April 19, 2024

దైవంతో నా అనుభవాలు పుస్తకం మీద ఒక అభిప్రాయం

రచన: డా. లక్ష్మీ రాఘవ. ఒక పుస్తకం కొనడానికి కానీ చదవడానికి కానీ మొదట పాఠకుడిని ఆకర్షించేది శీర్షిక, ఆపైన ముఖచిత్రం. తరువాత మనసులో నిలిచిపోయేది పుస్తకంలోని విషయాలు. అవి మన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తే, అది కలకాలం మనసులో నిలిచిపొయే పుస్తకం. అలాటిదే వెంకట వినోద్ పరిమిగారి ” దైవంతో నా అనుభవాలు” ఇందులో ఆయన అనుభవాల మాలలు! నిజంగా అందులోని ప్రతిపూవూ ఆఘ్రాణించ తగినదే! దేవుడి మీద నమ్మకం వుంటే మనకు జీవితంలో […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 57

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య కీర్తన: పల్లవి: జీవుఁడ నేనొకఁడను సృష్టికిఁ గర్తవు నీవు యీవల ధర్మపుణ్యములివివో నీచేతివి॥పల్లవి॥ చ.1.పుట్టినయట్టి దోషాలు పురుషోత్తమా నీవు పట్టి తెంచివేయక పాయనేరవు గట్టిగా సంసారములోఁ గలిగిన లంపటాలు ముట్టి నీ వల్లనేకాని మోయరావు ॥జీవుఁ॥ చ.2.పంచభూత వికారాలు పరమాత్ముఁడా నీవే కొంచక నీయాజ్ఞఁగాని కొద్ది నుండవు అంచెల జగములోని ఆయా సహజములు వంచుక నీవల్లఁగాని వైపుగావు ॥జీవుఁ॥ చ.3.చిత్తములో విజ్ఞానము శ్రీవేంకటేశ నీవె హత్తించి చూపినఁగాని యంకెకురాదు సత్తుగా నిన్నిటికి నీశరణుచొచ్చితి […]

యాత్రా మాలిక – మలేషియా (కెమరున్ హైలెండ్స్ )

విదేశవిహారం చేద్దాం నాతోరండి- రచన: నాగలక్ష్మి కర్రా పినాంగ్ లో ప్రొద్దుట బయలుదేరి సాయంత్రానికి వచ్చేటట్టుగా వుండే ప్రదేశాలు పూర్తి చేసుకున్నాక శనివారం ప్రొద్దుటే బయలుదేరి వెళ్లి ఆదివారం రాత్రికి తిరిగి వచ్చేటట్టుగా వుండే ప్రదేశాలు చూడడానికి వెళ్లేవాళ్లం అలాంటి ప్రయాణం పెట్టుకొనేటప్పుడు ముందుగా రూము బుక్ చేసుకోవలసి వచ్చేది. ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్లి రూము దొరకక తిరిగి వెనక్కి రావలసి వచ్చింది. అప్పటినుండి బుద్దిగా ముందుగా రూము బుక్ చేసుకొని వెళ్లేవాళ్లం. మలేషియా లో […]

ముదిత

రచన: డా. అర్చన ఆచార్య కన్నీరు ఇంకింది, మనసు మోడు వారింది నవ్వులో నిర్వేదం, నిండుగా నిండింది పుట్టింట రాణినైతి మెట్టింట జాణనైతి దృష్టికొక కోణమైతి విలువలేని వీణనైతి తింటివా అని అడిగేవారు లేక మిన్నకుంటివా అని ఓదార్చేవారు రాక మాటల అస్త్రాలు.. నిందల శస్త్రాలు అహాల మొహాలు.. అధికారాల దాహాలు మనసు పొరల తొక్కిపెట్టి పంటి కింద నొక్కిపెట్టి బాధనంత దాచిపెట్టి మోమున చిరునవ్వు చుట్టి చేపట్టిన తన తోడుకు అమృతమందించాలని అలవోకగా హాలాహలం గ్రోలిన […]

ఆడపిల్ల అందమైన జీవితం

రచన: చంద్రశేఖర్ ఆబల కాదు సబల… మహిళ కాదు వెన్నెల… వనిత కాదు దేవత… సూర్యుడి తొలి కిరణమల్లె భూమిని తాకే మొగ్గల్లే పూసే పువ్వల్లె విరిసే పాదరసమల్లె పాకే బోసినవ్వులు నవ్వే చిలక పలుకులు పలికే హంసల్లే నడిచే వెన్నెలల్లే ఆడే జింకల్లే పరుగులెత్తే మయూరిలా నాట్యమాడే ముద్దబంతిలా పైటవేసే సరస్వతి అనుగ్రహం పొందే ముత్యమల్లె నవ్వే పెళ్ళికూతురిలా అలంకరించే రాకుమారుడితో జోడు కట్టే పుట్టింటి గారాలపట్టి మెట్టింట్లో దీపమై అడుగుపెట్టే గోమాత సాధుగుణమే కలిగి […]

జలపాతం

రచన: మణికంట ఉరిటి దివి నుంచి భువికి దిగివస్తున్న దేవకన్యలా ఉండే నీవు క్రింద పడిన కూడా ఎంత వేగంగా పరిగెత్త వచ్చు అని నిన్ను చూస్తే తెలుస్తుంది నీ తుంపర్ల తాకిడితో మనసు తామర పువ్వల్లే ఆనందంతో వికసిస్తుంది నీచెంత తడిచిన మరుక్షణంలో దేహం స్వర్గపు అంచులలో విహరిస్తుంది నీ ఝారీప్రవాహా వేగంతో మా మనసులో ఉన్న ఆలోచనలన్ని కొట్టుకుపోతాయ్ అదేమీ చిత్రమో ఆకలిని మైమరపించి, ఆహ్లాదాన్ని పంచే నీవు, ఈప్రకృతి అందాలలో అతి సుందర […]

బడికి పండగొచ్చింది..!!

రచన: అమ్ము బమ్మిడి పది నెలలుగా భయపడుతూ బయటకు కనపడని బడి ఇయ్యాల కాస్త ధైర్యం తెచ్చుకుంది.. మహమ్మారి కోరలకు బలికాకుండా తాళం వేసుకున్న బడి ఇయ్యాల మళ్ళీ తెరుచుకుంది.. ఏడాదిగా ఎవరినీ రానివ్వకుండా తల్లడిల్లిన బడి ముంగిట్లో చిన్నారులను ఇయ్యాల ముద్దుచేసి ఆహ్వానిస్తోంది..!! ఇన్నాళ్లుగా చీకట్లో మగ్గిన గది తలుపులు తీయగానే ఇయ్యాల మళ్ళీ ఊపిరి తీసుకుంది..!! నెలల తరబడి బోసిపోయిన బడి చిన్నారుల నవ్వులు చేరగానే ఇయ్యాల మళ్ళీ కళకళలాడుతోంది..!! ఒంటరిగా మూగబోయిన గంట […]

కన్నీటిచుక్కలు

రచన: శుభశ్రీ రాజన్ కన్నీటిచుక్కలు ఒకదానితో ఒకటి ఇలా మాట్లాడుకున్నాయి…. జీవితాన్ని బలపరిచే ఆలోచనలతో వచ్చే కన్నీటిచుక్కలు పునాదులవుతాయి.. ఊహించని సంతోషంతో వచ్చే కన్నీటిచుక్కలు ఆనందబాష్పాలవుతాయి.. మనసు బద్దలవడంతో వచ్చే కన్నీటిచుక్కలు మోసపోకు అని అప్రమత్తం చేస్తాయి.. కలయికతో వచ్చే కన్నీటిచుక్కలు కొత్త ఉత్తేజానికి దోహదపడతాయి.. కలలతో వచ్చే కన్నీటిచుక్కలు కాలంలో విజయాన్ని దాచిపెడతాయి.. కోల్పోవడాలతో వచ్చే కన్నీటిచుక్కలు జీవిత మార్గాన్ని సరి చేసి చూపిస్తాయి.. కఠోర శ్రమతో వచ్చే కన్నీటిచుక్కలు ఉన్నతి దిశలోకి తీసుకుపోతాయి.. జవాబులు […]

ప్రేమ బీజం

రచన: సునీత పేరిచర్ల ఓదార్పు ప్రేమగా మారుతుందని.. కల గన్నానా .. అలా కలగంటే.. అసలు దానిని నిజం చేసే దైర్యం చేసేదాన్నా…. ఎలా పడిందో మనసు మాగాణిలో ప్రేమ బీజం… గుర్తించేలోపే మొలకెత్తింది పెరికి పారేద్దాం అనుకుంటే నువ్వేమో ..నీ మాటల ఎరువుల్ని నవ్వుల నీళ్ళని వేసి దానిని మహావృక్షం చేసేసావ్… ఆ వృక్షం నీడలోనే సేద తీరుతూ భావాల్ని, బాధల్ని, సంతోషాల్ని పంచుకుంటూ ఉండగా ఏమైందో మెల్లగా కొమ్మలు నరకడం మొదలుపెట్టావ్.. చివరికి కాండంతో […]