April 19, 2024

రైతే దేవుడు

రచన: మోహన మణికంఠ

తల్లి గర్భంలో అండ సృష్టి చేసేవాడు మాధవుడు,
నేలతల్లి గర్భంలో విత్తు నాటే వాడు మన కర్షకుడు.

కడుపులో పెరుగతున్న బిడ్డపై తల్లికి ఎంత ప్రేమో,
పుడమిలో మొలకెత్తుతున్న విత్తుపై కూడా ఆ తల్లికి అంతే ప్రేమా!!

కాన్పు సమయంలో అమ్మ పడే ప్రసవ వేదనలా బహుశా విత్తు మొక్కగా మొలిసిన సమయంలో నేలమ్మా అంతే వేదన అనుభవిస్తుందేమో..

నారు పోసినవాడే నీరు పోయును అనే నానుడిలా
బిడ్డకు భగవంతుని దీవన, మొక్కకి రైతు ఆలనా.

ఎదుగుతున్న పిల్లలని చూసి
మాతృ హృదయపు ఆనందం,
పెరుగుతున్న మొక్కలను చూసి
ధరణి తల్లి సంతోషం
రెండూ అపురూపమయం.

నూకలు చెల్లాయని దేవుడు,
ఊడ్పులు పట్టాలి అని మన రైతు దేవుడు
అకస్మాత్ గా పిల్లలని తనతో తీసుకువెళ్లిన వేళ
ఆ తల్లుల బాధ వర్ణానాతీతం.

ఎంతైనా దేవుడు దొడ్డోడు కదా,
ఏమి చేసినా అందరి మంచికే!!

2 thoughts on “రైతే దేవుడు

Leave a Reply to డాక్టర్. పెద్దగొల్ల నారాయణ. Cancel reply

Your email address will not be published. Required fields are marked *