March 28, 2024

ప్రాణబంధం

రచన: – కంచరాన భుజంగరావు,

పసిపాప
పాల నవ్వుల వెలుగులో
మురిసిపోయే మనసుకి
ముత్యమంత మురిపెం!

మత్తడి
పాలకంకుల గలంగళల సవ్వడిలో
ప్రజ్వరిల్లే తేజానికి
మొలక చురుకు!

లేత కొబ్బరి
పమిడి ఊటల తరళ స్వచ్ఛతలో
హరిత చమత్కారానికి
మచ్చుతునకల తూనిక!

పెదవి దొర్లే మాట
చిరుగాలి పలకరింపులో
పృథివి దాటే తీరుకి తార్కాణం
శబ్ద శరాల త్వరణం!

చూపుల ఉషస్సు
చెక్కిలి చాటు అరుణిమలో
ప్రతి ప్రాణబంధానికి
దివ్య దర్శనం!

నరునికి
అవ్యాజ
అనురాగ చెలిమి రూపంలో
అలరారు సుమమా
అపురూప శమమా
ప్రకృతి బంధమా
పచ్చని ప్రబంధమా
ప్రణామం! ప్రణామం!ప్రణామం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *