April 24, 2024

మట్టి మగువ ప్రభలు

రచన: కాదంబరి కుసుమాంబ ఏకవీరా దేవి కోవెలలో ప్రదక్షిణలు చేసి, పూజారి స్వామి ఆశీస్సులు అందుకుని, గుడి వసారాలో కూర్చున్నాడు భైరవి రాజ గురు. వృద్ధాప్యం, కాలం – పోటాపోటీగా తన మేనులోని శక్తిని తూకం వేస్తున్నవి. గుడి వరండా పావంచా మెట్లు ఇరు పక్కలా ఏనుగులు ఒద్దికగా కూర్చుని, భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నవి. ఆ బొమ్మలను ప్రేమగా నిమురుతూ కూర్చున్నాడు భైరవ, పల్లె పాకలోని గురుకులం మాదిరి పాఠశాల – ఎర్ర ఏగాణీ తీసుకోకుండా […]

యధారాజా తధాప్రజా

రచన: మోహనరావు మంత్రిప్రగడ ఓ కళ్యాణ మండపంలో ఓ వేడుక జరుగుతోంది. వరసకి బావా, బావా అనుకొనే ఇద్దరు వయోవృద్దులు ఆ కార్యక్రమానికి తమ తమ కుటుంబాలతో సహావచ్చారు. బావ, బావమరదులిద్దరు ప్రక్క ప్రక్కల కుర్చీలేసుకొని కూర్చోన్నారు.”యధారాజా తధాప్రజ అంటే ఏమిటండి బావగారు” అడిగాడు అందులో ఒకాయన. ఆయన పేరు రామనాధంగారు. “ఏంలేదు బావగారు ఏదేశరాజైన ధర్మాత్ముడైతే, ఆ దేశ ప్రజలందరు ధర్మంగా ఉంటారు. అలాగే రాజు దుర్మార్గుడైతే ప్రజలు అలాగే ఉంటారని దానర్దం” అని చెప్పారు. […]

సత్యమేవ జయతే

రచన:జి.వి.ఎల్. నరసింహం ఆ పట్టణంలో నున్న బ్యాంకులలో, ప్రైవేటు రంగంలో గల కనకలక్ష్మీ బ్యాంకు, చాలా పెద్దది. ఆ ఊళ్ళో పండ్రెండు శాఖలతో బాటు, రీజియనల్ మేనేజరు వారి కార్యాలయం కూడా ఉంది. ఆ బ్యాంకులోని ఒక శాఖలో, వెంకటాద్రి గత ముఫై సంవత్సరాల నుండి ప్యూనుగా పని చేస్తున్నాడు. నమ్మకస్తుడని, కష్టబడి పని చేస్తాడని, పేరు తెచ్చుకొన్నాడు. మరో నెలలో రిటైర్ కాబోతున్నాడు. ఒక రోజు, మేనేజరు వెంకటాద్రిని పిలిచి, “వెంకటాద్రి, వచ్చే నెలలోనేనా నువ్వు […]

“మూలాలు”

రచన: విజయలక్ష్మీ పండిట్ కృష్ణచైతన్యకు ఆ రోజు ఒకచోట కాలు నిలవడం లేదు. తమ్ముడు శ్రీ రమణ ఫామిలీతో క్రిస్మస్ సెలవులలో అమెరిక నుండి ఇండియా వస్తున్నాడు. శ్రీరమణ, జయలక్ష్మి , పిల్లలు ఆదిత్య ,ఆద్య వాళ్ళందరితో గడపడం కృష్ణకు సుజాతకు పండగ. వాళ్ళందరికి ఎవరెవరికి ఏమి ఇష్టమో రాసుకుని తెచ్చి పెట్టడం, రమణ కోసం కొత్త నవలలు , కథల పుస్తకాలు కొనిపెట్టే హడావిడిలో వున్నాడు కృష్ణ చైతన్య. సుజాత భర్త హడావుడి గమనిస్తూనే రమణకు […]

కథల వేదిక “గల్పికా తరువు”

