September 21, 2021

దాగుడుమూతలు

రచన: అనుపమ పిల్లారిశెట్టి

గోడ వెనక గోడ
మధ్యలో ఇరికిన పిల్లవాడు.
అది వాడి ప్రయత్నం
కాంతిచిత్రంలో పడకూడదని…
ఛాయాగ్రహుడి చిన్న అభ్యర్థన
‘బయటికి రా రమ్మని’
వాడి సిగ్గూ, బిడియం రానివ్వలేదు…
సరికదా మరింత బిగుసుకున్నాడు.
వాడి అమాయకత్వం ప్రపంచం చూడాలి,
ఆ పెద్ద – పెద్ద కళ్ళు..కళ్ళల్లో కుతూహలం..
ఇంతలో…ఓ కన్నుతో తొంగి చూపు..
అంతే! క్లిక్కుమన్నది కెమెరా…
తెచ్చింది చిరునవ్వు చాయాగ్రహుని పెదవులపై
‘.వాడు తప్పక తొంగి చూస్తాడు ‘
అన్న అతని ఆత్మ విశ్వాసంతో.
ఇప్పుడా పిల్లవాడి కళ్ళల్లో కుతూహలం
అతను ఎందుకు నవ్వాడో ..అని..
కళ్ళతో ప్రశ్నిస్తుంటే
చాయాగ్రహుడు జేబులోంచి తీసి,
పూర్తిగా బయటకు వచ్చిన వాడి
చేతిలో పెట్టిన చాకొలేట్…
చిరునవ్వుతో విచ్చుకున్నాయి
పెదవులు పిల్లవాడివి.

1 thought on “దాగుడుమూతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *