June 19, 2024

తామసి – 6

  రచన: మాలతి దేచిరాజు   ఇంట్లో నసీమా,   అత్తగారు మాత్రమే ఉన్నారు. మామగారు తన కూతుర్ని చూడటానికి బందర్ వెళ్ళాడు.అత్తగారు భోంచేసి పడుకుంది ..నసీమా “మైదానం ” చదువుతోంది. జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో గాని ఇలా ఇంత తీరిక దొరకదు తనకి..ఇరవై రోజుల నుంచి చదువుతుంటే ఇప్పటికి ..క్లైమాక్స్ దగ్గరకొచ్చింది..”నా చేతి వేళ్ళు మీరా జుట్టు లో చొచ్చుకుపోయి ఉన్నాయి..” అని చదివింది టక్ …టక్..టక్ …అని తలుపు తడుతున్న శబ్దం. లేచి వెళ్లి […]

మాలిక పత్రిక ఏప్రిల్ 2021 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head Maalika Web Magazine మాలిక పత్రిక పదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది.. 2011 లో నాతోపాటు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ, వేగంగా నడుస్తూ, ఎన్నో ప్రయోగాలతో , కొత్తవారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ , అలరిస్తూ సాగుతోంది. దీనికి సహ రచయితలు, మిత్రులు, పాఠకుల ఆదరాభిమానాలు కూడా మెండుగా ఉన్నాయి.. నేను కూడా నేర్చుకుంటూ, మాలికతోపాటే ఎదుగుతూ పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటూ వస్తున్నాను. మీకందరికీ మాలిక తరఫున హృదయపూర్వక […]

“పడతి! ఎవరు నీవు?” కథలపోటి ఫలితాలు

అభినందనలు… శుభాకాంక్షలు… శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ , మాలిక పత్రిక సంయుక్త నిర్వహణలో “పడతీ! ఎవరు నీవు?” శీర్షికన కథల పోటి ప్రకటింపబడింది. ఈ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందకు పైగా కథలు వచ్చాయి… ముందుగా మేము ఉత్తమమైన 25 కథలను పుస్తకంగా అచ్చువేయాలి, రచయితలకు తలా రెండు కాపీలు ఇవ్వాలని అనుకున్నాము. కాని ఉత్తమమేమోగాని , చాలా మంచి కథలు ఎక్కువ రాలేదు. అందుకే పుస్తక ప్రచురణ వద్దనుకుని అయిదుగురికి […]

ఒకసారి చెప్తే అర్ధం కాదా!

రచన- మణికుమారి గోవిందరాజుల “ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను ఒక్కసారి చెప్పానంటే ఇక అంతే! సంతకాలు పెట్టెయ్యి” కోపంగా అరిచి బైటికి వెళ్ళిపోయాడు అక్షయ్. “ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా?” ఆ మాటలు చెవులో గింగురుమంటున్నాయి దీక్షకి.. “ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఆడపిల్లవు. ఇక నువు కూడా తయారయితే మేం బతకాలా వద్దా?” తన కంటే రెండే నిమిషాలు ముందు పుట్టిన సుదీప్ […]

“ఇంటర్నేషనల్ కల”

రచన: కవిత బేతి “అమ్మూ! పడుకుందాం రా” భోజనం టేబుల్ మీద పెట్టేసి, హాల్లో ఆడుకుంటున్న కూతురిని బెడ్రూములోకి లాక్కెళ్ళింది శివాని. అక్కడే కూర్చొని లాప్టాపులో చేస్తున్న పని ఆపి, ఓసారి నిట్టూర్చి, రెండుచేతులు తలపైన పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రవి. రవి ఆర్కిటెక్ట్. శివాని మేనమామ కూతురే. చిన్నప్పటినుండి కాదుగాని, ఇంటర్, డిగ్రీలలో ఉన్నప్పుడు మనసులు కలిసాయి. ఇరువైపులా అంగీకారంతో ఆనందంగా పెళ్లి జరిగిపోయింది. పచ్చని పల్లెటూరంత స్వచ్ఛమైన ప్రేమ శివానిది. ఒకరంటే ఒకరికి ప్రాణం. […]

చంద్రహారం.

రచన- కిరణ్మయి గోళ్లమూడి. “ఈ ఏడాది ఇల్లు సంగతి చూడు సూర్యం! గోడలు పెచ్చులూడిపోతున్నాయి! కాంపౌండ్ గోడ విరిగిపోయింది. నీకు చాలా ఖర్చు ఉంది!” అంది కౌసల్య కంచంలో మిరప పళ్ళ పచ్చడిలో కాచిన నెయ్యి వడ్డిస్తూ. “అవునమ్మా!.. పంట డబ్బు చేతికి వచ్చాక ఇల్లు బాగు చేయిద్దాం! ఉగాదికి రెడీ అయిపోతుంది!” అన్నాడు సూర్యం ముద్ద నోట్లో పెట్టుకుంటూ. “సున్నాలు వేసి కూడా ఆరేళ్ళయింది.” పాతబడి పోయి, వెలిసి పోయిన గోడలు చూస్తూ దిగులుగా అంది […]

రాజీపడిన బంధం – 14

రచన: ఉమాభారతి కోసూరి ఆరేళ్ళ తరువాత పొద్దునే పిల్లలకి టిఫిన్లు వడ్డిస్తుండగా, టీ.వి న్యూస్ ఛానల్ చూడమని ఫోన్ చేసింది చిత్ర. టీవి ఆన్ చేసాను. క్రీడారంగం వార్తలు చెబుతున్నారు… ‘…ఢిల్లీ స్విమ్మింగ్ కమిషన్ వారు, సందీప్ మధురై అనే యువ స్విమ్మర్ ని నేషనల్ జూనియర్ స్విమ్ టీమ్ కి కెప్టెన్ గా సెలెక్ట్ చేసారు. పదహారేళ్ళ వయసులో అంతటి గుర్తింపు అనూహ్యమైనదే’. ‘అంతే కాదు, ఈ యువ ఈతగాడు ఒకప్పటి ప్రఖ్యాత క్రీడాకారుడు శ్యాంప్రసాద్ […]

చంద్రోదయం – 14

రచన: మన్నెం శారద సారధి బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి టేబుల్ మీద లెటర్ వుంది. అది శేఖర్ దస్తూరి గుర్తుపట్టేడు సారధి. వెంటనే ఆత్రంగా విప్పేడు. డియర్ సారధి, నువ్వెళ్లిపోయాక వైజాగ్ కళ పోయింది. సముద్రం చిన్నబుచ్చుకుంది. బీచ్ రోడ్డు బావురుమంటోంది. ఎల్లమ్మ తోట సెంటర్ వెలవెలా బోతోంది. మరి నీకక్కడ ఎలావుందో? ఈ పరిస్థితిలో స్వాతే లేకపోతే నీ ఎడబాటు నాకు పిచ్చెక్కించేసేదే. నీ బెంగవల్లనేమో నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మరేం కంగారుపడకు. కాస్త […]

అమ్మమ్మ – 24

రచన: గిరిజ పీసపాటి వారం రోజులు ఉన్నాక తిరిగి విశాఖపట్నం వెళ్ళి, అక్కడి నుండి హైదరాబాదు వెళిపోయింది అమ్మమ్మ. తరువాత రెండు సంవత్సరాల పాటు మళ్ళీ నాగను, మనవలను చూడడానికి వెళ్ళలేకపోయింది. మూడవ సంవత్సరం సంక్రాంతికి ‘నాగను పిల్లలనీ తీసుకుని తెనాలి రమ్మని, అక్కడ అందరూ ముఖ్యంగా పెద్దన్నయ్య కుటుంబం నాగను చూడాలని ఉందని తనకు ఉత్తరాలు రాసున్నారని, ఈ సంవత్సరం పండుగ తెనాలిలో జరుపుకుందామ’ని పెదబాబుకి ఉత్తరం రాసింది అమ్మమ్మ. ‘ఆ విషయం మా నాన్నని […]

వినిపించని రాగాలే

రచన: శివలక్ష్మి రాజశేఖరుని ఆమె మనసులో ఏముందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆమె కళ్ళల్లోకి చూసి తన మనసు చదవగలిగే తనను ఎందుకో ఈ మధ్య అర్థం కాని ఆమె ప్రవర్తన గందరగోళంలో పడేస్తోంది. వరండాలో పడక్కుర్చీలో పడుకుని అలోచిస్తున్నాడు పరంధామయ్య. 40 ఏళ్ల తమ సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఇసుమంత తరగని స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళది. ప్రణయ కలహాలు చిలిపి తగాదాలే కానీ పెద్ద అభిప్రాయ భేదాలు ఏవి లేపు […]