March 29, 2024

స్వప్నం

రచన: చంద్ర శేఖర్. కె స్వప్నం ఒక పూల బాట ఐతే జీవితం ఒక ముళ్ల బాట మనకు నచ్చినది స్వప్నం జీవితం ఇచ్చినది వాస్తవం స్వప్నం ఒక స్వర్గం వాస్తవం ఒక నరకం స్వప్నంలో నాతో ముచ్చటించిన ఒక తార వాస్తవంలో తళుక్కున ఒక మెరుపులా మెరిసింది నేటి స్వప్నం నిజం అవుతుందో లేదో తెలియదు కానీ రేపటి స్వప్నం అవుతుందని మాత్రం తెలుసు వాస్తవానికి భిన్నంగా కనిపించేదే స్వప్నం అని నా మనసు నాకు […]

నీ వేట మెుదలయింది

రచన : డా|| బాలాజీ దీక్షితులు పి.వి నీ వేట మెుదలయింది అని నాకు నిజంగా తెలీదు ఊహలకందని విపత్తులు ఊసులకందని గమ్మత్తులు తెలుసుకోలేక పోయా ఇంకా భవిష్యత్తు అంటే జ్యోతిష్యమో గ్రహాల గమనమో గ్రంధాల సారమో కాదు అని గుర్తించలేకపోయా విజయాలకోసం గుడికి ప్రదక్షిణలు దేవుడికి దక్షిణలు పూజలు – ఉత్సవాలు దండాలు అని భ్రమపడి పోయా కానీ ఈర్ష్య -అసూయలు ద్వేషాలు -విద్వేషాలు ఉన్నచోటే నేనుంటా అంటుంది … వినాశనం మనిషీ నీకు నీవే […]

ప్రాణబంధం

రచన: – కంచరాన భుజంగరావు, పసిపాప పాల నవ్వుల వెలుగులో మురిసిపోయే మనసుకి ముత్యమంత మురిపెం! మత్తడి పాలకంకుల గలంగళల సవ్వడిలో ప్రజ్వరిల్లే తేజానికి మొలక చురుకు! లేత కొబ్బరి పమిడి ఊటల తరళ స్వచ్ఛతలో హరిత చమత్కారానికి మచ్చుతునకల తూనిక! పెదవి దొర్లే మాట చిరుగాలి పలకరింపులో పృథివి దాటే తీరుకి తార్కాణం శబ్ద శరాల త్వరణం! చూపుల ఉషస్సు చెక్కిలి చాటు అరుణిమలో ప్రతి ప్రాణబంధానికి దివ్య దర్శనం! నరునికి అవ్యాజ అనురాగ చెలిమి […]

చిన్న గల్పికలు గొప్ప ఆలోచనలు – గల్పికా తరువు సమీక్ష

సమీక్ష: యడవల్లి శైలజ ( ప్రేమ్) మనకు తెలియని విషయాన్ని నాకు తెలియదని నిర్భయంగా ఒప్పుకోవాలి అప్పుడే కదా మన వ్యక్తిత్వం ఏంటో మనం ఎంతవరకు నిజాయితీగా నిలబడగలం అని మన గురించి మనకు తెలిసేది. ” గల్పికలు ” అనే పదం నేను వినడం మొదటిసారి. సాహిత్య ప్రక్రియల్లో కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్ష, విమర్శ, పద్యాలు, నానీలు, తేనీయలు, చిమ్నీలు, చురకలు, మధురిమలు, నవల, పాటలు ఇవన్నీ నేను విని ఉన్నాను. కొన్ని ప్రక్రియలు […]

భావసుధలు పుస్తక సమీక్ష

సమీక్ష: రాజ్యలక్ష్మి. ఎ భావసుధలు అన్న శీర్షికతో పదాలు భావలనే అమృతాలను 27 కథలలో పూరించి కూరించి రూపొందించిన సంకలనం. దైనందిన జీవితంలో రచయిత్రికి ఎదురైన స్పందింపజేసిన సంఘటనలు ప్రవృత్తుల గురించి , తనదైన శైలి లో కథలను మలిచే గట్టి ప్రయత్నం చేశారు.విజయులూ అయ్యారు. అన్ని కథలలోను ఒక ఉద్యోగస్తురాలైన మహిళ సమాజంలో తనకు తారసపడిన విభిన్న పరిస్తితులలో ఉన్న మనుషులకూ ముఖ్యంగా మహిళలకు చేయందించే వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ కథలన్నింటిలో .. ప్రతి […]

సురవరం మొగ్గలు చిరస్మరణీయ గుర్తులు

సమీక్ష: – బోల యాదయ్య తెలుగు సాహిత్యంలో కొందరు చిరస్థాయిగా నిలిచిపోయే వారున్నారు. వారు తెలుగు భాషాభివృద్దిని , తెలుగు వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టి సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయారు. అందులో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక్కరు. అజ్ఞానమును పారద్రోలి ఐక్యమత్యమును పెంపొందించి తెలంగాణ ప్రజలను మేల్కోల్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి. కవిగా , రచయితగా, పరిశోధకుడిగా , పత్రికసంపాదకుడిగా, భిన్న కోణాలలో తెలుగు భాషా సాంస్కృతిక సేవ చేశారు. అట్లాంటి మహనీయుని సంస్మరిస్తూ అతని […]

సాందీప మహర్షి

రచన: శ్యామసుందర రావు మన హిందూ ధర్మములో గురువుకు చాలా ప్రాముఖ్యత ప్రత్యేకతలు ఉన్నాయి రాజులైన మహాపురుషులైన గురువుల దగ్గర గురుకులాలలో గురువులకు సేవ చేసిన ప్రముఖులు ఎంతమందో ఉన్నారు త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు వసిష్ఠల వారిదగ్గర విశ్వామిత్రులా దగ్గర విద్య నభ్యసించాడు ఆయనతో పాటు అయన సోదరులు అలాగే ద్వాపరయుగములో సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణపరమాత్ముడు ,బలరాముడు అవంతికాపురములో (ప్రస్తుత ఉజ్జయిని) సాందీపుడు అనే మహర్షి ఆశ్రమములో విద్యనభ్యసించారు వారితో పాటు కడు సామాన్యుడు సుదాముడు (కుచేలుడు) […]