April 19, 2024

స్వప్నం

రచన: చంద్ర శేఖర్. కె

స్వప్నం ఒక పూల బాట ఐతే
జీవితం ఒక ముళ్ల బాట

మనకు నచ్చినది స్వప్నం
జీవితం ఇచ్చినది వాస్తవం

స్వప్నం ఒక స్వర్గం
వాస్తవం ఒక నరకం

స్వప్నంలో నాతో
ముచ్చటించిన ఒక తార
వాస్తవంలో తళుక్కున
ఒక మెరుపులా మెరిసింది

నేటి స్వప్నం నిజం
అవుతుందో లేదో
తెలియదు కానీ
రేపటి స్వప్నం
అవుతుందని
మాత్రం తెలుసు

వాస్తవానికి భిన్నంగా
కనిపించేదే స్వప్నం అని
నా మనసు నాకు ఎప్పుడూ
చెపుతూ ఉన్నా, నా మనసు
స్వప్నాన్నే కోరుకుంటుంది
ఎందుకంటే ఆ క్షణమైనా
ఆనందాన్ని పొందగలను అని

నిజ జీవితంలో ఎప్పుడు
ఎంత వేడినా కనిపించని
నా దేవుడు, ఖచ్చితంగా
ఎదో ఒక సందర్భంలో
నా స్వప్నంలో మాత్రం
దర్శనం ఇస్తాడు

ప్రేమించినపుడు పరాకాష్ట
స్వప్నంలో కనపడింది
వాస్తవంలో ఎన్నో కష్టాలు
పెట్టింది

నీకు నేనేంటో పూర్తిగా
తెలియాలి అంటే
ఒక్కసారి నా స్వప్నంలోకి
ఒచ్చి నన్ను చూడు
ఎందుకంటే నా వాస్తవం
నీకు అబద్దం అనిపించినా
నా స్వప్నం ఎప్పుడూ
మోసం చెయ్యదు

మదిలో పుట్టిన ఆశ అనే స్వప్నం
నిశీధిలో నన్ను ఒంటరిని చేసింది

నన్ను నిన్ను చేరమని
నా స్వప్నం పదే పదే
నాకు గుర్తు చేస్తుంది
కానీ నా వాస్తవం అది నీకు
తెలియచేయలేక
నలిగిపోతుంటే
అయినా సరే వదలకు
దరి చేరు చేరు అని
మరల మరలా నా స్వప్నం
నిను చూసుకోమని
హెచ్చరిస్తూనే ఉంది

నా స్వప్నం నిజం
ఆయే వరకు
ఎన్ని యుగాలైనా
నీకోసమే వేచి ఉంటాను
అని నా స్వప్నం మీద
నిజం అనే ప్రమాణం
చేస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *