రచన: అమ్ము బమ్మిడి

పది నెలలుగా భయపడుతూ
బయటకు కనపడని బడి
ఇయ్యాల కాస్త ధైర్యం తెచ్చుకుంది..

మహమ్మారి కోరలకు బలికాకుండా
తాళం వేసుకున్న బడి
ఇయ్యాల మళ్ళీ తెరుచుకుంది..

ఏడాదిగా ఎవరినీ రానివ్వకుండా తల్లడిల్లిన బడి
ముంగిట్లో చిన్నారులను
ఇయ్యాల ముద్దుచేసి ఆహ్వానిస్తోంది..!!

ఇన్నాళ్లుగా చీకట్లో మగ్గిన గది
తలుపులు తీయగానే
ఇయ్యాల మళ్ళీ ఊపిరి తీసుకుంది..!!

నెలల తరబడి బోసిపోయిన బడి
చిన్నారుల నవ్వులు చేరగానే
ఇయ్యాల మళ్ళీ కళకళలాడుతోంది..!!

ఒంటరిగా మూగబోయిన గంట
పసివాళ్ల కేరింతలు వినగానే
ఇయ్యాల మళ్ళీ గనగణమని మోగింది!!

సీతాకోకచిలుకలా ఒక్కొక్కరు వచ్చి వాళుతుంటే..
బడి అవరణ మళ్ళీ కొత్తగా
అక్షరాలను పురుడుపోసుకుంది..!!

మోడువారిన చెట్టును వసంతం చేరదీసినట్టు
వదిలెళ్లిన బాలలు ఒడి చేరుతుంటే
ఇయ్యాల బడికి మళ్ళీ పండగొచ్చింది..!!

By Editor

One thought on “బడికి పండగొచ్చింది..!!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *