September 21, 2021

సాందీప మహర్షి

రచన: శ్యామసుందర రావు

మన హిందూ ధర్మములో గురువుకు చాలా ప్రాముఖ్యత ప్రత్యేకతలు ఉన్నాయి రాజులైన
మహాపురుషులైన గురువుల దగ్గర గురుకులాలలో గురువులకు సేవ చేసిన ప్రముఖులు
ఎంతమందో ఉన్నారు త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు వసిష్ఠల వారిదగ్గర
విశ్వామిత్రులా దగ్గర విద్య నభ్యసించాడు ఆయనతో పాటు అయన సోదరులు అలాగే
ద్వాపరయుగములో సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణపరమాత్ముడు
,బలరాముడు అవంతికాపురములో (ప్రస్తుత ఉజ్జయిని) సాందీపుడు అనే మహర్షి
ఆశ్రమములో విద్యనభ్యసించారు వారితో పాటు కడు సామాన్యుడు సుదాముడు
(కుచేలుడు) కూడా వారితో పాటు సహాయధ్యాయుడిగా గా ఉన్నాడు ఆనాటికాలంలో
విద్యాభ్యాసము పూర్తిచేసుకున్నాక శిష్యులు గురువులకు వారి
అభీష్టానుసారముగా శక్త్యానుసారముగా గురు దక్షిణ చెల్లించుకొని
వెళ్లేవారు గురువులు కూడా గొప్ప మహర్షులు అవటం వలన ఏ రకమైన స్వార్ధము
లేకుండా వారెంతటివారైనా విద్యాబోధన చేసేవారు అటువంటి గురువులలో
సాక్షాత్తు శ్రీకృష్ణ పరామాత్మునికి బలరామ కృష్ణులు గురువైన సాందీపుడు
అనే గొప్ప మహర్షి గురించి తెలుసుకుందాము
భాగవత పురాణములో సాందీపుని ప్రస్తావన వస్తుంది. సాందీపుడు
అవంతికాపురములో ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ శిష్యులకు
విద్యాబోధన చేస్తుండేవాడు. సాందీపుడు చిన్నతనంలోనే అన్ని వేద శాస్త్రాలు,
వేద రహస్యాలు తెలుసుకున్న దయాశీలి సాత్వికుడు,
నిరంతరం విష్ణు పూజ వ్రతుడు సాందీపునికి వివాహము అయినాక ఒక కొడుకు
పుడతాడు ఆ కుమారుడు ఎల్లప్పుడూ విష్ణు పాద పద్మాలను ఆశ్రయించుకొని
ఉండేవాడు ఏక సంధాగ్రాహి అవటం వలన తండ్రి బోధించిన విషయాలను త్వరగా
నేర్చుకొనేవాడు తనకు సంసారము, చావు పుట్టుక సంతానము వంటి ఇహపర సౌఖ్యములపై
ధ్యాస లేదని తండ్రి సాందీపునితోఅంటూ ఉండేవాడు ఒకనాడు మాఘ పొర్ణమి
పుణ్యదినాన ప్రస్తుత సోమనాద్ దేవాలయానికి సమీపాన గుజరాత్ పశ్చిమ తీరాన గల
ప్రభాస తీరములో సముద్ర స్నానము చేస్తూ విష్ణుమూర్తిని తలచుకుంటూ నీటిలో
మునిగిపోతాడు ఎంతవెతికించిన ఆతను కనబడదు సాందీపుడు గొప్ప మహర్షి అవటం వలన
భవబంధాలకు అతీతుడు కాబట్టి తనకు ఇంతే ప్రాప్తము అని సరిపెట్టుకున్నాడు
కానీ భార్య పుత్రశోకంతో నిత్యమూ కుమిలి పోతూ ఉండేది
కంసుడిని వధించినాక బలరామ కృష్ణులకు దేవకీ వసుదేవుల గర్గుడు మొదలైన
మహర్షుల సమక్షంలో ఉపనయనము జరిపించి సాందీపుని దగ్గరకు విద్యాభ్యాసము
కోసము పంపిస్తారు.బలరామ కృష్ణులు కాశీకి బ్రహ్మచారులై చేరి అక్కడి నుండి
అవంతికాపురములోని సాందీపుని ఆశ్రమముకు చేరి గురువుగారికి సాష్టాంగ
ప్రమాణము చేసి శిష్యులుగాచేరుతారు బలరామ కృష్ణులు సాక్షాత్తు జగదురువులు
సర్వజ్ఞులు అయినప్పటికీ గురువు ద్వారా గురువుకు సేవ చేస్తూ నేర్చుకున్నదే
విద్య అని లోకానికి తెలియజేయటం కోసము సాధారణ వ్యక్తులవల శిష్యులుగా చేరి
విద్యాభ్యాసము చేయనారంభించారు . ఏకసంధాగ్రాహులు అవటం వలన గురువుగారు
చెప్పిన విషయాలను త్వరగా నేర్చుకునేవారు బలరామ కృష్ణులు ధనుర్విద్యను,
అస్త్ర శస్త్రలను 64 రోజులలో నేర్చుకున్నారు అలాగే గుర్రపు స్వారీ ఏనుగుల
స్వారీని 12 రోజులలో నేర్చుకున్నారు వేదాలను 50 రోజులలోనేర్చుకున్నారు
