రచన : డా|| బాలాజీ దీక్షితులు పి.వి
నీ వేట మెుదలయింది
అని నాకు నిజంగా తెలీదు
ఊహలకందని విపత్తులు
ఊసులకందని గమ్మత్తులు
తెలుసుకోలేక పోయా
ఇంకా భవిష్యత్తు అంటే
జ్యోతిష్యమో
గ్రహాల గమనమో
గ్రంధాల సారమో
కాదు అని గుర్తించలేకపోయా
విజయాలకోసం
గుడికి ప్రదక్షిణలు
దేవుడికి దక్షిణలు
పూజలు – ఉత్సవాలు
దండాలు అని భ్రమపడి పోయా
కానీ
ఈర్ష్య -అసూయలు
ద్వేషాలు -విద్వేషాలు
ఉన్నచోటే నేనుంటా
అంటుంది … వినాశనం
మనిషీ నీకు నీవే కారణం
అని తెలుసుకోమంటుంది
కాలం- ప్రకృతి
1 thought on “నీ వేట మెుదలయింది”