సమీక్ష: సరోజన బోయిని మనసును దోచే చిన్న, చిన్న కథల వేదిక ఈ “గల్పికా తరువు”. 104 మంది రచయితల కథల సమూహమే ఈ “గల్పికా తరువు”. కేవలం 200 పదాలతో అర్థవంతమైన ఓ కథను అందించడం. రచయుతల సృజనకు పరీక్ష లాంటిది.. ప్రతీ రచయిత చిత్త శుద్ధితో విభిన్న కోణాలలో విభిన్న కథలను అందించారు. ఎవరి శైలిలో వాళ్ళు రచయితలు వారి కథలకు న్యాయం చేశారు. సమాజ నైజాన్ని చూపించిన కథలు కొన్ని, సామజిక దృక్పధంతో […]

విభిన్న పార్శ్వాల కొత్త కోణం – బోల్డ్ & బ్యూటిఫుల్

సమీక్ష: యడవల్లి శైలజ ( ప్రేమ్) ‘ బోల్డ్ & బ్యూటిఫుల్ ‘ పుస్తకం పేరు వినగానే మనకు కొంచెం అర్థమై పోతుంది. ఉన్నది ఉన్నట్టు వాస్తవికతను వెల్లడి చేస్తాయి ఈ కథలన్నీ అని. డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్టు రచన చేసి పాఠకులను మెప్పించడం అనేది ఏ రచయితకైనా కాస్త కష్టమైన పని నిజాన్ని నిర్భయంగా రాయడానికి కూడా ఆలోచించుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఈపుస్తక రచయిత్రి అయిన ‘ అపర్ణ తోట ‘ […]

బ్రహ్మవేత్త, ప్రశ్నోపనిషత్తు ఆవిష్కర్త ‘పిప్పలాదుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తు శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు. ప్రశ్నోపనిషత్తు పది ముఖ్య ఉపనిషత్తులలో ఒకటి. ఈయన దయాళువు. త్యాగశీలి. దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు. దధీచి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన ఎముకలను దేవతలకు దానము చేస్తే, వాటితో వారు బ్రహ్మ చక్రము, ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకొని […]

తపస్సు – పాకురు మెట్ల దిగుడు బావి

రచన: రామా చంద్రమౌళి బతుకుతూ చనిపోతూ మళ్ళీ బతుకుతూ చనిపోతూ ఇక చనిపోతూనే బతకడం అలవాటైన తర్వాత జీవితం స్థానికమో , ప్రవాసమో , ప్రవాస స్థానికమో అర్థంకాలేదామెకు మనిషి ఎక్కడ జీవిస్తూంటే అదే స్వస్థలమని తెలుస్తోందామెకు – రాత్రంతా ఆమె ఒంటరిగా మగ్గాన్ని నేస్తూనే ఉంది ఒక నిర్విరామ లయాత్మక శబ్దం బయటా .. లోపల గుండెలో ఆమె నేసే బట్ట రేపు ఎవరికి వస్త్రంగా మారుతుందో తెలియదు – యుగయుగాలుగా నడచి వచ్చిన దారుల్లో […]

తెలుగు భాష

రచన: చంద్రశేఖర్ తెలుగంటే భాష కాదు దైవం తెలుగంటే సరస్వతి రూపం తెలుగంటే తీయని మమకారం తెలుగంటే అమ్మ ప్రేమ అమృతం తెలుగంటే ఓంకారంతో శ్రీకారం తెలుగంటే చక్కని సంస్కారం తెలుగంటే పల్లె సంప్రదాయం తెలుగంటే కష్టానికి తగిన ఫలం తెలుగంటే జ్ఞానానికి మూలధనం తెలుగంటే బతుకు బండి ఇంధనం తెలుగంటే వీరుల చిరస్మారకం తెలుగంటే అందరికీ ఆదర్శం తెలుగంటే పోతన కవి కల వర్షం తెలుగంటే ఎలుగెత్తిన శ్రీ శ్రీ హాహాకారం తెలుగంటే ఎందరో కవులకు […]