March 4, 2024

మనసు ఖాతా

రచన: శైలజా విస్సంశెట్టి ‘ఏమో వసంతక్క నాకేమీ అర్ధం కావటం లేదు జరుగుతున్నదంతా కల అయితే బాగుండు అనిపిస్తోందక్కా’. నేను చిత్రా వాళింటికి వచ్చిన ఈ గంట సేపటినుంచి పది సార్లు అయినా అని ఉంటుంది. చిత్ర మా పెద్దమ్మ కూతురు. ఇద్దరం ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. ఇద్దరి అత్తవారి ఊరు కూడా ఒక్కటే కావటం మూలంగా మా చుట్టరికం, స్నేహం అలాగే నిలిచి ఉన్నాయ్ పిల్లలు పెళ్లీడుకు వచ్చినా కూడా. చిత్రని […]

మరో బాల్యం

రచన: రమ్య “ఏంటి? మీ అమ్మ వచ్చి మనింట్లో ఉంటుందా? ఆ మెడికల్ చెకప్ లు, హాస్పిటల్ మందుల వాసనలు . . అబ్బో. . నా వల్ల కాదు ఆవిడని భరించడం” అని నిక్కచ్చిగా చెప్పింది నవ్య. “అదేంటి నవ్య అలా అంటావు అమ్మ ని హాస్పిటల్ కి నేనె తీసుకెళ్తున్నా కదా నీకొచ్చిన ఇబ్బందేంటి మా అమ్మ రావడంలో” అని అడిగాడు వినయ్. “ఇబ్బంది ఏంటా? ఆవిడేమన్నా నాకు వండి వార్చి సహాయం చేయడానికి […]

మగువ మరో కోణం

రచన: రాజ్యలక్ష్మి బి రాజ్యం, లక్ష్మి కలిసి ఒకే బళ్లో హైస్కూల్ దాకా చదువుకున్నారు. పక్క పక్క యిళ్ళు. యిద్దరూ అన్యోన్యంగా వుండేవాళ్లు. రాజ్యానికి చదువంటే యిష్టం. ముఖ్యంగా గణితం అంటే బాగా యిష్టం.. పెద్దయ్యాక గణిత ఉపాధ్యాయినిగా స్థిరపడాలని నిర్ణయించుకుంది. యింట్లో వాళ్లకు చెప్పేసింది కూడా. లక్ష్మికి చదువు మీద పెద్ద మోజు లేదు. ఏదో చదవాలి కాబట్టి చదువుకుంటున్నది. సంగీతం అంటే ప్రాణం. అందుకు తోడు గాత్రం కూడా బాగుంటుంది. కాలం పరుగెత్తింది. రాజ్యం […]

వారధి

రచన: ప్రభావతి పూసపాటి “ రావులపాలెం దిగేవాళ్లెవరో ముందుకిరండి” కండక్టర్ అరుపు తో బస్సులో నిద్దరోతున్నవాళ్ళుఅంతా ఉలిక్కిపడి సర్దుకొని కూర్చున్నారు. నెమ్మదిగా తెల్లవారుతోంది. కిటికీలోనుంచి పచ్చని పంటపొలాలని చూస్తూ రవి పుణ్యమా అని ఇన్నాళ్ళకి మళ్ళి ఇలా సొంతవూరు రాగలిగాను స్వగతంగా అనుకొంది జానకి. “నువ్వే అమ్మకి నచ్చచెప్పగలవు అత్తయ్య ” రవి పదే పదే పోరుపెట్టి ప్రయాణం చేయించాడు. రావులపాలెం దగ్గర చిన్న పల్లెటూరు లో వుంటున్నారు మా అన్నయ్య, వదిన.. రవి మా అన్నయ్య […]

లోకులు

రచన: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం “ఏమైంది సరళా! పొద్దున్న హడావిడిగా బయలుదేరి వెళ్ళావు. ముఖం వడలిపోయి నీరసంగా కనబడుతున్నావు.” మూడువందల పదో నంబరు ఇంటి ఇల్లాలిని పలుకరించింది అదే అంతస్థులో మూడువందల అయిదులో వుంటున్న కావేరి. “ఇదే అంతస్థులో లిఫ్ట్ పక్కన వున్న ఇంట్లో పదేళ్ళు వుండి, స్వంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయిన కమల వాళ్ళింటికి వెళ్ళి వస్తున్నా. పాపం. చిన్న వయసులోనే ఘోరం జరిగిపోయింది. పచ్చగా వున్న దంపతులను చూసి ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో. నలభై అయిదేళ్ళకే […]

ట్రాఫిక్ కంట్రోల్

రచన: మణి గోవిందరాజుల అప్పటికీ జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తున్న వరుణ్ ఎదురుగా వస్తున్న కార్ ని గమనించి పక్కకు తప్పుకు పోయేలోగానే అది తన కార్ ని కొట్టినంత పని చేసి అదే స్పీడ్ తో వెళ్ళిపోయింది. కాసేపటిదాకా గుండె దడ తగ్గలేదు వరుణ్ కి. రోజూ ఇదే తంతు. ఇది వన్వే అయినా ధైర్యంగా వెళ్ళడానికి లేదు. పైనుండి ఆపోజిట్ రాంగ్ సైడ్ లో వస్తున్న వాళ్లేమో కొద్దిగా కూడా తగ్గకుండా ధైర్యంగా వస్తారు. కనీస […]

అజ్ఞాతం వీడింది

రచన: కొత్తపల్లి రవికుమార్ “స్వప్నా! మనం కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ‘అజ్ఞాతం వీడింది’ అనే వీక్లీ ప్రోగ్రామ్ కి నిన్ను చీఫ్ ని చేస్తున్నాను. ఇది ఎప్పటి నుండో చేద్దామనుకున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ సరైన మనిషి దొరక్క ఆ ప్రాజెక్ట్ ని ఇప్పటి దాకా స్టార్ట్ చేయలేదు. ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన ప్రాజెక్ట్. మన మధ్యే ఉంటూ అసమాన ప్రతిభా వంతులుగా మారి, అందరికీ ఆదర్శమై మరల కనుమరుగైన వారిని వెతికి […]

చీకటైన జీవితం

రచన: కస్తల పద్మావతి “అక్కా, అక్కా ఆకలి అంటూ స్కూల్ నించి వచ్చి బ్యాగులు పక్కన పెట్టి, సుశీలను వెతుకుతూ ఇల్లంతా కలియ తిరుగుతున్నారు సుశీల చెల్లి, తమ్ముడు. సుశీలది మధ్య తరగతి కుటుంబం. తల్లి చనిపోవడంతో స్కూల్ ఫైనల్ అయిపోయిన సుశీల ఇంట్లోనే ఉంటోంది. చెల్లిని తమ్ముడిని చూసుకుంటూ, ఇంటిపని, వంటపని చేసుకుంటూ , కాలక్షేపానికి నవలలు చదువుతూ ఉంటుంది. ఒక చిన్న ఫాక్టరీలో పని చేసే సుశీల తండ్రిది షిఫ్ట్ డ్యూటీ . ఒక […]

తపస్సు – గుహలో వెలుగు

రచన: రామా చంద్రమౌళి ఈ హిమశిఖరంపై.. ఐదువేల అడుగుల ఎత్తులో వీళ్ళేమి చేస్తారో తెలియదు ఆకాశంలో అక్కడక్కడా నక్షత్రాలవలె ఈ అఖండ పర్వత శ్రేణుల ఏటవాలు తలాలపై ఎన్ని కుగ్రామాలో పదిహేను ఇండ్లు ఒక ఊరు నాల్గు కుటుంబాలే ఒక గ్రామం పదిమంది మనుషులే ఒక సమూహం.. ఒక కుటుంబం తోడుగా ఒక విశాలాకాశం, ఒక పర్వతం, కొంత పచ్చని గడ్డి నిట్టనిలువుగా లంబరేఖల్లా నిలబడ్డ చెట్లు – పర్వతం ఉన్నదీ అంటే ప్రక్కన ఒక లోయ […]

అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు అనాదిగా హిమాలయాలలోని మానస సరోవరములో కైలాస గిరి ప్రదక్షిణ అరుణాచలంలోని ( తిరువణ్ణామలై తమిళ్ నాడు) గిరిప్రదక్షిణ ఏంతో భక్తి శ్రద్దలతో చేయటము మనము చూస్తున్నాము వింటున్నాము. తిరువణ్ణామలైలో ఆలయానికన్నా ముందే యుగాల క్రిందట మహేశ్వరుడు స్వయముగా మహా పర్వత రూపములో వెలిస్తే ఆ తరువాతి కాలములో పర్వత పాదాల వద్ద ఆలయం నిర్మించినా మొట్టమొదటి ప్రాధాన్యత ఆ పర్వతానిదే. ఈ మధ్య కాలములో ఇంద్రకీలాద్రి సింహగిరి పర్వతాల చుట్టూ కూడా […]