May 26, 2024

నేటి యువత

రచన: కొత్తపల్లి మంత్రినాథరాజు

సాప్ట్ వేర్ యుగంలో
యువతంతా
కంప్యూటర్లోకి జారిపోయి
డాలర్లకు వ్రేలాడుతూ

మానవ సంబంధాలకు
యాంత్రికత వేపు
పరుగులు పెట్టిస్తూ

పులుముకున్న నవ్వులు
మలుపుకున్న మాటలు
సహజత్వాన్ని మ్రింగేస్తూ

అన్న వస్త్ర సాంప్రదాయాలను
ఫాస్ట్ పుడ్డులకు
గాజు గదులకు అంకితమిస్తూ

పల్లెలకు
పిల్లల్లా కాక
బొమ్మల్లా వస్తూ, పోతూ

కాలువ గట్లనూ
ఏటి గుట్టలనూ
ఆస్వాదించ లేకపోతూ

పొలం పనిముట్ల
హార్డు వేరునూ
పలకరించలేని తనంతో

అన్నం పెడుతున్న
రైతు వేర్లను పలకరించే
తీరిక లేక
జారిపోతున్న యువ తరమా!
మీ అడుగులు రైతుతో వేస్తే
దేశ మనుగడపై
రైతు వేర్లు విస్తరిస్తై.

1 thought on “నేటి యువత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *