August 17, 2022

ఇదీ కారణమేనా !

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి

శారద వెళ్లేసరికి రావమ్మ గిన్నెలు తోముతో౦ది. శారద మనస్సు చివుక్కుమంది శారదని చూసి రావమ్మ మొహము విప్పారి౦ది గాని, అ౦తలోనే కొ౦చెము జ౦కినట్లు అయ్యి౦ది. “ఇప్పుడే కాఫీగ్లాసులు లేవని “నసిగింది.
ఏమీ మాట్లాడలేదు శారద. కానీ అక్కడ ఆమె ఉన్న పరిస్థితి బట్టి, కూర్చున్న విధానము బట్టి చూస్తే అమె చాలాసేపటి నుంచి తోముతున్నట్లు స్త్రీగా తనకు అర్ధం కాకపోదు “దా. కాఫీ ఇస్తాను”. అంటూ మోకాళ్ళ మీద చేతులువేస్తూ లేవబోయింది.
“వద్దు. ఇప్పుడే ఆఫీసులో టీ తాగాను “అంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళ కి పాలు ఇచ్చింది. వద్దన్నా శారదకి కాఫీ ఇచ్చింది.
“కూర్చుని చేసే పనేగా” అంటూ కూరల బుట్ట ముందర వేసుకుని కూర్చుంది.
“ఇలా తే” లాక్కుని తను తరగసాగింది శారద. కబుర్లు మొదలెట్టింది రావమ్మ.
“నేనిక వెడతాను “అంది లేచి నిలబడుతూ శారద, నడుము లాగేస్తొంది. కిలో కూర. తనకే ఇలా ఉంటే పాపం ముసలావిడ, ఆవిడకి ఎలా ఉంటుంది ?
“వెడతావా? వెళ్ళు పాపం. భోజనం చేసి వెళ్ళండి అంటే వినరు, అతనితో వచ్చినా కూడా”
అంతలో బెడ్ రూం తలుపు తెరుచుకుంది. భారతి బైటికి వచ్చింది,
మొద్దు నిద్ర పొయిన మొహంతో. “ఎప్పుడొచ్చారు? ” అడిగింది.
“చాలసేపు అయ్యింది” ముభావముగా అని బయలుదేరింది.
ఎవరికైనా పుట్టింటి కొస్తే బాగుంటుంది. కానీ తనకి మాత్రం తల్లిని చూసి బాధగా ఉంటుంది. మరదలు ఇంటిలోనే ఉంటుంది. కానీ ఏ పనీ చెయ్యదు. అలా అని చెడ్డదీ కాదు. బద్ధకం. పోనీ పనిమనిషిని పెట్టదు. పిసినారి. డబ్బున్నా దేనికీ ఖర్చు పెట్టదు. అందుకే తల్లికి తిప్పలు.
పిల్లల పనులతో సహా అన్నీ తల్లే చెయ్యాలి. పిల్లలు తగని అల్లరి. ఇక తల్లి కొందరు కోడళ్ళలా కాక, తనని కోడలు ఇంటిలో ఉంచుకుంటున్నందుకే సంబర పడి పోతుంది. (కానీ అంత బాగా పిల్లలని చూసేవాళ్ళు ఎవరుంటారు?) తండ్రి లేడు.
తన భర్తకి కేంపులెక్కువ. ఇంట్లో ఉండడు. కొడుకు వేరే ఊరిలో మెడిసిన్ చేస్తున్నాదు. తమ ఇంట్లో అన్నిపనులకు మనుష్యులుంటారు. తన దగ్గరకి రమ్మని, ఏ శ్రమా లేకుందా చూసుకుంటాను అంటే వినదు. బాధగా ఇల్లు చేరింది
*****
ఆరోజు పొద్దున్నే తమ్ముడు దగ్గరనుంచి ఫోన్. తల్లి కళ్ళు తిరిగి పడి పోయిందని, ఫలానా హాస్పిటల్ కి రమ్మని ఫోన్ వచ్చింది. గాభరాగా పరిగెత్తింది. స్పృహ లేకుందా తలకి దెబ్బతో పడుకున్న తల్లిని చూసి ఏడుపు ఆగలేదు.
కళ్ళు తుడుచుకుంటున్న శారదతో నిష్టూరముగా “ ఒక చొట కూర్చొండి అంటె వినరు. ఊరికే తిరుగుతారు. అందరూ నన్ను ఆడీపోసుకొవటానికి” కోపముగా అంది భారతి.
వద్దంటె వె ళ్తుందో, తప్పకే వెళ్ళు తుందో. ఆ కాలనీలో అందరికి తెలుసు. బట్టలు ఉతుకుతూ జారి పడిందని లోక జ్ణానం పూర్తిగా రాని మేనకోడలు గేటుదగ్గరే చెప్పేసింది.
