April 20, 2024

తపస్సు – రైలుపట్టాలపై నడక

రచన: రామా చంద్రమౌళి

మంచును చీల్చుకుంటూ చినుకులు కురుస్తూనే ఉన్నాయి సన్నగా
ఎర్రగా ఉదయిస్తూ సూర్యుడు .. ఎదుట
ఆమె.. నేను
ముందర రెండు రైలు పట్టాలు ధగధగా మెరుస్తూ
నాల్గు పాదాలు.. రెండు శరీరాలు..ఒక్కటే ఆత్మ
కంకర రాళ్ళు.. గాయాలను జ్ఞాపకం చేస్తూ.. సాక్షులు
మౌనమే.. కళ్ళనిండా
వడివడి నడక.. పరుగా.?
దూరంగా భూమ్యాకాశాలను కలుపుతూ.. క్షితిజరేఖ
ఎక్కడ మొదలై.. ఎక్కడకు సాగి.. ఎక్కడ ముగుస్తుందో ,
పట్టాలకిరువైపులా.. బోగన్‌ విల్లా పూలు
గుత్తులు గుత్తులుగా.. ఎరుపు.. తెలుపు.. స్వర్ణవర్ణం
‘వాసన లేనిపూలు.. బుధవర్గము లేని పురంబు .. ’
కలియని సమాంతర రేఖలను ఒక తిర్యక్‌ రేఖ ఖండిరచినపుడు
ఏర్పడు శీర్షాభిముఖ జీవితాలు అసమానాలా.?.. ప్రశ్న
ఒక్కొక్కరి వెనుక సముద్రమంత గతం
ఎదుట.. ఇగిరిపోతూ చెరువంత భవిష్యత్తు
బావిలో నుండి నీటిని చేదుతున్నట్టు
బొక్కెనతో శక్తినంతా కూడగట్టుకుంటూ
తడబడని అడుగులతో నడక.. పరుగు
చీకటి వెళ్ళిపోతోందో.. వెలుగు వరదై వస్తోందో తెలియని
సంధి సమయపు సంధిగ్ధ సంధ్య
ఎవరు ముందు.. ఎవరు వెనుక
మంచు విడిపోతున్నప్పుడు.. ఎవరిది గెలుపు.. ఎవరిది ఓటమి
రెండు పట్టాలు కలుస్తూ.. ఒక జంక్షన్‌
ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నపుడు
అకస్మాత్తుగా నాలుగు కళ్ళలో.. మహాసముద్రమంత నవ్వు
ఒక్కోసారి.. పందెంలో ఇద్దరూ గెలుస్తారు –

Translated by Purushothama Rao Ravela

A Walk on the Rails

Shattering the thickly encompassed fog,
the tiny showers begin their fall ceaseless.
The Sun with thickly red rays start to rise.
She and I, ahead of the rails, sizzling high in bright sheen.
Four feet, two bodies and one soul.
The concrete pebbles lying there, stand as mute witnesses
duly reminding us the past wounds.

Very strict silence fill her eyes.
Fast steps turn to a swift run there after.
At far off distance joining both the earth and sky, the horizon!
Where it starts, to where it continues
to stretch further, at what point it comes to end?
On both sides of the rails, bougainvillea trees, stand alert
in blooming colours of red,
white and shiny gold in large bunches.
Scentless flowers, non-availability of genius lots.
When two parallel lines dissected by one virgule,
There comes out lives in vertically opposite directions.
Behind Every existing human, there existed, a sea like past.
Just ahead of this past features,
an evaporating future like a vast tank .
As if we are drawing water from deep down the well,
with a bucket, while enlisting and exhausting
all energy and muscle power we derived, till that time.
With faltering steps, walking ahead
and it shifts to as a run in marathon.

Whether the darkness, exists, and
light flows out in flooded way, is exactly unknown.
This is a doubtful sign of twilight brightness.
Who is in the front row, who is following in the back?
When the thickly woven fog start to dismantle,
who is the ultimate winner and who is the loser?
Joining the two rails, there stands a junction.
When we look facing each other in close proximity,
there lies an ocean like smile seeming in four eyes.
At times, the two humans also for sure,
are likely to come out successfully as ultimate winners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *