భాండాగారాలు జ్ఞాపకాలు భావాలకు […]

మసి బారుతున్న మోములు

రచన: కమల ‘శ్రీ’ ముద్దు ముద్దు మోములతో సున్నితమైన బుగ్గలతో ముచ్చట గొలిపే చిన్నారులు అమ్మ ఆలనా నాన్న పాలనా కరువై గుప్పెడు పొట్ట నింపుకోడానికి బాలకార్మికులైనారు సున్నితమైన వారి చేతులు పనిముట్లు పట్టుకుని రాటుదేలిపోతున్నాయి మెత్తటి వారి పాదాలు వేసుకోడానికి చెప్పులే లేక బొబ్బలేక్కుతున్నాయి కడుపునిండా తిని ఎన్నిరోజులు అయినాయో పొట్ట వెన్నుకి అంటిపోయింది వంటి నిండా వేసుకోడానికి బట్టలే లేవు తైల సంస్కారం లేని దుమ్ము పట్టిన జుట్టు పెన్ను పట్టుకొని రాయాల్సిన వారి […]