April 24, 2024

యధారాజా తధాప్రజా

రచన: మోహనరావు మంత్రిప్రగడ

ఓ కళ్యాణ మండపంలో ఓ వేడుక జరుగుతోంది. వరసకి బావా, బావా అనుకొనే ఇద్దరు వయోవృద్దులు ఆ కార్యక్రమానికి తమ తమ కుటుంబాలతో సహావచ్చారు. బావ, బావమరదులిద్దరు ప్రక్క ప్రక్కల కుర్చీలేసుకొని కూర్చోన్నారు.”యధారాజా తధాప్రజ అంటే ఏమిటండి బావగారు” అడిగాడు అందులో ఒకాయన. ఆయన పేరు రామనాధంగారు.
“ఏంలేదు బావగారు ఏదేశరాజైన ధర్మాత్ముడైతే, ఆ దేశ ప్రజలందరు ధర్మంగా ఉంటారు. అలాగే
రాజు దుర్మార్గుడైతే ప్రజలు అలాగే ఉంటారని దానర్దం” అని చెప్పారు.
ఆ రెండో ఆయన ఆయన పేరు విశ్వనాధంగారు. “అది నాకు తెలుసు బావగారు, నేనడిగింది ప్రస్తుత కాలంలో అలాంటివి ఏమయినా ఉంటే చెప్పండి చూద్దాం” అని చమత్కరించారు.
రామనాధంగారు. “కంగారెందుకు బావగారు ఇక్కడే చూపిస్తాను కొంచంసేపు ఆగండి” అని
సమాధానం చెప్పారాయన.
ఇంతలో ఆయన మనవరాలు అటుకేసి వస్తూ కనిపించింది. “తల్లి పండుగాడు ఏమిట్రా హడావిడిగా వెడుతున్నావు” అని అడిగారు.
“ఏం లేదు తాతగారు బైటకెల్దామని, ఏం మీకేమయినా కావాలా, కాఫి తెమ్మంటారా” అని అడిగింది ఆయన మనవరాలు దగ్గరకొచ్చి.
ఇంతలో ఆయన కుమారుడు, కోడలు ఆయన దగ్గరగా వచ్చి “మేం ఓసారి బైటకెళ్ళొస్తాం. మీకు ఏమయినా కావాలా? అందాకా నీరసం వస్తే రెండు బిస్కట్లు తినండి, కాఫి తాగుతారా” అని అడిగింది కోడలు.
“వద్దమ్మా! వెళ్ళిరండి. తొందరగా వచ్చేయండి, ఎండగా వుంది” అని అన్నారు విశ్వనాధంగారు. “అలాగే జాగ్రత్త బయటకెళ్ళకండి” అని చెప్పి కొడుకు, కోడలు బైటకి నడిచారు.
“ఏమిటండి బావగారు ఏదో నిరూపిస్తానని మీ కుటుంబం ముచ్చట చూపించారు, అంతెనా ఇంకేంలేదా” అని కాస్త వ్యంగ్యంగా నవ్వారు రామనాధంగారు.
“కంగారు పడకండి బావగారు కొంచం ఓర్పు వహించండి కొంచం సేపట్లో మీకే తెలుస్తుంది” అని తాపీగా నవ్వారు విశ్వనాగారు.
ఇంతలో రామనాధంగారి మనవరాలు అటు వెడుతూ కనిపించింది. ” మీ మనవరాల్ని పిలవండి బావగారు” అని అడిగారు విశ్వనాధంగారు.
ఇంతలో ఆ అమ్మాయే అలా వచ్చింది. “రాజి ఇలారావే” అని పిల్చారాయన. “ఎందుకు నీకు
పనిపాట ఏంలేదు, ఏవయినా కావలిస్తే వెళ్ళి తెచ్చుకోవచ్చుకదా ఊరికే అలా అరవకపోతే” అని అనేసి విసవిసా నడుచుకొంటూ వెళ్ళి పోయింది.
ఆ పరిణామాన్నించి ఇంకా తేరుకోకుండానే ఆయన కొడుకు కోడలు వచ్చి”ఎందుకండి అలా అస్తమానూ అరుస్తారు. ఎవయినా కావలిస్తే అక్కడ ఇస్తున్నారు కదా తెచ్చుకోవచ్చు కదా” అంది ఆయన కోడలు అయినా ఇంటిదగ్గర అలాగే ఉంటారు కదా, కనీసం బైటకొచ్చినప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండచ్చు కదా, ఇంకేం మాట్లాడకుండా కూర్చోండి” అని అనేసి ఇద్దరు వెళ్ళిపోయారు.
ఆ హటాత్ పరిణామానికి రామనాధంగారు అవాక్కఅయ్యారు. చిన్నబుచ్చుకొని తల దించుకు కూర్చున్నారు, కళ్ళు కూడా కొంచం చమర్చాయి. “బాధపడకండి బావగారు ఒక్కోక్కసారి అలాగే జరుగుతుంటాయి” అని వోదార్చారు విశ్వనాధంగారు.
“అదికాదు బావగారు మీ మనవరాలు పిలవగానే రావడం చాలా గౌరవంగా అభిమానంగా మాట్లాడడం,
అలాగే మీ అబ్బాయి కోడలు వచ్చీ ఎంత అభిమానంగా మాట్లాడారు, నాకు చాలా ముచ్చటేసింది బావగారు మీకలా జరగడం, నాకిలా అవడం ఏమిటి బావగారు” అని వాపోయాడాయన.
“అదే బావగారు కుటుంబసభ్యులు ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తే పిల్లలు కూడా అలాగే గౌరవిస్తారు. అదే యధారాజా తధా ప్రజా అంటే” అని నెమ్మదిగా చెప్పారు విశ్వనాధంగారు.
“అయినా రెండుచేతులూ కలిస్తేనే తప్పట్లు అంటారు కదా మనం కూడా కొంత అనుకూల దృక్పధంతో ఉండాలి. అన్నివిషయాలలోను తలదూర్చి సలహాలివ్వకూడదు. మన రోజులు వేరు ఇప్పటి పరిస్దితి వేరు. అంచేత మనం తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. అయినా కొన్నిసార్లు ఇలానే జరుగుతుంటుంది అయినా ఓర్పు వహించాలి మనలాంటి పెద్దవాళ్ళం. అలా ఉంటే వాళ్ళే గ్రహిస్తారు మంచిచెడ్డలు.ఇలా చెపుతున్నానని ఏం అనుకోకండి బావగారు” అని అనునయంగా భుజంమీద చెయ్యి వేసారు విశ్వనాధంగారు.
“క్షమించండీ బావగారు ఇందాకా మీతో చాలా వ్యంగ్యంగా మాట్లాడాను” అని విశ్వనాధంగారి రెండు చేతులూ పట్టుకొన్నారు రామనాధం గారు.
“పర్వాలేదులెండి బావగారు అదిగో భోజనాలకి పిలుస్తున్నారు లేవండి” అని లేచారు విశ్వనాధంగారు.
********

2 thoughts on “యధారాజా తధాప్రజా

  1. ఇందులో చాలా అచ్చు తప్పులు ఉన్నాయి. ఉదా. యధా రాజా తధా ప్రజ (ఉండాల్సింది యథా రాజా తథా ప్రజ) రామనాధం – రామనాథం, విశ్వనాధం-విశ్వనాథం) మొదలైనవి చాలా ఉన్నాయి. సరిచూసుకోండి

Leave a Reply to వెంకటస్వామి Cancel reply

Your email address will not be published. Required fields are marked *