June 25, 2024

మాలిక పత్రిక మార్చ్ 2021 సంచికకు స్వాగతం..

Jyothivalaboju Chief Editor and Content Head అందరికీ ఉల్లాసభరితమైన శుభాకాంక్షలు. ఎందుకు ఉల్లాసం అంటారా.. కరోనా వాక్సిన్ వచ్చేసింది. ఈ కార్యక్రమం కూడా జోరుగా  సాగుతోంది. కొన్నిచోట్ల భయాలు ఉన్నా, ఒకరు ఒకరుగా వెళ్లి వాక్సిన్ వేయించుకుంటున్నారు. సంవత్సర కాలంగా ప్రపంచమంతా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. కాని ఇప్పుడిప్పుడే కోలుకునే దిశలో పయనిస్తున్నారు.. ఖచ్చితంగా ఇది అందరికీ గుణపాఠం లాటిదే. ఒకవైపు వేలమంది ప్రాణాలు కోల్పోయారు, మరొకవైపు తక్కువ ప్రాణనష్టం జరిగినందుకు సంతోషపడుతున్నారు. వాక్సినేషన్ పెరిగి, నష్టాలు […]

రాజీపడిన బంధం –13

రచన: కోసూరి ఉమాభారతి కార్ పార్క్ చేసి, “పదమ్మా” అంటూ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ వైపు నడిచారు ఆనంద్. గజిబిజిగా అయిపోయిన మనస్సు, తడబడుతున్న కాళ్ళు, నీరసించిపోతున్న ఆలోచనలని కూడదీసుకొని పరుగులాంటి నడకతో అనుసరించాను. మా కోసమే ఎదురు చూస్తున్న శ్యాం, చిత్ర మమ్మల్ని వెంటనే డాక్టర్ ఆఫీస్ లోకి తీసుకొని వెళ్లారు. అందరం ఆదుర్దాగా డాక్టర్ ఎదురుగా కూర్చున్నాము. డా. విద్య ఎక్సరేలని తదేకంగా చూస్తుంది. ఇక ఉండలేక, “నా సందీప్ కి ఏమయ్యిందో చెప్పండి […]

తామసి – 5

రచన: మాలతి దేచిరాజు మొహమ్మద్ ముష్తాక్ షాదీ ఖానా – (ముస్లిముల పెళ్ళి మండపం ) ఎలాంటి అలంకరణ లేదు భవనానికి. మెయిన్ గేట్ నుంచి భవనం లోపలికి వెళ్ళే దారి మాత్రం రంగురంగుల కర్టెన్లతో, పూలతో, చెమ్కీలతో (మెరుపుల మాలలు) అలంకరించి ఉంది. కింద పచ్చరంగు తివాచి పరిచి దానిపై పచ్చగడ్డి చల్లారు. బంధువుల హడావిడి, సమయం పగలు తొమ్మిది… మగ పెళ్ళివారు వచ్చి అప్పటికే అరగంట అయ్యింది. “ఆపా (అక్కా) ఛోటూ కో బులా […]

అమ్మమ్మ – 23

రచన: గిరిజ పీసపాటి ‘పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు మాత్రమే’ అనుకునే రోజులవి. తనకు కొడుకు పుట్టినా దక్కలేదు. కనుక, వియ్యంకుడికైనా మనవడు పుడితే బాగుండునని అమ్మమ్మ ఆరాటం. అంతే తప్ప ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఎంత మాత్రమూ కాదు. నాగ తోడికోడలికి కూతురు పుట్టిన ఏడు నెలలకు నాగ మళ్ళీ గర్భవతి అయిందని వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మమ్మకి. మళ్ళీ అమ్మమ్మకి హడావుడి మొదలైంది. ఈసారి తొమ్మిదవ నెలలో రాముడువలస వెళ్ళి, […]

చంద్రోదయం 13

రచన: మన్నెం శారద అతని కళ్ళు మసకబారుతున్నాయి. చీకటిని మింగుతోన్న సముద్రం నల్లగా మారుతోంది. అతని కళ్లనుంచి రెండు వేడి కన్నీటి బొట్లు జారిపడ్డాయి. ఇప్పటికే శేఖర్‌కి తానన్ని విభాగాలుగా రుణపడిపోయి వున్నాడు. ఇంకా అతన్ని స్నేహం పేరుతో దోచలేడు. శేఖర్ మనస్ఫూర్తిగా స్వాతిని ఇష్టపడుతున్నాడు. పెళ్ళికూతుర్ని చూసి వచ్చిన దగ్గర నుంచి ఊహాలోకంలో తేలిపోతున్నాడు. అలాంటి శేఖర్‌కి నిజాన్ని చెప్పి అఘాధంలోకి త్రోయలేడు. ఈ రోజు తను, తన వాళ్ళు ఇలా సుఖంగా బ్రతకటానికి అతనే […]

పడతీ! ఎవరు నీవు??

రచన: ఉమా వెంకట్ ఓ స్త్రీ నువ్వు మహిళగా ఓ కూతురిగా, అమ్మగా, తోబుట్టువుగా, భార్యగా, ప్రేయసిగా, స్నేహితురాలిగా అత్తగా, చెల్లిగా ఇలా అన్ని రూపాలు ఉన్న ఓ వనిత…. మహిళ గా నువ్వు ఎంతో చేయగలవు కానీ నువ్వు ఒక ఆడపిల్ల అని సమాజం గుర్తుచేస్తుంది, వెనుకకి లాగడానికి ముందు ఉంటుంది, కారణం సమాజంలో ఉన్న చీడ పురుగుల వల్ల ఆడదాని ఔనత్యాన్ని చాటి చెప్పే అవకాశం రాకముందే ఆడపిల్ల ఒకరికి భార్య గా మరొకరికి […]

కరోనా సరేనా. .

రచన: షమీర్ జానకిదేవి ఉదయం నిద్ర లేవక ముందే ఫోన్ మ్రోగింది. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తరువాత ఎప్పుడు మాట్లాడలనుకుంటే అప్పుడే. దీని వలన మంచి ఉందీ, అలాగే చెడుకూ దారి తీస్తుంది. భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాము. పాతరోజుల్లో ఐతే ఎదైనా సమస్య వచ్చినప్ఫుడు ఉత్తరాలు వ్రాసుకునేవారు. . అలా రాయటంలొ సగం పరిష్కారం దొరికేది. ఆవేశం కూడా తగ్గేది. ప్రొద్దునే ఫోను కూతురు దగ్గర నుండి. మళ్ళీ ఏ సమస్య వచ్చిందా అనుకుంటూ ఫోన్ ఎత్తింది […]