వార0 రోజులు శలవు పెట్టి తల్లిని కంటికి రెప్పలా చూసింది. గండం గడిచింది అన్నాడు డాక్టర్. ఆ రొజు భర్త కే0ప్ నుంచి వస్తాడు
అందుకే బ్రడ్ తినిపిస్తూ తల్లితో అంది.
‘ఈసారి మాత్రం నాతో వచ్చెయ్యాలిసిందె. లేకుంటే ఊరుకో ను తమ్ముడికి కూడా చెప్పేస్తాను. చేసినంత కాలం చేసావు. ఇంక రెస్ట్ తీసుకొ. కష్ట0మీద బతికావు. కూర్చోపెట్టి చే స్తాను, చేయిస్తాను. వాళ్ళకీ బాధ్యతలు తెలవనీ“అంది
కొద్దిసెపు మౌనముగా ఉంది రావమ్మ. త రువాత కూతురి చెయ్యి పట్టుకు0టూ
“ఏమనుకోకమ్మా. నేను రాను. ” అంది. నూతిలోంచిలా వస్తొంది మాట. ఆశ్చర్యముగా చూసింది. శారద
ఈ ప్రతి పాదన చాలాసార్లు ఇదివరకు వచ్చి, కాదన్నా ఈసారి తల్లి కాదనదు అనుకొంది. “ఏమి? ఎందుకని ఇంకా గరుడ సేవలు మిగిలాయా” కోపముగా అంది
“కాదమ్మా అయినంత కాలము అయిపొయింది. నేను ఎక్కువ రొజులు బతకను. చివరలో నాకూ, వాడికీ ఎందుకే పడలేదనే చెడ్డపేరు. “అంది
“ అందుకె ఇప్పుడయినా సుఖపడుతావనే. నువ్వు ఎలా ఉంటావొ అందరికి తెలుసు. ఎవరూ ఎమీ అనుకోరు. అయినా నువ్వు కష్ట పడు తున్నావని తీసుకెళ్తున్నానని చెబుతానా ఏమిటి ? రవి (తన కొడుకు) వెళ్ళిపోయాక బెంగగా ఉందని, అమ్మని కొన్నాళ్ళు పంపమని అడుగుతాను. తమ్మున్ని రానీ. అడిగి తీసుకపోతాను “అంది శారద స్థిరంగా.
“ వద్దమ్మా. నువ్వు అడగకు నేను రాను “అంది రావమ్మ కూడా అలాగె స్థిరంగా.
“ “ఎందుకో చెప్పు. చచ్చే వరకూ చేద్దామనా, లేక చేస్తూనే చచ్చిపోదామనా”
“అదికాదె. నేనిక ఎంతో కాలము బతుకను కదా. కాశీ లో పోవాలి లేకుంటే( పెద్ద) కొడుకు దగ్గరపోవాలన్నారు కదా ముక్తికి. నాకు ఏకొడుకైన వాడేగా. అందుకే. . ఇక్కడె. . . . . . . ”నసిగింది
నిర్ఘా0తపో యింది శారద. ఇదా ఆమె అంతరంగం.
స్త్రీల సమస్యలకి, ముఖ్యముగా వ్రద్ధాప్యములొ, పెరగటానికి ఇదీ ఒక కారణ మెనేమో1ఏలా ఉన్నా, ఏలాంటి పరిస్తితి లోనూ కొడుకులిని వదలకపొవటం. అందువల్ల కొన్నిచోట్ల కోడళ్ళ నిరాదరణ, వ్రద్ధాశ్రమాలు పాలవటం !. ఇందులో కోడళ్ళ తప్పూ లేదు. రక్త బ0ధం ఉన్నచొటే ప్రమ బ0ధం ఎక్కువ ఉంటుంది కదా. సేవలు చెయ్యగలరు అసహ్యము లేకుండా. ఇక్కడ అత్తా కోడళ్ళ మధ్య రక్త బంధం ఉండదుగా.
అందుకే “ఎక్కడ ఉంటెనేమి? నా పిల్లలేగా” అనుకుని సంఘం, సనాతన సాంప్రదాయం, అలవాట్లు, పద్ధతులు మొదలైనవి పక్కకు పెట్టీ, వారి, వారి పరిస్తితులకి, అవకాశాలకి అనుగుణముగా, ముఖ్యముగా ఆడ వాళ్ళతో రక్త సంభంధం ఉన్నచొట, కనీసం వ్రద్దాప్యం లో ఉండటం అలవాటుగా మార్చుకుంటే,
వ్రద్ధాప్య సమస్యలు, ముఖ్యముగా స్త్రీల సమస్యలు కొంత అయినా తగ్గు తాయేమో. ఎందుకంటే పురుషుల్లో ఈ చాదస్తం తక్కువె. కొంచెం ఏమంటారు?

————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *