రచన: చంద్రశేఖర్

తెలుగంటే భాష కాదు దైవం
తెలుగంటే సరస్వతి రూపం
తెలుగంటే తీయని మమకారం
తెలుగంటే అమ్మ ప్రేమ అమృతం

తెలుగంటే ఓంకారంతో శ్రీకారం
తెలుగంటే చక్కని సంస్కారం
తెలుగంటే పల్లె సంప్రదాయం
తెలుగంటే కష్టానికి తగిన ఫలం

తెలుగంటే జ్ఞానానికి మూలధనం
తెలుగంటే బతుకు బండి ఇంధనం
తెలుగంటే వీరుల చిరస్మారకం
తెలుగంటే అందరికీ ఆదర్శం

తెలుగంటే పోతన కవి కల వర్షం
తెలుగంటే ఎలుగెత్తిన శ్రీ శ్రీ హాహాకారం
తెలుగంటే ఎందరో కవులకు నిలయం
తెలుగంటే ‌మది పులకించే కమ్మని భావం

తెలుగంటే గోదావరి నదీ ప్రవాహం
తెలుగంటే పరిమళాల పూలవనం
తెలుగంటే సంక్రాంతి సంబరం
తెలుగంటే ఉగాది నూతన ఉత్సాహం

తెలుగంటే చిగురించే నవ వసంతం
తెలుగంటే తొలకరి చినుకుల వర్షం
తెలుగంటే మంచు కురిసే హేమంతం
తెలుగంటే మాటలతో చేసే నాట్యం

తెలుగంటే మౌనాన్ని తుంచే ఖడ్గం
తెలుగంటే వెలుగు పంచే మణి దీపం
తెలుగంటే దేశ భాష లందు లెస్స
తెలుగంటే అన్ని భాష లందు హైలెస్సా!!

మా తెలుగు తల్లికి
మంగళారతులతో

By Editor

One thought on “తెలుగు భాష”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *