April 19, 2024

10. మాలక్ష్మీజ్యువెల్ – ఉగాది కథలపోటి

రచన: సంధ్య యల్లాప్రగడ “భోంచేద్దాం రండి!” రవి పిలిచాడు ప్రభాకరరావును. పలకలేదు ఆయన. ఈ సారి కొద్దిగా గొంతు పెంచి “నాన్నా!” అన్నాడు. “అరుస్తావేం?” విసుక్కున్నాడు ప్రభాకరరావు. “అరవలేదు పిలిచాను. రండి భోజనానికి!” ఇద్దరూ బల్ల దగ్గర చేరారు. “ఏం ఆలోచించావు?” ‘’మీరేమనుకుంటున్నారు?” “లాయరు మురళీ అంకుల్ని సలహా అడుగుతాను”. “సరే!” రెట్టించలేదు రవి. తినటంలో మునిగిపోయాడు. **** “మురళీ! సమస్య వచ్చిందిరా. . ” “నీకేం సమస్యలుంటాయిరా. రిటైర్డు మాష్టారువి. కళ్ళలో పెట్టుకు చూసుకునే కోడలు. […]

రాజీపడిన బంధం – 15

రచన: కోసూరి ఉమాభారతి “నేను అన్నయ్యలా భావించే ఆనంద్ గారంటే, నాకున్న గౌరవం ఈ రోజు రెట్టింపయ్యింది. నీవు నా స్నేహితురాలవైనందుకు కూడా నాకెంతో గర్వంగా ఉంది చిత్రా” అన్నాను. “అవును, ఈ కుటీరాన్ని ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించినట్టుగా ఉంది. ఆనంద్, నీవు కూడా ఎంతో గొప్ప ఆలోచనలు ఉన్నవారని తెలుస్తుంది చిత్రా” అంది రమణి. “సరే తల్లీ మీ పొగడ్తలు ఆపండమ్మా! సమాజం లోని నిరాశ్రయులకి, మా వంతు చేయూత నిద్దామన్న ప్రయత్నం తప్ప […]

అమ్మమ్మ – 25

రచన: గిరిజ పీసపాటి అల్లుడు వైజాగ్ వెళ్ళాక, ఊరిలో ఉన్న బంధువుల ఇళ్ళకీ, నాగ స్నేహితురాళ్ళ ఇళ్ళకీ వెళ్ళడం, వాళ్ళతో కలిసి విందు భోజనాలు, సినిమాలతో రోజులు త్వరగా గడిచిపోసాగాయి. నెలరోజుల తరువాత అల్లుడు తిరిగి వచ్చి “వారం రోజులు సెలవు పెట్టాననీ, మీరు చెప్పిన బంధువుల ఇళ్ళకు వెళ్ళి, అటునుండి వైజాగ్ వెళిపోతామని” చెప్పడంతో సరేనంది అమ్మమ్మ. గుంటూరు, విజయవాడ, పొందూరు మొదలైన ఊర్లలో ఉన్న బంధువుల ఇళ్ళకు వెళ్ళి, అక్కడి దేవాలయాల సందర్శనం చేసుకుని, […]

చంద్రోదయం 15

రచన: మన్నెం శారద ఇంతకూ అతను తనని నిజంగా ప్రేమించి వుండక పోవచ్చు. ఆ వయసు కుర్రాళ్లలా తమాషాకి అతనూ చేయి వూపి వుండొచ్చు. నిజంగా ప్రేమించి వుంటే తనని వెతుక్కుంటూ రాడూ. తన ప్రేమని తెలుపుకోడూ. ఇలా రోజూ ఎంతమందిని చూసి చిరునవ్వులొకల బోస్తాడో.”టాటా” చెబుతాడో. ఆమె నిస్పృహగా నిట్టూర్చింది. అయినా ఆమె విశాలమైన కళ్లు ఎన్నాళ్లపాటో రెప్పవేయడం మర్చిపోయి రోడ్లన్నీ అతని కోసం గాలించేవి. కనీసం అతని పేరు కూడా తెలియదు. ఏం చేస్తాడో […]

తామసి – 7

రచన: మాలతి దేచిరాజు     నసీమా ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది… పోలీస్ లు గబగబా దిగి ఇంట్లోకి చొరబడ్డారు. అత్తగారు యథావిధి… మామగారు కంగారు పడ్డాడు.. “రసూల్ మీ అబ్బాయేనా?” అడిగాడు ఎస్.ఐ. “మా అబ్బాయే… ఏమైంది సార్?” తత్తరపడుతూ అడిగాడు. ఇంతలో నసీమా వచ్చింది, వంటింట్లోనుంచి. “మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్స్ లో డబ్బులు పోగొట్టుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ ఒకతన్ని కత్తితో పొడిచాడు… ఇప్పుడతను హాస్పిటల్ లో చావు బతుకుల […]

అత్తగారూ… ఆడపడుచు…

రచన: — మణి గోవిందరాజుల “రండి రండి వదినగారూ! నిన్న ఉండమంటే ఉండకుండా వెళ్ళారు. ఈ రోజు ఇంత ఆలస్యంగానా రావడం?” లోపలికి వస్తున్న వియ్యాలవారిని ఎదురెళ్ళి సంతోషంగా ఆహ్వానించారు దమయంతీ వాసుదేవ్ లు. “కాస్త ఊళ్ళో సెంటర్లో ఇల్లు తీసుకోవచ్చుకదండీ. వందసార్లు తిరిగే వాళ్ళం. అబ్బ! వదినగారూ! చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. మీరు ఈ చీరలో సూపరున్నారండీ” సరదాగా మాట్లాడుతూనే పొగడుతూ లోపలికి వచ్చింది పెద్ద వియ్యపురాలు. మురిసిపోయింది దమయంతి. “మీరు మరీను..రండి లోపలికి” చిన్నకోడలు సీమంతం […]

పొరపాటు

రచన: బి. రాజ్యలక్ష్మి   డియర్ రేఖా, ఈ  వుత్తరం చివరివరకూ చదువు ప్లీజ్.  ఆ రోజు నన్ను పిలిచి మరీ ‘ గుడ్ బై ‘ చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయావు.  ఒక్క మాట తో మన స్నేహాన్ని విడిచి పెట్టావు, .  రేఖా నాకు తెలిసినంత వరకు నీతో యెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు.  ఇతరులకు కష్టం కలిగించే మనస్తత్వం కాదు నాది.  నన్ను యెవరైనా బాధిస్తే నాలో నేనే బాధ పడతాను కానీ […]

తపస్సు – రైలుపట్టాలపై నడక

రచన: రామా చంద్రమౌళి మంచును చీల్చుకుంటూ చినుకులు కురుస్తూనే ఉన్నాయి సన్నగా ఎర్రగా ఉదయిస్తూ సూర్యుడు .. ఎదుట ఆమె.. నేను ముందర రెండు రైలు పట్టాలు ధగధగా మెరుస్తూ నాల్గు పాదాలు.. రెండు శరీరాలు..ఒక్కటే ఆత్మ కంకర రాళ్ళు.. గాయాలను జ్ఞాపకం చేస్తూ.. సాక్షులు మౌనమే.. కళ్ళనిండా వడివడి నడక.. పరుగా.? దూరంగా భూమ్యాకాశాలను కలుపుతూ.. క్షితిజరేఖ ఎక్కడ మొదలై.. ఎక్కడకు సాగి.. ఎక్కడ ముగుస్తుందో , పట్టాలకిరువైపులా.. బోగన్‌ విల్లా పూలు గుత్తులు గుత్తులుగా.. […]

జీవన సమీరం

రచన – డా. అర్చన ఆచార్య కన్నీరు ఇంకింది, మనసు మోడు వారింది నవ్వులో నిర్వేదం, నిండుగా నిండింది పుట్టింట రాణినైతి మెట్టింట జాణనైతి దృష్టికొక కోణమైతి విలువలేని వీణనైతి తింటివా అని అడిగేవారు లేక మిన్నకుంటివా అని ఓదార్చేవారు రాక మాటల అస్త్రాలు.. నిందల శస్త్రాలు అహాల మొహాలు.. అధికారాల దాహాలు మనసు పొరల తొక్కిపెట్టి పంటి కింద నొక్కిపెట్టి బాధనంత దాచిపెట్టి మోమున చిరునవ్వు చుట్టి చేపట్టిన తన తోడుకు అమృతమందించాలని అలవోకగా హాలాహలం […]

దాగుడుమూతలు

రచన: అనుపమ పిల్లారిశెట్టి గోడ వెనక గోడ మధ్యలో ఇరికిన పిల్లవాడు. అది వాడి ప్రయత్నం కాంతిచిత్రంలో పడకూడదని… ఛాయాగ్రహుడి చిన్న అభ్యర్థన ‘బయటికి రా రమ్మని’ వాడి సిగ్గూ, బిడియం రానివ్వలేదు… సరికదా మరింత బిగుసుకున్నాడు. వాడి అమాయకత్వం ప్రపంచం చూడాలి, ఆ పెద్ద – పెద్ద కళ్ళు..కళ్ళల్లో కుతూహలం.. ఇంతలో…ఓ కన్నుతో తొంగి చూపు.. అంతే! క్లిక్కుమన్నది కెమెరా… తెచ్చింది చిరునవ్వు చాయాగ్రహుని పెదవులపై ‘.వాడు తప్పక తొంగి చూస్తాడు ‘ అన్న అతని […]