రచన: చంద్రశేఖర్

ఆబల కాదు సబల…
మహిళ కాదు వెన్నెల…
వనిత కాదు దేవత…

సూర్యుడి తొలి కిరణమల్లె భూమిని తాకే
మొగ్గల్లే పూసే
పువ్వల్లె విరిసే
పాదరసమల్లె పాకే
బోసినవ్వులు నవ్వే
చిలక పలుకులు పలికే
హంసల్లే నడిచే
వెన్నెలల్లే ఆడే
జింకల్లే పరుగులెత్తే
మయూరిలా నాట్యమాడే
ముద్దబంతిలా పైటవేసే
సరస్వతి అనుగ్రహం పొందే
ముత్యమల్లె నవ్వే
పెళ్ళికూతురిలా అలంకరించే
రాకుమారుడితో జోడు కట్టే
పుట్టింటి గారాలపట్టి మెట్టింట్లో దీపమై అడుగుపెట్టే
గోమాత సాధుగుణమే కలిగి ఉండే
భర్త, అత్త మామల సేవ చేసే
నదిలాగా పారే
సముద్రంలో కలిసే
పాపకు కనుపాపలా అమ్మ అయ్యే
దేవతలా ప్రేమామృతాన్ని పంచె
నక్షత్రమల్లే వెలిగే
చందమామను చుట్టే
మెరుపల్లె మెరిసే
వానల్లే కురిసే
మంచల్లే కరిగే
మగాడి జీవితానికీ వెలుగై నీవు
భూదేవంత ఓర్పే
కొవ్వొత్తిలా కరిగే
వెలుగును పంచె
అహర్నిశలు శ్రమించే
శిఖరమంత ఎత్తులో ఉండే
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే
దేవుడి దీపమల్లె కొండెక్కే

🌹🌹🌹
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *