March 28, 2023

శిఖరాగ్ర సమావేశం (కథ)

రచన: మణి గోవిందరాజుల గదిలో పడుకుని తీరిగ్గా పుస్తకం చదువుకుంటున్నది శోభన. అత్తగారు తులసీ వాళ్ళ స్నేహితులూ కిట్తీ పార్టీ చేసుకుంటున్నారు. తాను కూడా ఇప్పటివరకు అక్కడే ఉంది. తంబోలా కాసేపు, బాల్ ఆట కాసేపూ ఆడాక, అత్తగారు, “శోభనా వెళ్ళి కాసేపు నడుము వాల్చమ్మా” అన్నారు. మిగతా అందరూ కూడా “అయ్యో! ఇంత సేపు కూర్చున్నావు. ఇప్పటికే నడుం పట్టేసి ఉంటుంది. పడుకోమ్మా” అన్నారు. వాళ్ళన్నారని కాదు కానీ తొమ్మిదో నెల బొజ్జలో బుజ్జిగాడు గందరగోళం […]

కొత్త కోణం (కథ)

రచన: ప్రభావతి పూసపాటి “మనం నా పరీక్షలు అయిపోయిన వెంటనే వూరు వెళ్లిపోదామే అమ్మమ్మ” కాలేజీ నుంచి వస్తూనే వత్తులు చేసుకొంటున్న కృష్ణవేణి పక్కన కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి గారంపోతూ చెప్పింది స్నిగ్ధ. . “ఏమి ఉన్నట్టు ఉండి గాలి వూరు మీదకి మళ్లింది, బావ ఏమైనా ఫోన్ చేశాడా? వత్తులు చేసుకొంటూనే అడిగింది. అదేమీ లేదులే. పరీక్షలు అయిపోయాక ఇంకా ఇక్కడ మనకి పనేమీ ఉందని అన్నాను అంతేలే, […]

జ్ఞాపకాల బాటలో (కథ)

రచన: జి.వి.ఎల్ నరసింహం “కామూ, ఓ మెత్తని గుడ్డ…, పాతది…,ఏదైనా ఉందా.” పీపుల్స్ బేంకులో, ఉన్నతాధికారిగా పనిచేసి, ఇరవై మూడు సంవత్సరాల క్రితం, రిటైరయిన విశ్వనాధం, వంటింట్లోని భార్యకు వినిపించేటట్లు, వేసిన కేక. “వాటికేం భాగ్యం. మీవే ఉన్నాయి. నిన్న, స్టీలు గిన్నెలు వాడు పుచ్చుకోనివి, ఒకటో, రెండో, పాత పంచలు. ఇంతకూ, దేనికేమిటి.” కామాక్షి, ప్రశ్నను జోడించి ఇచ్చిన జవాబు. “ఈ ఆల్బమ్స్ అన్నీ ధూళి పట్టిపోయేయి. వాటిలో చాలా పాత ఫోటోలు కూడా ఉన్నాయి. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 56

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది ఒక సంస్కృత కీర్తన. చివరలో వెలిగోట కేశవ! అనడంలో కడప జిల్లాలోని వెలిగోడు లో ఉన్న చెన్నకేశవ స్వామిని గురించి వ్రాసిన కీర్తన అని చెప్పవచ్చు. మహావిష్ణువు కేశి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల కేశవుడు అయ్యాడు. ఈ కీర్తనలో అన్నమయ్య స్వామిని బహుదా అనేక విశేషణాలతో కీర్తిస్తున్నాడు. మనమూ విని తరిద్దాం. కీర్తన: పల్లవి: కేవల కృష్ణావతార కేశవా దేవదేవ లోకనాథ దివ్యదేహ కేశవా ॥పల్లవి॥ చ.1. కిరణార్క కోటి […]

తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు.. కొన్ని శిథిల శబ్దాలు

రచన: రామా చంద్రమౌళి గాయపడ్డ గాలి రెక్కలను చాచి వృక్షం నుంచి వృక్షానికి పునర్యానిస్తూ , స్ప్సర్శిస్తూ, సంభాషిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్న ఆకాశంలోకి అభిక్రమిస్తున్నపుడు కాలమేమో మనుషుల కన్నీళ్ళను తుడుస్తూ తల్లిలా ద్రవకాలమై, ద్రవధ్వనై, ద్రవాత్మయి, చినుకులు చినుకులుగా సంగీత నక్షత్రాలను వర్షిస్తూ అరణ్యాలపై, ఎడారులపై, సముద్రాలపై, పాటలను కురుస్తూ వెళ్తూంటుంది.. తన కొంగు అంచులు జీరాడుతూండగా సెకన్‌లో మిలియన్‌ వంతు ఒక రసానుభూతి.. తన పూర్ణవెన్నెల రాత్రయి వికసిస్తూనే చకచకా శతాబ్దాల చరిత్ర పుటల్లోనుండి పాదముద్రలనూ, […]

విదేశవిహారం చేద్దాం నాతో రండి( మలేషియా) (జెంటింగ్ హైలెండ్స్ )

రచన: నాగలక్ష్మి కర్రా సాధారణంగా వేసవి విడుదులు అంటే ఎత్తైన కొండలమీద వుండే ఊళ్లు, మనం మనకి నచ్చిన హోటల్స్ లో దిగి చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకొని విశ్రాంతి తీసుకొని వచ్చెస్తాం. ఇలాంటివే మనకి అనుభవంలోవున్నాయి, కాని మొత్తం కొన్ని వేల ఎకరాల స్థలంలోవున్న రిసార్ట్స్‌ని వేసవి విడిది అని అనొచ్చా? అన్ని రకాల వినోదాలు, హోటల్స్, రెస్టోరాంట్స్, పార్కింగులతో సహా ఒక నిజ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో వుండడం ఇదే మొదటిదేమో లేక నాకు తెలిసి […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2021
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728