ఇది వారి కుశాగ్రబుద్ధికి నిదర్శనము
సాందీప మహర్షి అవంతికా పురానికి జయత్సేన మహారాజు ఆహ్వానము మీద
వచ్చినప్పటికీ ఆయనకు ద్వారకలో గోమతి నది మీద మమకారము పోలేదు అందుచేత రోజు
శ్రమపడి గోమతి నదికి వెళ్లి స్నానము చేసి వచ్చేవాడు శ్రీకృష్ణుడు ఇది
గమనించి గురువుగారి శ్రమను తొలగించటానికి అవంతికాపురములో గోమతి కుండాన్ని
నిర్మించాడు శ్రీకృష్ణుని చర్యకు గురువుగారు చాలా సంతోషించాడు.ఆ విధముగా
సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మునికి బలరాముని గురువుగా ఉండే అదృష్టము
కొన్ని వేలమంది మహర్షులలో ఒక్క సాందీపునికీ దక్కింది ఆ విధముగా సాందీపుడు
గొప్ప అదృష్టవంతుడు
విద్యాభ్యాసము ముగించుకున్నాక శిష్యులు గురువుగారికి గురుదక్షిణ
సమర్పించుకోవటం మామూలే. మనము ఏకలవ్యుడు చేతి బొటనవ్రేలిని గురివైన
ద్రోణుడికి సమర్పించటం అలాగే అర్జునుడు గురువైన ద్రోణుడికి ద్రుపద
మహారాజును ఓడించి బందీగా చేసి గురువుగారి కాళ్ళమీద పడవేయటం విన్నాము ఇవి
గురుదక్షిణగా శిష్యులు చేసినపనులు కానీ బలరామ కృష్ణులు సాందీప మహార్షికి
సమర్పించిన గురుదక్షిణ చాలా భిన్నమైనది ఇతరులకు అసాద్యమైనది శ్రీకృష్ణుడు
భగవత్ స్వరూపుడు కాబట్టి ఆయనకు అటువంటి గురుదక్షిణ ఇవ్వటం
సాధ్యమైనది.ఆచార ప్రకారము బలరామ కృష్ణులు విద్య ముగించుకున్నాక
గురువుగారిని గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారు అని వినయముగా అడుగుతారు. కానీ
గురువుగారు నాకు ఏమి అక్కరలేదు మీరు గురుపత్నిని అడగండి ఆవిడకు కావలసినది
మీరు ఇవ్వలేరు ఆవిడ నిత్యమూ చనిపోయిన కొడుకును తలచుకొని ఏడుస్తూ ఉంటుంది
ఆవిడకు తన కొడుకు కావాలి అంటుంది కాబట్టి వీలయితే నా కొడుకుని తిరిగి
తెచ్చిగురుదక్షిణగా ఇవ్వండి అని బలరామ కృష్ణులతో చెపుతాడు.
సాందీపుని కొడుకు సముద్రములో మునిగిపోయాడన్న విషయము తెలుసుకొని బలరామ
కృష్ణులు సముద్రుని దగ్గరకు వెళ్లి సాందీపుని కొడుకును తిరిగి
ఇవ్వవలసినదిగా అడుగుతారు సముద్రుడు తనలో ఉన్న శంఖాసురుడు అనే రాక్షసుడు ఆ
బాలుడిని మింగేశాడు అని చెపుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రములోకి
వెళ్లి ఆ రాక్షసుడి కడుపును చీలుస్తాడు కానీ ఆ రాక్షసుడి ఉదరంలో బాలుడు
ఉండదు కానీ ఒక శంఖము ఉంటుంది శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని తీసుకొని
యమలోకానికి వెళ్లి శంఖాన్ని పూరిస్తాడు యముడు ఆ శంఖారావం విని భయపడి
శ్రీకృష్ణుని సమక్షానికి వస్తాడు శ్రీకృష్ణుడు వచ్చిన కారణము తెలుసుకొని
సాందీపుని కుమారుడిని అప్పగిస్తాడు. ఆ బాలుడితో బలరామ కృష్ణులు
ఆశ్రమానికి చేరి గురువు గారికి వారి కుమారుడిని అప్పజెప్పి గురువుగారి
ఆశీర్వాదము తీసుకొని వెళతారు సాందీపుడు కూడా తన శిష్యుల ప్రతిభకి
అసాధ్యాన్ని సుసాద్యము చేసిన వారి గొప్పతనానికి సంతోషిస్తాడు ఆ తరువాత
శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పుతూ దైవ చింతనతో కాలము వెళ్లబుచ్చుతాడు
శ్రీకృష్ణ పరమాత్ముడు అంతైవాడిని శిష్యునిగా పొందిన సాందీపని మహర్షి
నిజముగా గొప్పవాడు అంతటి అదృష్టము పొందినవారు చాలా అరుదుగా ఉంటారు

1 thought on “సాందీప మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *